వైసీపీకి మరో షాక్! టీడీపీలోకి కుప్పం మున్సిపల్ చైర్మన్! కౌన్సిలర్లతో కలిసి అమరావతికి..
Thu Jul 11, 2024 16:43 Politicsఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పార్టీ దారుణ పరాభవం తర్వాత వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ మారుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు అధికార టీడీపీ, జనసేన పార్టీల్లోకి జంప్ చేయడంతో చిత్తూరు కార్పొరేషన్ అధికార కూటమి పరమైంది. తాజాగా వైసీపీకి మరో భారీ షాక్ తగలనుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ తో పాటు తొమ్మిది మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇంకా చదవండి: పర్సనల్ మెయిల్ ఐడీని ప్రకటించిన లోకేశ్! వాట్సాప్ కు వెల్లువెత్తుతున్న వినతులు!
ఇందుకోసం కౌన్సిలర్లతో కలిసి డాక్టర్ సుధీర్ గురువారం అమరావతికి వెళ్లినట్లు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ మంత్రిని కలిసి టీడీపీలో చేరే విషయంపై సుధీర్ చర్చలు జరిపారని, సదరు మంత్రి వీరిని అమరావతికి తీసుకెళ్లారని అనధికారిక సమాచారం. ఇక, పుంగనూరులో మున్సిపల్ చైర్మన్ సహా 11 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలో వారంతా టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆర్ధిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష! రాష్ట్రం మొత్తాన్ని నాకించేశారు! అంచనాలకు అందని జగన్ దోపిడీ!
ఛీ ఛీ.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికురాలిపై లైంగికదాడికి యత్నం! కిందపడిన బాధితురాలు!
ఒకేరోజు నాలుగు ఎత్తిపోతల పథకాలు ప్రారంభం ! కృష్ణమ్మకు పూజలు, నీటి ప్రవాహం!
ఊహించని మలుపు తిరిగిన రాజ్‌తరుణ్ వివాదం! బాంబు పేల్చిన మాల్వీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Kuppam #JoiningsintoTDP #Municipalchairman #DoctorSudheer #GoodbyeYCP
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.