బడ్జెట్ లో నీరు-చెట్టు పెండింగ్ బిల్లులకు రు. 256 కోట్లు కేటాయింపు! మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక సమీక్ష!

Header Banner

బడ్జెట్ లో నీరు-చెట్టు పెండింగ్ బిల్లులకు రు. 256 కోట్లు కేటాయింపు! మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక సమీక్ష!

  Wed Sep 18, 2024 21:32        Politics

నీరు-చెట్టు పెండింగ్ బిల్లులకు రు. 256 కోట్లు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన “ఆళ్ళ" 

 

ప్రస్తుత ఎన్.డి.ఎ. ప్రభుత్వంలో ఆర్థికపరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2014-2019 లో నీరు-చెట్టు పథకంలో అన్ని రకాల అనుమతులు తీసుకుని చేసిన పనులకు ప్రస్తుతం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో రు.256 కోట్లు కేటాయించటమే కాకుండా దీనిమీద జలవనరుల శాఖ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు, ఆర్ధిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ తో సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రైతుల ఖాతాల్లో నిధులు వెంటనే జమచేయటానికి చర్యలు తీసుకోమని కోరటం పట్ల రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నీరు-చెట్టు ఫిర్యాదుల విభాగం బాధ్యులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు ఈ రోజు సాయంత్రం విజయవాడలోని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యాలయంనుండి విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

 

ఇంకా చదవండిశుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిజగన్ స్క్రిప్ట్ తోనే హీరోయిన్ జెత్వానీపై కేసులు నమోదు! తప్పు చేసిన వారు ఎంతటి వ్యక్తులైనా! 

 

ఈ సందర్భంగా ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ 2019-2024 లో గత వై.సి.పి. ప్రభుత్వం ఉమ్మడి 13 జిల్లాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని రకాల అనుమతులు తీసుకుని రైతులు 28,857 పనులను రు.1707 కోట్లతో పూర్తి చేయటం జరిగిందని, దీనిలో రు. 1395 కోట్లకు సి.ఎఫ్.ఎం.ఎస్.లో టోకెన్ పడిన తరువాత కూడా రైతులకు బిల్లులు చెల్లించకుండా గత వై.సి.పి. ప్రభుత్వం నానా ఇబ్బందులు పెట్టగా, అప్పటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రాష్ట్ర టి.డి.పి. నీరు-చెట్టు ఫిర్యాదుల విభాగం సమన్వయంతో పనులు చేసిన అప్పటి రైతులు గత వై.సి.పి. ప్రభుత్వంపై 9,391 రిట్ పిటిషన్లు, 6,625 ధిక్కార పిటిషన్లు వేయగా విధిలేని పరిస్థితిలో ఎన్.డి.ఎ. ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేనాటికి హైకోర్టు ఆదేశాలతో రు.968 కోట్లు రైతులకు జమ చేసిందని, ప్రస్తుతం రు.427 కోట్లు కోర్టు కేసులకు సంబంధించి నీరు - చెట్టు బిల్లులు పెండింగ్లో వుండగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో మొదటి విడతగా కంటెంప్ట్ కేసులు, ఇన్టెరిమ్ ఫైనల్ ఆర్డర్లు, రిట్ పిటిషన్లుకు సంబంధించి రు.256 కోట్లు కేటాయించి ఇప్పటికే రు.48 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేయటం పట్ల “ఆళ్ళ" హర్షం వ్యక్తం చేశారు. మిగిలిన బిల్లులు కూడా రైతుల ఖాతాల్లో నవంబరు 30 లోపు జమ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పెండింగ్ బిల్లులు చెల్లించటానికి కృషి చేసిన జలవనరుల శాఖ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు, ఆర్ధిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ దీనికి సమన్వయానికి కృషి చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎం.ఎల్.సి. బీద రవిచంద్రయాదవ్ లకు రైతాంగం తరఫున "ఆళ్ళ" కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ నీరు-చెట్టు ఫిర్యాదుల విభాగం సభ్యులు చెన్నుపాటి శ్రీధర్, కవులూరి రాజా చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!

 

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!

 

మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..

 

సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!

 

ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌! వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌!

 

ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP