నిన్న తిరుమల లడ్డూ, నేడు సింహాచలం, జగన్ ఏం ఉద్దరించాడు..? ఎమ్మెల్యే ఫైర్..!

Header Banner

నిన్న తిరుమల లడ్డూ, నేడు సింహాచలం, జగన్ ఏం ఉద్దరించాడు..? ఎమ్మెల్యే ఫైర్..!

  Sat Sep 21, 2024 16:37        Politics

నేను చాలా ఆదా చేస్తానని, పైసా ఖర్చు పెట్టనని, ఆంధ్రప్రదేశ్ ను ఉద్ధరించడానికి నేను అధికారంలోకి వచ్చానని, నా అంత మంచివాడు ఎవ్వరూ లేరనే మంచి పేరు తెచ్చుకోవాలని అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ అమలు చేసిన రివర్స్ టెండరింగ్ వల్ల అనేక అనర్థాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. శనివారం సింహాచలం ఆలయంలో ముడి సరుకులను టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా నెయ్యి రుచి చూసిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సింహాచలం ప్రసాదం లడ్డు తయారు చేసే నెయ్యిలో రుచి, వాసన రెండూ లేకపోవడం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సింహాచలం ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం గంటా శ్రీనివాసరావు అక్కడ భక్తులతో మాట్లాడి స్వామివారి ప్రసాదాల నాణ్యతపై భక్తుల అభిప్రాయం తెలుసుకున్నారు. అనంతరం గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు.

 

ఇంకా చదవండి: వైసీపీకి మరో బిగ్ షాక్! రేపు జనసేన లోకి మాజీ ఎమ్మెల్యే!

 

ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా కిలో నెయ్యి రూ. 591 నుంచి రూ. 391 తగ్గిపోయిందని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇక్కడ ఎక్కడా నెయ్యి దొరకనట్లు ఉత్తరప్రదేశ్ నుండి రూ. 391 రూపాయలకే కేజీ నెయ్యి సరఫరా చేస్తున్నారంటే ఆనెయ్యి నాణ్యమైనది, రుచికరమైనది అని ఎలా నమ్మగలం అని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీ నాయకులు ప్రశ్నించారు. తిరుమల లడ్డూల తయారిలో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె వంటివి వాడారని ల్యాబ్ నివేదికలో వెలుగు చూడడంతో కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విచారం వ్యక్తం చేశారు. శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డికి ఏ శిక్ష విధించాలో అనే విషయం స్వామివారి భక్తులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించాలని, ఆ నిర్ణయం ప్రజలరకే వదిలేస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇంత జరిగినా కూడా వైసీపీ నాయకులు చంద్రబాబు ప్రభుత్వం మీద ఎదురు దాడి చేస్తున్నారని గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల కూడా వీటిని పరిశీలిస్తున్నారని, ఏ స్థాయి వ్యక్తులకు ఇందులో ప్రమేయం ఉంది అన్నది ప్రశ్నార్థకంగా మారిందని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రసాదాలు నాణ్యంగా ఉండేటట్లు, దేవాలయాలకు పూర్వం వైభవం తీసుకొచ్చే విధంగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గంటా శ్రీనివాసరావు అన్నారు. దేవాలయాల్లో నాణ్యమైన ప్రసాదాల వ్యవస్థను భక్తులకు అందించడానికి, వాటిని చక్కదిద్దడానికి చంద్రబాబు నేతత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.

ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎదురుదాడి చేస్తే భయపడతాననుకుంటున్నారా.. తాట తీస్తా! చంద్రబాబు వార్నింగ్! ఈ సైకోలకు ప్రభుత్వం అంటే!

 

వైసీపీ మాజీ మంత్రి కొన్ని కోట్లు వసూలు! ఎవరి దగ్గర - ఎంతంటే! ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజాలు!

 

సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు.! ప్రకాశం పర్యటన ఖరారు! ఎందుకో తెలుసా?

 

ఉండేదెవరు..? పోయేదెవరు..? జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

 

ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

 

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!

 

వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?

 

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu