పదవి రాలేదని తొందర పడి మాట్లాడకండి తమ్ముళ్లు! అందరికీ న్యాయం చేస్తాం.. సీఎం భరోసా! నామినేట్ అయిన వారికి సీరియస్ హెచ్చరికలు!

Header Banner

పదవి రాలేదని తొందర పడి మాట్లాడకండి తమ్ముళ్లు! అందరికీ న్యాయం చేస్తాం.. సీఎం భరోసా! నామినేట్ అయిన వారికి సీరియస్ హెచ్చరికలు!

  Wed Sep 25, 2024 20:46        Politics

ఏపీలో కూటమి ప్రభుత్వం నిన్న 99 మందికి నామినేటెడ్ పదవులు కేటాయించిన సంగతి తెలిసిందే. 20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. కాగా, కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన వారితో సీఎం చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలో నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ముందుగా చెప్పినట్లు మూడు పార్టీల వారికి పదవులు ఇచ్చామని వెల్లడించారు. మొన్నటి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో ప్రత్యేకమైన విధానాన్ని పాటించామని, మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. నేడు నామినేటెడ్ పదవుల విషయంలో మంచి కసరత్తు చేసి పదవులు ప్రకటించామని స్పష్టం చేశారు. "ఫేజ్ 1లో ముందుగా కొందరికి పదవులు ఇవ్వగలిగాం. ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి... లిస్టులు ఉంటాయి. కొందరు నాయకులు తొందర పడుతున్నారు... ఇది మంచి పద్దతి కాదు. మన పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని గుర్తుపెట్టుకోవాలి. పార్టీ టిక్కెట్ ఇవ్వలేకపోయిన వారికి మొదటి లిస్టులో కొంత వరకు అవకాశం ఇచ్చాం. కష్టపడిన వారికి మొదటి లిస్టులో ముందుగా అవకాశాలు ఇచ్చాం... మీకు అవకాశాలు వచ్చాయి అంటే... మిగిలిన వారు పనిచేయలేదు అని కాదు, అర్హత లేదు అని కాదు. పార్టీ కోసం జైలుకు వెళ్లిన వాళ్లు, ఆస్తులు కోల్పొయిన వాళ్లు, కేసులు ఎదుర్కొన్న వారు ఉన్నారు. పార్టీకి ఎవరు ఎలా పనిచేశారో నా దగ్గర పూర్తి సమాచారం ఉంది. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వాళ్లు ఉన్నారు... ప్రతి ఒక్కరికి న్యాయం చెయ్యాలి అనే విషయంలో స్పష్టంగా ఉన్నాం.

 

ఇంకా చదవండి: శ్రీరాముడి గుడి రథానికి నిప్పు పెట్టిన కేసులో ట్విస్ట్! వైసీపీ నేత అరెస్టు!

 

కష్టపడిన ఏ ఒక్కరినీ విస్మరించం. నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం పాటించాం. జనాభా దామాషా లెక్కన బీసీలకు నామినేటెడ్ పదవుల్లో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం" అని చంద్రబాబు వివరించారు. ఇక, నూతనంగా నామినేటెడ్ పదవులు పొందిన వారు ఎలా నడుచుకోవాలన్నదానిపైనా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వంలో పదవి అనేది ఒక బాధ్యతని, మనలో ఎక్కడా అహంకారం కనిపించకూడదని స్పష్టం చేశారు. ఏ పదవిలో ఉన్నా మనం ప్రజా సేవకులం అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. "ప్రజల కంటే మనం ప్రత్యేకం అని భావించకూడదు.... మన నడవడిక, తీరు ప్రజలు గమనిస్తారు. మన ప్రతి కదలికా, మాటా, పని గౌరవంగా, హూందాగా ఉండాలి. మీ విభాగాలపై ముందుగా బాగా స్టడీ చేయండి. ఏ కార్యక్రమాలు చేపట్టవచ్చు అనే విషయాలపై లోతుగా కసరత్తు చేయండి. పెట్టుబడులు రాబడట్టడంలో పరిశ్రమల ఏర్పాటు చేయడంలో ఎపీఐఐసీ పాత్ర కీలకం. మౌలిక సదుపాయాల కల్పనతో పెద్ద పెద్ద కంపెనీలను తీసుకురావచ్చు. మనం పరిశ్రమల కోసం భూములు సేకరిస్తే... గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు వాటిని కేటాయించి లక్ష్యం నెరవేరకుండా చేసింది. పరిశ్రమలు వస్తే ఉపాధి, ఉద్యోగాలు వస్తాయి... కానీ జగన్ ఇళ్ల స్థలాల పేరుతో వాటిని ఇచ్చాడు. ఆర్టిసీని నిలబెట్టాలి... ఎలక్ట్రిక్ బస్సులు తేవాలి... కార్గో పెంచాలి. నేతలకే కాదు... ట్రాక్ రికార్డుల ఆధారంగా చిన్న స్థాయి నేతలకు కూడా కార్పొరేషన్ లలో అవకాశాలు ఇచ్చాం. బాగా పనిచేయండి... ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి. కష్టపడి పనిచేస్తే మరిన్ని మంచి అవకాశాలు వస్తాయి... మనకు వచ్చిన విజయాన్ని మరింత పెంచేలా ప్రతి ఒక్కరు పనిచెయ్యాలి. సింపుల్ గవర్నమెంట్... ఎఫెక్టివ్ గవర్నెన్స్ అని నేను, పవన్ కళ్యాణ్ గారు చెప్పాం. అందరూ అదే పాటించాలి. 15 రోజుల్లో వరద సాయం అందించాం... మళ్లీ బాధితులను నిలబెట్టే ప్రయత్నం చేశాం. ఇదీ మన విధానం... దీనికి అనుగుణంగా మీరు పనిచేయాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి, సమన్వయంతో మీరంతా పనిచేయాలని కోరుతున్నా. మీ వల్ల కూటమి ప్రభుత్వానికి పొలిటికల్ గెయిన్ ఉండాలి" అంటూ చంద్రబాబు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

 

ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ కు వరుసగా మరో షాక్! మీటింగ్ పెట్టి బ్రతిమిలాడుకుంటున్నా నో యూజ్! మరో ప్రముఖ మాజీ ఎమ్మెల్యే గుడ్ బాయ్!

 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!

 

అత్యాచారం కేసు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట!

 

నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. ఎంత దొంగలించారు? ఎవరు?

 

అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి! మరీ ఇంత దారుణమా - అసలు ఏమి జరిగింది అంటే!

 

విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్! పోస్టుల భర్తీ ప్రమాణాలు పెంచేలా చర్యలు!

 

పవన్ కల్యాణ్ నుంచి పవర్‍‌ఫుల్ వ్యాఖ్యలు... అండగా నిలబడాలి! సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే!

 

విశాఖలో రెండ్రోజుల పాటు మంత్రి నారా లోకేశ్ పర్యటన! కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన నేతలు!

 

మాజీ ఎంపీ సీఐడీ కస్టడీలో చిత్రహింసలు కేసులో కీలక మలుపు! రిటైర్డ్ ఎస్పీ ముందస్తు బెయిల్ కు హైకోర్టు షాకింగ్ తీర్పు!

 

ఏపీలో వైన్ షాపులకు రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్! గవర్నర్ రేపు ఆమోదముద్ర వేసే అవకాశం!

 

మరో శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. డైరెక్ట్ గా అకౌంట్లోకే రూ.1.05 లక్షలు! అది ఎవరెవరికంటే!

 

ఏడాదికి రూ.2 లక్షలకు పైగా జీతంతో ఉద్యోగాలు.. జాబ్ మేళా వివరాలివే! వయసు 19 పైన 30 లోపు!

 

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో ఎన్నికల హామీ నెరవేర్చిన ప్రభుత్వం! జగన్‌కీ చంద్రబాబుకీ తేడా ఏముంది?

 

వరద బాధితులకు గుడ్ న్యూస్.. ఆ రోజున ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.25వేలు!

 

మందుబాబులకు భారీ శుభవార్త.. సంబరాలే సంబరాలు! ఆ క్రమంలో మద్యం కొనుగోలు!

 

రైల్లో ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకెళ్తున్నారా.. జరిమానా చెల్లించాల్సిందే! ఎందుకంటే..

 

ఏపీలోకి జానీవాకర్, ఇంపీరియల్ బ్లూ, బ్లాక్ డాగ్, యాంటిక్విటీ వచ్చేశాయి! ఎవరికీ అనుమానం రాకుండా!

 

గిన్నిస్ బుక్ లోకి ఎక్కి రికార్డు బద్దలు కొట్టిన మెగాస్టార్ చిరంజీవి... అందరికి అత్యంత ఆసక్తి కలిగిస్తూ అమీర్ ఖాన్!

 

విశాఖ భూ వివాదంలో వైసీపీకి ఎదురుదెబ్బ! మున్సిపల్ శాఖ నుంచి స్పష్టమైన హెచ్చరిక!

 

అభయ్ నువ్వో సైకో .. బయటికిపో! బిగ్ బాస్ లో నాగార్జున! మిగతా వాళ్ల రిక్వెస్ట్ తో!

 

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! త్వరలో బీసీ పార్టీ!

 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ! ఎందుకో తెలుసా!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance