సిగ్గుందా జగన్.. చేసిన తప్పుకి శనివారం ప్రజలు పూజలు చేయాలంట! ముందు నీ భార్యతో కలిసి గుడికి వెళ్లి పూజలు చెయ్యి! దోపిడి సొమ్మంతా కక్కిస్తాం!

Header Banner

సిగ్గుందా జగన్.. చేసిన తప్పుకి శనివారం ప్రజలు పూజలు చేయాలంట! ముందు నీ భార్యతో కలిసి గుడికి వెళ్లి పూజలు చెయ్యి! దోపిడి సొమ్మంతా కక్కిస్తాం!

  Wed Sep 25, 2024 21:59        Politics

మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటనకు సిద్ధమయ్యారు. దేవుడిపై నమ్మకం ఉందని జగన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, తప్పుల మీద తప్పులు చేసి ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ పై మండిపడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే అన్యమతస్తులు రిజిస్టర్ లో కచ్చితంగా సంతకం పెట్టాలని, తిరుమల పవిత్రత కాపాడటానికి ఈ నియమాలు ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నాయని, ఇది తిరుమల ఆనవాయితీ అని మంత్రి పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు. వైసీపీ నాయకులు ఘోరమైన తప్పులు చేసి ఇప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ప్రజలను పూజలు చేయమంటున్నారని, పూజలు నిజంగానే చేయమంటున్నారా ? అని వైసీపీ నాయకులను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. గతంలో భక్తులకు అందించిన తిరుపతి లడ్డుకి, వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో భక్తులకు ఇచ్చిన తిరుమల లడ్డూకి ఎంతో తేడా ఉందని, ఆ విషయం శ్రీవారిని భక్తులు అడిగితే తెలుస్తుందని, అంతకుమించిన ప్రత్యేక పరీక్ష మరొకటి అక్కర్లేదని, భక్తులు తిరుమల లడ్డూ విషయంలో ఇచ్చే తీర్పుకు మేము అందరూ కట్టుబడి ఉంటామని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్ తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.

 

ఇంకా చదవండి: పదవి రాలేదని తొందర పడి మాట్లాడకండి తమ్ముళ్లు! అందరికీ న్యాయం చేస్తాం.. సీఎం భరోసా! నామినేట్ అయిన వారికి సీరియస్ హెచ్చరికలు!

 

జగన్ కు దేవుడిపై నమ్మకం లేకపోవచ్చు, కానీ ఆ దేవుడిని నమ్మే కోట్లాదిమంది భక్తులు ఉన్నారనే విషయం వైసీపీ నాయకులు మరిచిపోకూడదని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. తిరుమలలో లడ్డు వ్యవహారాన్ని వైసీపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని, కల్తీ నెయ్యి తిరుమల లడ్డూల కోసం ఉపయోగించారనేది పచ్చి నిజమని, నివేదికలలో కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగు చూసిన తర్వాతే తాము ఆ విషయాన్ని బయట పెట్టామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. టెస్టులు పాస్ అయిన తర్వాతే నెయ్యి ట్యాంకర్లు తిరుమల కొండపైకి పంపిస్తారని వైసీపీ నాయకులు చెబుతున్నారని, అయితే తిరుమలలో కొన్ని టెస్టులు మాత్రమే జరుగుతున్నాయని టీటీడీ ఈవో స్పష్టంగా చెప్పారని, ఆ విషయం వైసీపీ నాయకులకు వినపడటం లేదా అని మంత్రి పయ్యావుల కేశవ్ వైసీపీ నాయకులను ప్రశ్నించారు. తిరుమల అంశాన్ని పొలిటికల్ ఈవెంట్ లాగా వైసీపీ నాయకులు తయారు చేయడం చాలా బాధాకరమని మంత్రి పయ్యావుల కేశవ్ విచారం వ్యక్తం చేశారు. భక్తులు మనోభావాలతో ఆడుకోవడం, లడ్డు తయారీలో కల్తీ జరిగిందనేది నిజమని, అపచారం జరిగిందనేది నిజం అని దానిని ఎవరు కాదనలేరని, ఇన్ని రోజులు వైసీపీ నాయకులు ఆ విషయాన్ని దాచిపెట్టారని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. రాష్ట్రంలో పాలకుల మార్పుతోనే ప్రతి రంగంలోనూ మార్పులు మొదలైనాయని, తప్పులు సరిదిద్దే క్రమంలోనే గత పాలకులు చేసిన తప్పులు, నిజా నిజాలు వెలుగులోకి వచ్చాయని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అన్యమతస్తులు తిరుమల వెళ్లే సమయంలో రిజిస్టర్ లో కచ్చితంగా సంతకం చేయాలని, ఆ నియమాలను జగన్ పాటిస్తారా, లేదా ? అని మేము కూడా వేచి చూస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.

ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ కు వరుసగా మరో షాక్! మీటింగ్ పెట్టి బ్రతిమిలాడుకుంటున్నా నో యూజ్! మరో ప్రముఖ మాజీ ఎమ్మెల్యే గుడ్ బాయ్!

 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!

 

అత్యాచారం కేసు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట!

 

నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. ఎంత దొంగలించారు? ఎవరు?

 

అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి! మరీ ఇంత దారుణమా - అసలు ఏమి జరిగింది అంటే!

 

విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్! పోస్టుల భర్తీ ప్రమాణాలు పెంచేలా చర్యలు!

 

పవన్ కల్యాణ్ నుంచి పవర్‍‌ఫుల్ వ్యాఖ్యలు... అండగా నిలబడాలి! సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే!

 

విశాఖలో రెండ్రోజుల పాటు మంత్రి నారా లోకేశ్ పర్యటన! కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన నేతలు!

 

మాజీ ఎంపీ సీఐడీ కస్టడీలో చిత్రహింసలు కేసులో కీలక మలుపు! రిటైర్డ్ ఎస్పీ ముందస్తు బెయిల్ కు హైకోర్టు షాకింగ్ తీర్పు!

 

ఏపీలో వైన్ షాపులకు రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్! గవర్నర్ రేపు ఆమోదముద్ర వేసే అవకాశం!

 

మరో శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. డైరెక్ట్ గా అకౌంట్లోకే రూ.1.05 లక్షలు! అది ఎవరెవరికంటే!

 

ఏడాదికి రూ.2 లక్షలకు పైగా జీతంతో ఉద్యోగాలు.. జాబ్ మేళా వివరాలివే! వయసు 19 పైన 30 లోపు!

 

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో ఎన్నికల హామీ నెరవేర్చిన ప్రభుత్వం! జగన్‌కీ చంద్రబాబుకీ తేడా ఏముంది?

 

వరద బాధితులకు గుడ్ న్యూస్.. ఆ రోజున ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.25వేలు!

 

మందుబాబులకు భారీ శుభవార్త.. సంబరాలే సంబరాలు! ఆ క్రమంలో మద్యం కొనుగోలు!

 

రైల్లో ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకెళ్తున్నారా.. జరిమానా చెల్లించాల్సిందే! ఎందుకంటే..

 

ఏపీలోకి జానీవాకర్, ఇంపీరియల్ బ్లూ, బ్లాక్ డాగ్, యాంటిక్విటీ వచ్చేశాయి! ఎవరికీ అనుమానం రాకుండా!

 

గిన్నిస్ బుక్ లోకి ఎక్కి రికార్డు బద్దలు కొట్టిన మెగాస్టార్ చిరంజీవి... అందరికి అత్యంత ఆసక్తి కలిగిస్తూ అమీర్ ఖాన్!

 

విశాఖ భూ వివాదంలో వైసీపీకి ఎదురుదెబ్బ! మున్సిపల్ శాఖ నుంచి స్పష్టమైన హెచ్చరిక!

 

అభయ్ నువ్వో సైకో .. బయటికిపో! బిగ్ బాస్ లో నాగార్జున! మిగతా వాళ్ల రిక్వెస్ట్ తో!

 

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! త్వరలో బీసీ పార్టీ!

 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ! ఎందుకో తెలుసా!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu