ఈ కార్యక్రమం పండుగలా జరగాలి! డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు! ఇక వారం రోజులు పండగే!

Header Banner

ఈ కార్యక్రమం పండుగలా జరగాలి! డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు! ఇక వారం రోజులు పండగే!

  Sat Sep 28, 2024 07:18        Politics

అక్టోబర్ 14వ తేదీ నుండి ప్రతి పంచాయతీల్లో అభివృద్ధి పనులు మొదలు పెట్టాలని, 20వ తేదీ వరకూ వారం రోజుల పాటు పనుల ప్రారంభోత్సవాన్ని ఒక పండుగలా నిర్వహించాలని డిప్యూటి సీఎం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు. మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. 15వ ఆర్ధిక సంఘం నిధులతో చేపట్టే పనుల ప్రారంభం గురించి సమావేశంలో చర్చించారు.

 

ఇంకా చదవండి: గ్యాస్ ధరల్లో మార్పులు! అక్టోబర్‌ నుంచి అమల్లోకి వచ్చే మార్పులు ఇవే!

 

కూటమి ప్రభుత్వ పాలన మొదలైన మొదటి వంద రోజుల్లోనే 15వ ఆర్ధిక సంఘం నుండి రూ.1987 కోట్లు, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రూ.4500 కోట్లు నిధులు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించిందని, దీంతో గ్రామ పంచాయతీలకు నిధుల సమస్య లేదన్నారు. 14వ తేదీ నుండి 20వ తేదీ వరకూ పనులు ప్రారంభించే కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఒక వేడుకలా ఈ కార్యక్రమాలను నిర్వహించడం వల్ల గ్రామాల్లో తమకు వచ్చిన నిధులు, వాటితో చేసే పనులపై ప్రజలకు సమాచారం ఉంటుందన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, తనిఖీలు చేయాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వెబ్ సైట్, డ్యాష్ బోర్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్. కమిషనర్ కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు. 



ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!

 

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక రేషన్ టెన్షన్ లేనట్లే! ఇదే జరిగితే, ఏర్పాటు చేస్తే లబ్దిదారులకు!

 

పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!

 

జగన్ కు వరుసగా మరో షాక్! మీటింగ్ పెట్టి బ్రతిమిలాడుకుంటున్నా నో యూజ్! మరో ప్రముఖ మాజీ ఎమ్మెల్యే గుడ్ బాయ్!

 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!

 

అత్యాచారం కేసు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట!

 

నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. ఎంత దొంగలించారు? ఎవరు?

 

అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి! మరీ ఇంత దారుణమా - అసలు ఏమి జరిగింది అంటే!

 

విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్! పోస్టుల భర్తీ ప్రమాణాలు పెంచేలా చర్యలు!

 

పవన్ కల్యాణ్ నుంచి పవర్‍‌ఫుల్ వ్యాఖ్యలు... అండగా నిలబడాలి! సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే!

 

విశాఖలో రెండ్రోజుల పాటు మంత్రి నారా లోకేశ్ పర్యటన! కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన నేతలు!

 

మాజీ ఎంపీ సీఐడీ కస్టడీలో చిత్రహింసలు కేసులో కీలక మలుపు! రిటైర్డ్ ఎస్పీ ముందస్తు బెయిల్ కు హైకోర్టు షాకింగ్ తీర్పు!

 

ఏపీలో వైన్ షాపులకు రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్! గవర్నర్ రేపు ఆమోదముద్ర వేసే అవకాశం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples