ఏపీలో ఇంటర్ విద్యార్థులకు అలర్ట్! ఇకపై ఆ కొత్త రూల్ అమలు!

Header Banner

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు అలర్ట్! ఇకపై ఆ కొత్త రూల్ అమలు!

  Sun Sep 29, 2024 07:40        Politics

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ముఖ్యగమనిక.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చినట్లే.. ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రోగ్రెస్‌ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈమేరకు ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ డైరెక్టర్‌ కృతిక శుక్లా అధికారుల్ని ఆదేశించారు. ఇప్పటికే ప్రోగ్రెస్ కార్డు నమూనాను కాలేజీలకు పంపించారు. అయితే ఇంటర్ కూడా వృత్తివిద్యా కోర్సుల విద్యార్థులకు తెల్లరంగు, జనరల్‌లో ఫస్టియర్ వారికి లేత పసుపు, సెకండియర్ వారికి లేత నీలం రంగు కార్డులను ముద్రించి, ఇవ్వాలని సూచించారు. అంతేకాదు వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్‌లో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ అమలు చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంటర్మీడియట్‌ ప్రశ్నపత్రాల్లో మార్పులు తీసుకోస్తామన్నారు.

 

ఇంకా చదవండిగ్యాస్ ధరల్లో మార్పులు! అక్టోబర్‌ నుంచి అమల్లోకి వచ్చే మార్పులు ఇవే! 

 

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు అక్టోబరు 15 నుంచి 21 వరకు త్రైమాసిక పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి షెడ్యూల్‌ విడుదల చేసింది. ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.. సెకండియర్ వారికి ఉదయం 11 గంటల నుంచి 12.30 గంటల వరకు రోజుకో పరీక్ష నిర్వహిస్తారు. అంటే దసరా సెలవుల అనంతరం విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలను నిర్వహించబోతున్నారు.

 

ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మరోవైపు జేఈఈ, నీట్, ఈఏపీ సెట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణకు సంబంధించి.. విద్యార్థులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించాలన్నారు లోకేష్. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఇంటర్మీడియట్ విద్యపై కనీస సమీక్ష లేదని.. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చాలా అవసరమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సదుపాయాలపైనా ఫోకస్ పెట్టాలని మంత్రి లోకేష్ అధికారుల్ని ఆదేశించారు. విద్యా వ్యవస్థలలో అవసరమైన అన్ని మార్పులు కచ్చితంగా చేస్తామని.. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరుసగా అధికారులతో సమీక్షలు చేస్తున్నారు.. విద్యాశాఖకు సంబంధించి అంశాలపై ఫోకస్ పెట్టారు.. ఓ వైపు సమస్యల్ని పరిష్కరిస్తూనే మరోవైపు ప్రక్షాళన కూడా చేపట్టారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!

 

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక రేషన్ టెన్షన్ లేనట్లే! ఇదే జరిగితేఏర్పాటు చేస్తే లబ్దిదారులకు!

 

పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!

 

జగన్ కు వరుసగా మరో షాక్! మీటింగ్ పెట్టి బ్రతిమిలాడుకుంటున్నా నో యూజ్! మరో ప్రముఖ మాజీ ఎమ్మెల్యే గుడ్ బాయ్!

 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!

 

అత్యాచారం కేసు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP