తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సిట్ దర్యాప్తు బ్రేక్! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

Header Banner

తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సిట్ దర్యాప్తు బ్రేక్! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

  Tue Oct 01, 2024 14:34        Politics

తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలపై సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందా లేదా వ్యవహారంపై దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసి ధర్మాసనం.. విచారణను 3వ తేదీ వరకు వాయిదా వేసింది. అలాగే ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేయాలా..? లేదా..? అనే విషయంపై కూడా అప్పుడే క్లారిటీ ఇస్తామని వ్యాఖ్యానించడమే కాకుండా సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని కూడా సుప్రీంకోర్టు కోరింది.

 

ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు (మంగళవారం) కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే వరకు సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ ప్రకటించారు. కోర్టులో విచారణ నేపథ్యంలో దర్యాప్తునకు తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నామని, ఈ నెల 3వ తేదీన సుప్రీం తీర్పు వచ్చిన తర్వాత దాని ఆధారంగా ముందుకెళ్లడం జరుగుతుందని ఆయన ప్రకటించారు.

 

ఇంకా చదవండిహైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు షాక్‌! అక్టోబర్‌ 6 నుంచి ఆ స్టేషన్లలో పార్కింగ్‌ ఫీజు వసూలు! 

 

ఇదిలా ఉంటే తిరుపతి లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ అయిందని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్యస్వామితో పాటు టీటీడీ మాజీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

 

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు!

 

ఆంధ్రాలో అమెరికా వీసా అప్లికేషన్ కౌన్సిలేట్ సెంటర్! స్టూడెంట్స్వ్యాపారస్తులకు తొలగనున్న ఇబ్బందులు! ఎప్పుడు మొదలవుతుంది అంటే!

 

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో రాష్ట్ర మంత్రి భేటీ! పలు అంశాలపై చర్చ!

 

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త! రికార్డు స్థాయిలో వీసా అపాయింట్మెంట్లు జారీకి ఆమోదం! స్టూడెంట్స్వ్యాపారస్తులుతల్లిదండ్రులు ఫుల్ ఖుషి!

 

దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం! అసలు జరిగింది అంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP