ఎక్కువమంది ఎంపీలను గెలిపించి మంచి పనిచేశారు! జగన్ వెళుతూ వెళుతూ ఖజానా ఖాళీ! ఇక నుంచి జీతాల కోసం ఎవరూ!

Header Banner

ఎక్కువమంది ఎంపీలను గెలిపించి మంచి పనిచేశారు! జగన్ వెళుతూ వెళుతూ ఖజానా ఖాళీ! ఇక నుంచి జీతాల కోసం ఎవరూ!

  Tue Oct 01, 2024 16:49        Politics

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ (అక్టోబరు 1) కర్నూలు జిల్లా పుచ్చకాయలమడ గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిందని మండిపడ్డారు. జగన్ వెళుతూ వెళుతూ ఖజానా ఖాళీ చేసి వెళ్లారని ఆరోపించారు. రూ.10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. కానీ ప్రజలు ఎన్నికల్లో ఎంతో చైతన్యంతో ఓట్లు వేసి కూటమికి విజయం అందించారని కొనియాడారు. కూటమి తరఫున ఎక్కువమంది ఎంపీలను గెలిపించి మంచి పని చేశారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ రూ.4 వేలు చేశామని, ఇప్పుడు ఒకటో తేదీ నాడే అధికారులు మీ ఇంటికొచ్చి పెన్షన్లు ఇస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ పెన్షన్ల పంపిణీని శాశ్వతంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఉద్యోగులకు నెలనెలా జీతాలు, పెన్షన్లు ఇస్తున్నామని, ఇక నుంచి జీతాల కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెప్పారు. 

 

ఇంకా చదవండి: తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సిట్ దర్యాప్తు బ్రేక్! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

అతడిని (జగన్) తాను పాబ్లో ఎస్కొబార్ తో పోల్చుతుంటానని, ఎస్కొబార్ పెద్ద స్మగ్లర్ అని, అమెరికాకు మత్తుపదార్థాలు స్మగ్లింగ్ చేసేవాడని వెల్లడించారు. ఎవరైనా ఎదురుతిరిగితే వివేకానందరెడ్డి మాదిరిగా ఎగిరిపోయేవాళ్లని వ్యాఖ్యానించారు. ఎస్కొబార్ ఇలాంటివి ఎన్నో చేసేవాడని, ఇతను (జగన్) కూడా ఎస్కొబార్ లాంటి వ్యక్తి అని చంద్రబాబు విమర్శించారు. తన జీవితంలో అనేకమంది రాజకీయనేతలను చూశాను కానీ, ఇలాంటి వ్యక్తిని మాత్రం ఎక్కడా చూడలేదని అన్నారు. సొంత బాబాయ్ నే లెక్కలోకి తీసుకోని వ్యక్తి.. మిమ్మల్ని, నన్ను లెక్కలోకి తీసుకుంటాడా అని వ్యాఖ్యానించారు. ఇతను చెయ్యరాని పాపాలు చేశాడని, చెయ్యరాని తప్పులు చేశాడని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు. అయితే ఆ పాపాలు ప్రజల పట్ల శాపాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

 

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు!

 

ఆంధ్రాలో అమెరికా వీసా అప్లికేషన్ కౌన్సిలేట్ సెంటర్! స్టూడెంట్స్, వ్యాపారస్తులకు తొలగనున్న ఇబ్బందులు! ఎప్పుడు మొదలవుతుంది అంటే!

 

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో రాష్ట్ర మంత్రి భేటీ! పలు అంశాలపై చర్చ!

 

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త! రికార్డు స్థాయిలో వీసా అపాయింట్మెంట్లు జారీకి ఆమోదం! స్టూడెంట్స్, వ్యాపారస్తులు, తల్లిదండ్రులు ఫుల్ ఖుషి!

 

దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం! అసలు జరిగింది అంటే!

 

మందు బాబులకు షాక్.. రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్! ఈ ఏడాది ఓనం మద్యం విక్రయాలు!

 

ఏపీ మహిళలకు అలర్ట్.. ఇలా చేస్తే, 3 ఉచిత సిలిండర్లు రావు! ఆయా జిల్లాల్లో ఎంతమంది లబ్దిదారులు!

 

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance