రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలో!

Header Banner

రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలో!

  Wed Oct 02, 2024 07:00        Politics

పేద బడుగు బలహీనవర్గాలు, అలాగే రేషన్ కార్డుదారులకు ఇది అదిరిపోయే శుభవార్త. రేషన్ కార్డుదారులకు ఇక నుంచి కందిపప్పు, పంచదార పంపిణీ చేయనుంది ప్రభుత్వం. విశాఖపట్నం జిల్లా మొత్తం మీద పంపిణీ చేయనుంది. అక్టోబర్ 1 నుంచి ఈ ప్రక్రియ మొదలైపోయింది. దాదాపు అన్ని రేషన్ షాపుల్లో కూడా ఇది లభిస్తోంది. ముఖ్యంగా కందిపప్పు, పంచదారను తక్కువ రేటుకి విక్రయించనుంది. పౌర సరఫరాల శాఖ రేషన్ కార్డుదారులైన ప్రజలకి ఈ సరఫరా చేస్తోంది. అటు రాష్ట్రవ్యాప్తంగా, ఇటు విశాఖపట్నం జిల్లాలో ఉన్న రేషన్ కార్డుదారులందరికీ కందిపప్పు, పంచదార పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని, పౌర సరఫరాల శాఖకి ఆదేశాలు ఇచ్చామని జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ వివరించారు. ఇందులో భాగంగా కందిపప్పు కిలో, పంచదార అర్థ కిలో అందిస్తామని తెలిపారు. ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలో 1,48,43,671 మంది రేషన్ కార్డుదారులకు ప్రయోజనం చేకూరుతుంది. కిలో కందిపప్పు ధర రూ.67, అర్థ కిలో పంచదార రూ.17గా నిర్ణయించారు. అక్టోబర్ ఒకటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కందిపప్పు, పంచదార కూడా రేషన్ కార్డు దారులకు అందిస్తామని జెసి తెలిపారు. నిత్యావసరాలు అందుబాటు ధరల్లో ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. కూటమి ప్రభుత్వం పాలన మొదలైనప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజలకు నిత్యావసరాలు అందుబాటు ధరల్లో ఉంచేలా చూడాలని పౌర సరఫరాల శాఖకు దిశానిర్దేశం చేశారని తెలిపారు.

 

ఇంకా చదవండి: రిపోర్ట్ ఆధారంగానే చంద్రబాబు మాట్లాడి ఉంటారు! ప్రజలకు మధ్య వారధి అన్న పురందేశ్వరి!

 

ఈ క్రమంలో రెండుమార్లు బియ్యం, కందిపప్పు ధరలు తగ్గించేలా చూశారు. రైతు బజార్లు, పెద్ద సంస్థాగత రిటైల్ దుకాణాల్లో కిలో కందిపప్పు దేశవాళీ రకం రూ.150కి, బియ్యం (స్టీమ్డ్ – బీపీటీ/సోనా మసూరి) రూ.48, బియ్యం (పచ్చి బీపీటీ/సోనా మసూరి) రూ.47కి విక్రయించేలా చూశారు. ఇప్పుడు రేషన్ కార్డుదారులకు కందిపప్పు, పంచదార కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని, కూటమి ప్రభుత్వం ఉద్దేశం ఒకటేనని, ప్రజలకు, పేదలకు నిత్యావసరాలు అందుబాటు ధరల్లోకి తీసుకురావడమే ధ్యేయంగా తెలిపారు. అటు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఇదే విషయం మీద ప్రకటన చేశారు. అక్టోబర్ 1 నుంచి కందిపప్పు, పంచదార అందుబాటులోకి తెస్తున్నామని, రేషన్ కార్డుదారులకి సరఫరా చేస్తామని, ఇవి వారు అందుకోవచ్చు అని తెలిపారు. అదేవిధంగా అనుకోని విపత్తులు సంభవించినప్పుడు సత్వరమే స్పందించి ఆపదలో ఉన్న ప్రజలకు నిత్యావసరాలు ఇచ్చేలా శాఖను సన్నద్ధం చేసిందని వివరించారు. కూటమి ప్రభుత్వం ఇటీవల సంభవించిన వరదల సమయంలో బాధితులకు బియ్యం 25 కేజీలు, నూనె 1 లీటరు, పంచదార 1 కేజీ, కందిపప్పు 1 కేజీ, ఉల్లిపాయలు 2 కేజీలు, ఆలుగడ్డ 2 కేజీలు అందించామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన ద్వారా వెల్లడించారు.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

 

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు!

 

ఆంధ్రాలో అమెరికా వీసా అప్లికేషన్ కౌన్సిలేట్ సెంటర్! స్టూడెంట్స్, వ్యాపారస్తులకు తొలగనున్న ఇబ్బందులు! ఎప్పుడు మొదలవుతుంది అంటే!

 

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో రాష్ట్ర మంత్రి భేటీ! పలు అంశాలపై చర్చ!

 

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త! రికార్డు స్థాయిలో వీసా అపాయింట్మెంట్లు జారీకి ఆమోదం! స్టూడెంట్స్, వ్యాపారస్తులు, తల్లిదండ్రులు ఫుల్ ఖుషి!

 

దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం! అసలు జరిగింది అంటే!

 

మందు బాబులకు షాక్.. రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్! ఈ ఏడాది ఓనం మద్యం విక్రయాలు!

 

ఏపీ మహిళలకు అలర్ట్.. ఇలా చేస్తే, 3 ఉచిత సిలిండర్లు రావు! ఆయా జిల్లాల్లో ఎంతమంది లబ్దిదారులు!

 

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples