కొండా సురేఖను రెచ్చగొట్టి మీరే తన్నించుకున్నారు! కేటీఆర్‌పై జగ్గారెడ్డి ఆగ్రహం! రాహుల్ గాంధీపై కూడా!

Header Banner

కొండా సురేఖను రెచ్చగొట్టి మీరే తన్నించుకున్నారు! కేటీఆర్‌పై జగ్గారెడ్డి ఆగ్రహం! రాహుల్ గాంధీపై కూడా!

  Thu Oct 03, 2024 08:43        Politics

ఇంట్లో ఉన్న కొండా సురేఖను రెచ్చగొట్టి మీరే తన్నించుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. కొండా సురేఖతో కొట్లాడటం అంత సులభం కాదన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ విషయంలో పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ పెద్దరికంగా వ్యవహారించాల్సి ఉండాల్సిందని అన్నారు. పార్టీకి చెందిన సోషల్ మీడియాను కంట్రోల్ చేయకపోవడం తప్పే అన్నారు. ఆ తర్వాత పుండు మీద కారం చల్లినట్లు కేటీఆర్ మాట్లాడారని విమర్శించారు. అసలే మంత్రి (కొండా సురేఖ) ఫైర్ బ్రాండ్.. ఆమెను ఏమీ అనకుంటే ఎవరినీ ఏమీ అనబోరని పేర్కొన్నారు. ఈ విషయం తెలిసి కూడా ఆమె జోలికి ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌కు కొంచెం కూడా పరిజ్ఞానం లేకపోవడం బాధాకరమన్నారు.

 

ఇంకా చదవండి: అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం - కేంద్రానికి లేఖ, కీలక మలుపు! ఆకాశమే హద్దుగా.. ఏపీ రాజధాని!

 

బీఆర్ఎస్ వాళ్ళు పదేళ్లు రాజభోగాలు అనుభవించారన్నారు. కేటీఆర్ మరో పదేళ్లు ఓపిక పడితే పరిపూర్ణత చెందిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవచ్చని సూచించారు. రాజకీయ పరిపూర్ణతలేని నాయకుడిగా మిగలవద్దని హితవు పలికారు. కొండా సురేఖకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆరే ముందు తప్పు చేశారన్నారు. కొండా సురేఖ విమర్శలు చేసే అవకాశాన్ని ఆయనే ఇచ్చారన్నారు. రాహుల్ గాంధీపై కూడా కేటీఆర్ నిందలు వేయడం సరికాదన్నారు. 52 ఏళ్లు దేశాన్ని పాలించిన గాంధీ కుటుంబం గురించి ప్రజలకు బాగా తెలుసన్నారు. వాళ్ళ ఆస్తులు ప్రభుత్వ భవనాలేనని చెప్పారు. పనికి మాలిన మాటలు మాట్లాడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. రాహుల్ గాంధీపై అభాండాలు వేస్తే ఊరుకునేది లేదన్నారు.

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం! తాను చేసిన పనికి గుర్తింపు!

 

హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరు? ఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు!

 

ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! నియామక ప్రక్రియ వేగవంతం! హోం శాఖ అనిత కీలక ప్రకటన!

 

రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలో!

 

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

 

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు!

 

ఆంధ్రాలో అమెరికా వీసా అప్లికేషన్ కౌన్సిలేట్ సెంటర్! స్టూడెంట్స్, వ్యాపారస్తులకు తొలగనున్న ఇబ్బందులు! ఎప్పుడు మొదలవుతుంది అంటే!

 

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో రాష్ట్ర మంత్రి భేటీ! పలు అంశాలపై చర్చ!

 

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త! రికార్డు స్థాయిలో వీసా అపాయింట్మెంట్లు జారీకి ఆమోదం! స్టూడెంట్స్, వ్యాపారస్తులు, తల్లిదండ్రులు ఫుల్ ఖుషి!

 

దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం! అసలు జరిగింది అంటే!

 

మందు బాబులకు షాక్.. రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్! ఈ ఏడాది ఓనం మద్యం విక్రయాలు!

 

ఏపీ మహిళలకు అలర్ట్.. ఇలా చేస్తే, 3 ఉచిత సిలిండర్లు రావు! ఆయా జిల్లాల్లో ఎంతమంది లబ్దిదారులు!

 

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #JaggaReddy #KondaSurekha #KTR #BRS