ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?

Header Banner

ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?

  Fri Nov 15, 2024 07:30        Politics

ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల వేళ చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తి కరంగా మారింది. ఈరోజు (శుక్రవారం) ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఏపీకి కేంద్ర ప్రాజెక్టులతో పాటుగా రాష్ట్రంలో తాజా పరిణామాల పైన చంద్రబాబు చర్చించనున్నారు. ఇదే సమయంలో ప్రధానిని ఏపీలో పలు ప్రాజెక్టుల శంకుస్థాపనకు చంద్రబాబు ఆహ్వానించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం మధ్నహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. కేంద్రం నుంచి కొత్త ప్రాజెక్టుల అంశం పైన ప్రధానితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. పోలవరం, అమరావతికి కేంద్రం తాజాగా నిధులు కేటాయించింది. అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రూ 15 వేల కోట్ల రుణం మంజూరు చేసింది.

 

ఇంకా చదవండి: కొత్త పాత్రలోకి RRR - ఏకగ్రీవంగా ఎన్నిక..! అంతకుముందు ఎన్డీయే కూటమి తరఫున!

 

ఈ రుణం కేంద్ర గ్రాంటుగా ఇస్తుందని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. 30 ఏళ్ల కాల పరిమితి తో రుణం ఖరారైంది. ఇప్పటికే సీఆర్డీఏ అధికారులు ఈ మేరకు ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నారు. ఇక, చంద్రబాబు ఈ సమావేశంలో వచ్చే నెలలో అమరావతిలో కొత్త రైల్వే లైన్ కోసం భూమి పూజ చేయాలని నిర్ణయించారు. దీంతో పాటుగా విశాఖ రైల్వే జోన్ కు సైతం ఒకే సమయంలో ప్రధాని చేతుల మీదుగా చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారానే అమరావతి పనులు ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నారు. దీంతో, ఇప్పుడు చంద్రబాబు ఈ పర్యటనలో ప్రధానికి ఏపీకి ఈ కార్యక్రమాలకు రావాల్సిందిగా ఆహ్వానించనున్నారు. ఇక.. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ తోనూ చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ఆర్దిక అంశాల పైన చర్చించనున్నారు. ఇక, చంద్రబాబు మహారాష్ట్రలో ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. ప్రధానితో భేటీ సమయంలో మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అంశం పైన చర్చించ నున్నారు. ఏపీ నుంచి ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు, పవన్ ను మహారాష్ట్రలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని బీజేపీ నాయకత్వం కోరింది. పవన్ ప్రచారానికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాబు ఢిల్లీ చేరుకోన్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!

 

వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!

 

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!

 

మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!

 

ఏపీలో బీచ్ కు వెళ్లాలంటే ఛార్జీ కట్టాల్సిందే! ఈ 5 చోట్ల ఎప్పటి నుంచి అంటే? - ఎంత అంటే!

 

వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రిపై కేసు నమోదు చేసిన ఐ-టీడీపీ నేత! ఎందుకో తెలుసా?

 

గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. నవంబర్ 22న ప్రారంభం! అస్సలు మిస్ అవకండి - డబ్బులే డబ్బులు!

 

శుభవార్త.. APలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ప్రాజెక్టు.. ఏకంగా 65 వేల కోట్లతో! యువతకు లక్షల్లో ఉద్యోగాలు!

 

మూడవ విడత నామి నేటెడ్ పోస్టులు విడుదల! ఆ లిస్ట్ మీకోసం! ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది!

 

వైసీపీకి వరుస షాక్ లు! నేతలపై పోలీసులు లుకౌట్ నోటీసులు! ప్రత్యేక బృందాలు రంగంలోకి.. అంతా పరారే పరార్!

 

అసెంబ్లీ భోజనంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీవ్ర ఆగ్రహం! పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరిక!

 

జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది! అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం! ఎమ్మెలందరికీ శిక్షణ తరగతులు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి కార్పొరేటర్ ప్రతినిధులు, సీనియర్ నేతలు! పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానం!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా.?

 

APSRTC మరో శుభవార్త.. నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం ఇది! ఎలాంటి రాత పరీక్ష లేకుండానే!

 

లెక్క తేలుస్తాం.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్! మామూలుగా లేదు!

 

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్! రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

 

ఏపీలో రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు! 10వేల ఉద్యోగాలతో ఐటీ డెవలప్మెంట్ సెంటర్!

 

మూడవ నామినేటెడ్ పోస్టుల లిస్ట్ విడుదల? ఏ ఏ పదవులు అంటే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews