బంగాళాఖాతంలో అల్పపీడనం దెబ్బ - ఏపీలో అత్యధిక వర్షపాతం! ఆ జిల్లాల వారికి రెడ్ అలర్ట్!

Header Banner

బంగాళాఖాతంలో అల్పపీడనం దెబ్బ - ఏపీలో అత్యధిక వర్షపాతం! ఆ జిల్లాల వారికి రెడ్ అలర్ట్!

  Fri Nov 15, 2024 10:25        Entertainment

బంగాళాఖాతంలో నైరుతి ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనంగా బలహీనపడింది. దీని ఫలితంగా ఏపీలోని పలు జిల్లాల్లో వచ్చే 48 గంటల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం దెబ్బకు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో కొద్దిరోజుల కిందట ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారిన విషయం తెలిసిందే. సముద్రతలం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు- మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన ఈ సైక్లోన్ సర్క్యుట్ క్రమంగా తమిళనాడు దక్షిణ తీర ప్రాంతం, పుదుచ్చేరి, శ్రీలంక వైపు కదులింది. దీని ప్రభావంతో బుధ, గురు వారాల్లో ఏపీలో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి అధిక వర్షపాతం నమోదైంది. 24 గంటల వ్యవధిలో దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలపై అల్పపీడన ప్రభాం అధికంగా కనిపించింది.

 

ఇంకా చదవండి: ఏపీలో ప్రజలకు రెయిన్ అలర్ట్! రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

 

నెల్లూరు జిల్లాలోని కావలి, తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేటల్లో అయిదు సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. నెల్లూరు సిటీలో నాలుగు సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. కందుకూరు, గూడూరుల్లో మూడు సెంటీమీటర్లు, కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో రెండు, రాయలసీమలోని పలు జిల్లాల్లో ఒక సెంటీమీటర్ మేర వర్షం పడింది. ఇదే తీవ్రత నేడు, రేపు ఉండొచ్చని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిస్తుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. నెల్లూరు జిల్లాలకు ఆనుకుని ఉన్న తమిళనాడులోని పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది.



ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!

 

ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?

 

నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!

 

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!

 

వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!

 

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!

 

మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Rain #AndhraPradesh #APSDMA #Weather