కోహ్లీ గురించి రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు! జట్టులో కీలకంగా మారనున్న సీనియర్ ప్లేయర్!

Header Banner

కోహ్లీ గురించి రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు! జట్టులో కీలకంగా మారనున్న సీనియర్ ప్లేయర్!

  Fri Nov 15, 2024 10:04        Sports

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో పడిపోయిన భారత జట్టుకు బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ చాలా కీలకంగా మారింది. ఈ ట్రోఫీకి మరో వారమే ఉంది. ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడిస్తే తప్ప  టీమిండియాకు మరోసారి ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ ఆడే అవకాశం లభించదు. అయితే ఈ ట్రోఫీలో  విరాట్ కోహ్లీ జట్టుకు కీలకం కానున్నాడు. అయితే కోహ్లీ ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి. కోహ్లీ ఈ సారి బలహీనంగా ఉన్నాడని ఆసీస్ మాజీ క్రికెటర్లు మైకేల్ క్లార్క్, రికీ పాంటింగ్ లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అతడి ఆటలో మనుపటి పటిమ తగ్గిందని, ఐదేళ్లలో కేవలం రెండే రెండు సెంచరీలు కొట్టాడంటూ పలు రకాలుగా మాట్లాడుతున్నారు. ఇలా కోహ్లీ ఆట తీరుపై విమర్శలు వస్తున్న వేళ భారత జట్టు మాజీ కోచ్ రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు. వరల్డ్ క్లాస్ బ్యాటర్ కోహ్లీ ఆస్ట్రేలియా గడ్డపై చెలరేగడం ఖాయమని రవి శాస్త్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'రాజు తన సామ్రాజ్యానికి తిరిగొచ్చాడు. విరాట్‌ను విమర్శించే వాళ్లను నేను చెప్పే మాట ఇదొక్కటే. ఆస్ట్రేలియా గడ్డపై విధ్వంసక ఇన్నింగ్స్‌‌లో రాజు అనే పేరు తెచ్చుకున్నావు. క్రీజులోకి వెళ్లిన ప్రతిసారి నువ్వు ఒక కింగ్ అనే విషయం నీతో పాటు ప్రత్యర్ధుల మెదళ్లలోనూ తిరుగుతూనే ఉంటుంది' అంటూ కోహ్లీని ఉద్దేశించి రవిశాస్త్రి ట్వీట్ చేశారు. 


ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!

 

ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?

 

నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!

 

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!

 

వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!

 

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!

 

మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Sports #Indiateam #Cricket #NewZealand