వైసీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ.. ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు! కదలుతోన్న..డొంక

Header Banner

వైసీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ.. ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు! కదలుతోన్న..డొంక

  Sun Nov 24, 2024 07:00        Politics

ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. గత వైసీపీ హయాంలో ఆయన ఏయూ వీసీగా పని చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఆయన పలు అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం అండతో వీసీగా కొనసాగారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏయూలో జరిగిన అక్రమాలపై  విశాఖపట్నం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు దృష్టి పెట్టారు. ప్రసాద్ రెడ్డి పాల్పడిన అక్రమాల చిట్టాను బయటకు తీశారు. లిస్టు రెడీ చేసి మంత్రి నారా లోకేశ్ కు అందజేశారు.

 

ఇంకా చదవండి: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! నలుగురు కూలీల మృతి, పలువురికి తీవ్ర గాయాలు!

 

ప్రసాద్ రెడ్డి అక్రమాలపై విచారణ చేపట్టాలని కూటమి నాయకులు ఫిర్యాదు చేశారు. పవిత్రమైన సరస్వతి నిలయాన్ని జగన్ హాయంలో రాజకీయాలతో భ్రష్టుపట్టించారని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థకు రాజకీయ రంగుపులుమారని కూటమి నాయకులు ఆరోపించారు. ఏయూను వైసీపీ కార్యాలయంగా మార్చారని చెప్పారు. 2019 నుంచి 2024 మధ్య చాలా అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ నిధులను మళ్లించారని, నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారని ఫిర్యాదు చేశారు. విచారణలో ప్రసాద్ రెడ్డి అవినీతి డొంక కదులుతుందని కూటమి నాయకులు పేర్కొన్నారు.

ఇంకా చదవండి: ఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

25/11 నుండి 30/11 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

జగన్‌ దగ్గర ఎందుకు చేశానా అని బాధపడుతున్నా! దుమారం రేపుతున్న మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!

 

వైసీపీకి మరో షాక్‌! పార్టీకి రాజీనామా చేసిన కైకలూరు ఎమ్మెల్సీ!

 

మూడేళ్లలో అమరావతికి నూతన రూపు-సీఎం చంద్రబాబు! రాజధానికి రూపకల్పనలో భారీ ప్రణాళికలు!

 

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #YCP #Jagan #AndhraPradesh #APpolitics #APNews #EC #JaganPolitics