జగన్‌పై సీబీఐ విచారణకు షర్మిల డిమాండ్! విద్యుత్తు ఒప్పందాల ముసుగులో భారీ కుంభకోణం!

Header Banner

జగన్‌పై సీబీఐ విచారణకు షర్మిల డిమాండ్! విద్యుత్తు ఒప్పందాల ముసుగులో భారీ కుంభకోణం!

  Tue Nov 26, 2024 15:29        Politics

విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందం వ్యవహారంలో గౌతమ్ అదానీ నుంచి రూ.1,750 కోట్ల ముడుపులు అందుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్పై సిటింగ్ జడ్జి, సీబీఐతో విచారణ చేయించాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. లంచాలు తీసుకున్నారని, స్కీమ్ల కోసం స్కామ్లకు పాల్పడ్డారని అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థలు ఇప్పటికే నిరూపించాయని తెలిపారు. ఈ అక్రమ ఒప్పందంతో 25 ఏళ్లపాటు రాష్ట్ర ప్రజలపై సుమారు రూ.1.5 లక్షల కోట్ల భారం పడనున్న నేపథ్యంలో.. వాటిని తక్షణమే రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సోమవారం ఆమె బహిరంగ లేఖ రాశారు. "లంచాల కోసం జగన్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. ఏపీని ఆర్థికంగా మరింత నష్టాల్లోకి నెట్టారు. 2021 డిసెంబరు 1న 7 వేల మెగావాట్ల విద్యుత్తు సరఫరాకు ఒప్పందాలు జరిగాయని, రైతుల కోసం ఈ విద్యుత్తు వినియోగించనున్నట్లు గతంలో వైకాపా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎక్కువ ధరపెట్టి కొన్నందుకు గానూ 25 ఏళ్లపాటు రాష్ట్ర ప్రజలపై పడే భారం రూ. లక్ష కోట్లు. ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం మరో రూ.50 వేల కోట్లు. ఇందులో జగన్కి ముట్టే వాటాలు ఎంత? ఇప్పటికే సర్దుబాటు ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజల నెత్తిన జగన్ సర్కారు రూ.17 వేల కోట్ల భారం మోపింది. దీనికి అదనంగా అదానీతో చేసుకున్న అక్రమ ఒప్పందాలకు ఏటా రూ.5 వేల కోట్ల భారం పడనుంది' అని తెలిపారు.


ఇంకా చదవండి25/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!



ఏడు గంటల్లో ఆమోదం తెలపాల్సిన అవసరమేంటి?
'అదానీతో చేసుకున్న విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలన్నీ అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) నుంచే నడిచాయి. ఈ విషయాన్ని అప్పటి విద్యుత్తుశాఖ మంత్రి అంగీకరించారు. జగన్కు ఎలాంటి స్వలాభం లేకుంటే, రూ.1,750 కోట్ల లంచాలు తీసుకోకుంటే, కేవలం ఏడు గంటల్లో సోలార్ పవర్ని కొనడానికి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో ప్రజలకు తెలియాలి. 2019-2024 మధ్యకాలంలో అదానీతో జరిగిన ఒప్పందాల మీద పూర్తి విచారణ జరగాలి. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని దోచుకోవాలనుకున్న ‘అదానీ సంస్థల'కు ఏపీలో పెట్టుబడులు పెట్టే అర్హత లేదు. ఆ సంస్థను బ్లాక్స్ట్లో పెట్టాలి' అని షర్మిల డిమాండ్ చేశారు.
గంగవరం పోర్టులోని వాటా అదానీకి అమ్మడంపైనా..
'గంగవరం పోర్టులోని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 10 శాతం వాటాను 2021లో అప్పటి సీఎం జగన్.. రూ.640 కోట్లకే అదానీకి కట్టబెట్టారు. ఆ ఏడాది నాటికి పోర్టు పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న వాటా ఖరీదు సుమారు రూ.9 వేల కోట్లకు పైమాటే. కానీ అత్యంత తక్కువ ధరకు అదానీకి అమ్మడం వెనుక పెద్దఎత్తున ముడుపులు ముట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైనా రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి. అదానీ, జగన్ మధ్య జరిగిన లావాదేవీలు మొత్తం రాష్ట్రంలో ఉన్న సహజ వనరుల్ని దోచుకునే భారీ కుంభకోణం' అని షర్మిల పేర్కొన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్! అసలు ఏం జరిగిందంటే!

 

అమెరికా జైలుకి జగన్ - జీవితాంతం ఏపీకి తిరిగిరాడు! నీకు ఇప్పుడు దమ్ము ఉంటే..?

 

26/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

సుప్రీంకోర్టులో విజయపాల్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఈ కేసులో ఇప్పటికే!

 

ట్రంప్ రాక ముందే వచ్చేయండి! విదేశీ విద్యార్థులకు అమెరికా వర్సిటీలు అలర్ట్!

 

అకౌంట్లోకి రూ.2.5 లక్షలు - ఈ పథకం ద్వారా పేదలకు వరం! మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!

 

ఏపీకి వస్తున్న మోదీ - అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి! 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group





   #andhrapravasi #power #projects #sitinquiry #sharmila #todaynews #flashnews #latestupdate #aadhani #jagan #psycho