వైకాపా పెద్దల అండతో అడ్డగోలుగా టీడీఆర్ బాండ్ల జారీ! సీఎం చంద్రబాబు కఠిన చర్యల ఆదేశం!

Header Banner

వైకాపా పెద్దల అండతో అడ్డగోలుగా టీడీఆర్ బాండ్ల జారీ! సీఎం చంద్రబాబు కఠిన చర్యల ఆదేశం!

  Wed Nov 27, 2024 09:55        Politics

పట్టణ స్థానిక సంస్థల్లో రహదారుల విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారికి ఇచ్చే బదిలీకి వీలున్న హక్కు పత్రాల (టీడీఆర్ బాండ్ల) జారీలో వైకాపా ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయి. అప్పటి ప్రభుత్వ పెద్దల సిఫార్సులపై అధికారులు నిబంధనలు ఉల్లంఘించి బాండ్లు ఇచ్చేశారు. ఈ కారణంగా ప్రత్యేకించి నగరపాలక సంస్థలకు రూ.కోట్ల నష్టం వాటిల్లింది. తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, తణుకులో గత ఐదేళ్లలో జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సోమవారం ప్రాథమిక నివేదిక ఇచ్చారు. అవకతవకలు జరిగిన తీరు.. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు.. ఇకపై టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ఈ నివేదికలో ప్రస్తావించారు. తిరుపతిలో 2019-24 మధ్య కాలంలో మొత్తం 442 టీడీఆర్ బాండ్లు జారీ చేసినట్లుగా అధికారులు విచారణలో గుర్తించారు.
ఇందులో 176 బాండ్లు నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ఇచ్చేసి అవతలి వ్యక్తులకు భారీగా లబ్ధి చేకూర్చారు. తిరుపతిలో మొత్తం 1,149 ఆస్తులకు సంబంధించి ఇప్పటివరకు 442 మందికే బాండ్లు ఇచ్చారు. ప్రభుత్వ మార్గదర్శకాలు ఉల్లంఘించి తిరుపతిలో ఇచ్చిన బాండ్ల విలువ రూ.400 కోట్లు. విశాఖపట్నంలో గత ఐదేళ్లలో జారీ చేసిన 3,137 టీడీఆర్ బాండ్లలో 205కు సంబంధించి నిబంధనలు పాటించలేదు. రోడ్ల విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారు విధిగా గిఫ్టేడ్ రిజిస్ట్రేషన్ చేసి నగరపాలక సంస్థకు ఇవ్వాలి. గత ప్రభుత్వ పెద్దలు చెప్పారని రిజిస్ట్రేషన్ చేయకపోయినా రూ.కోట్ల విలువైన బాండ్లను అధికారులు ఇచ్చేశారు. తణుకులో 29 బాండ్ల జారీలో భారీగా అక్రమాలు జరిగాయి. రూ.63.24 కోట్ల విలువైన బాండ్లకు బదులుగా రూ.754.67 కోట్ల బాండ్లు అధికారులు ఇచ్చేశారు. స్థలాలు కోల్పోయిన వారికి అదనంగా రూ.691.43 కోట్ల అదనపు ఆర్థిక లబ్ధి చేకూర్చారు.


ఇంకా చదవండిఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల! కూటమి కీలక స్థాయికి చేరిక!



స్థలాలు కోల్పోయిన చోట కాకుండా సమీపంలోని డోర్ నంబర్ ఆధారంగా పరిహారం లెక్కించి నిబంధనలకు విరుద్ధంగా బాండ్లు జారీ చేశారు. రూ.4.79 కోట్ల టీడీఆర్ బాండుకు బదులుగా అడ్డగోలుగా రూ.10.64 కోట్ల విలువైన బాండును గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు జారీ చేశారు. ఈ కుంభకోణంలో బాధ్యులైన అధికారులపై అవినీతి నిరోధక శాఖ (అనిశా) ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేసింది.
సీఎం ఆదేశాలతో మరోసారి సమగ్ర విచారణ
టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలపై అధికారులు మరోసారి విచారణ జరపనున్నారు. గత ఐదేళ్లలో జారీ చేసిన అన్ని టీడీఆర్ బాండ్లపైనా పరిశీలన జరిపి బాధ్యులను గుర్తించనున్నారు. తగు చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావని చంద్రబాబు భావిస్తున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!

 

పెన్షన్ దారులకు పండగే పండగ.. ఒకరోజు ముందుగానే పెన్షన్ డబ్బులు! కొన్ని కీలక మార్పులు - కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

 

ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్‌ జారీ! ఎప్పటినుంచి అంటే!

 

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులువర్సిటీపై కీలక చర్చలు!

 

నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ..తెలంగాణతమిళనాడులో పోలీసుల గాలింపు! ఈరోజు ఏపీ హైకోర్టులో..

 

భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

మాజీ సీఎం జగన్ కు కేంద్రం ఊహించని షాక్! అసలు ఏం జరిగిందంటే!

 

అమెరికా జైలుకి జగన్ - జీవితాంతం ఏపీకి తిరిగిరాడు! నీకు ఇప్పుడు దమ్ము ఉంటే..?

 

26/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

సుప్రీంకోర్టులో విజయపాల్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఈ కేసులో ఇప్పటికే!

 

ట్రంప్ రాక ముందే వచ్చేయండి! విదేశీ విద్యార్థులకు అమెరికా వర్సిటీలు అలర్ట్!

 

అకౌంట్లోకి రూ.2.5 లక్షలు - ఈ పథకం ద్వారా పేదలకు వరం! మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!

 

ఏపీకి వస్తున్న మోదీ - అభివృద్ధికి పలు కీలక ప్రాజెక్టులతో కృషి! 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #tdr #lands #mafiya #ykapa #psycho #todaynews #flashnews #latestupdate