ఏపీ మహిళల అకౌంట్లలో రూ.1,500... ఇది మీరు గమనించారా? అలా అస్సలు చేయవద్దు - ప్రభుత్వం కీలక అప్డేట్!

Header Banner

ఏపీ మహిళల అకౌంట్లలో రూ.1,500... ఇది మీరు గమనించారా? అలా అస్సలు చేయవద్దు - ప్రభుత్వం కీలక అప్డేట్!

  Sat Nov 30, 2024 07:00        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు ఒక కీలక ప్రకటన చేశారు. బ్యాంకుల్లో అకౌంట్లు లేని మహిళలు.. కనీసం పోస్టాఫీసుల్లోనైనా అకౌంట్లు తెరవాలని సూచించారు. అలాంటి వారికి ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ది లభిస్తుందని తెలిపారు. బ్యాంకుల్లో అకౌంట్లకు ఆధార్ లింక్ సమస్యలు ఉన్న వారు కూడా.. పోస్టాఫీసుల్లో అకౌంట్లు తెరిస్తే, వారికి పథకాల లబ్ది లభించే ఛాన్స్ ఉందని చెప్పారు. దాంతో.. మహిళలు పెద్ద సంఖ్యలో పోస్టాఫీసులకు వెళ్లి.. అకౌంట్లు తెరుస్తున్నారు. ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. కొంతమందికి ఆల్రెడీ పోస్టాఫీసుల్లో అకౌంట్ ఉంది. అలా ఉన్న వారు.. జాతీయ చెల్లింపుల సంస్థ (NPCI)తో ఆ అకౌంట్‌ని లింక్ చేసుకోవాలి అని అధికారులు చెప్పడంతో.. కొంతమంది మహిళలు.. అలా లింక్ చేసుకోవడానికి ఇప్పుడు ఏపీలోని పోస్టాఫీసులకు క్యూ కడుతున్నారు.

 

ఇంకా చదవండి: మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కినట్లుగా వ్యవహరిస్తున్నా జగన్! ఏ వ్యక్తి కూడా చేయని విధంగా!

 

ముందుగా అక్కడ అకౌంట్ యాక్టివ్‌గా ఉందో లేదో కనుక్కొని, ఆ తర్వాత అక్కడి నుంచి NPCI ఆఫీసులకూ వెళ్తున్నారు. ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా.. 18 నుంచి 59 సంవత్సరాల లోపు మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని హామీ ఇచ్చింది కదా.. ఆ హామీ ఇప్పుడు అమలు చెయ్యబోతోందనీ.. ఈ లబ్ది పొందాలంటే బ్యాంక్ అకౌంట్ లేదా పోస్టాఫీసులో అకౌంట్ ఉండాలనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో మొదలైంది. ఇది నిజమే అనుకొని.. చాలా మంది మహిళలు పోస్టాఫీసులకు వెళ్తున్నారు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలే. అసలు ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు ఏవీ చెయ్యలేదు. బ్యాంక్ అకౌంట్ లేకపోతే, పోస్టాఫీసులో అకౌంట్ తెరుచుకోమని ప్రభుత్వం చెప్పలేదు.

 

ఇంకా చదవండి: అనంతలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన! ఇదీ షెడ్యూల్ - గ్రామస్తులతో సమావేశమై అర్జీలను!

 

కొందరు అధికారులు ఇలాంటి తప్పుడు ప్రచారం చెయ్యడం వల్ల.. మహిళలు పోస్టాఫీసులకు వెళ్లి, అకౌంట్లు తెరవాల్సి వస్తోంది. కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకూ పోస్టాఫీసుల దగ్గర ఎదురుచూస్తున్నారు. రూ.200 చెల్లించి మరీ అకౌంట్లు తెరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏపీలో ఇప్పుడు కనిపిస్తోంది. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాలో మనీ లేదు. అందుకే ఆగస్టు 15న ప్రారంభించాలి అనుకున్న ఉచిత బస్సు పథకాన్ని ఇప్పటివరకూ ప్రారంభించలేదు.

 

ఇంకా చదవండి: సమంత ఇంట తీవ్ర విషాదం! సంతాపాన్ని ప్రకటిస్తున్న సినీ ప్రముఖులు!

 

పైగా మార్చి 31 లోగా.. రైతులకు రూ.20,000 చొప్పున ఇవ్వాలి, అలాగే తల్లికి వందనం పథకంలో భాగంగా ప్రతీ విద్యార్థికీ రూ.15,000 చొప్పున ఇవ్వాలి. ఈ పథకాలకు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం దగ్గర మనీ లేదు. కానీ ఇవి తప్పనిసరిగా అమలు చెయ్యాల్సిన పథకాలు. పోస్టాఫీసులో అకౌంట్ ఉంటే మంచిదే. కానీ.. దాని కోసం ఇప్పుడు హడావుడిగా వెళ్లి.. ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పథకాల లబ్ది డబ్బును బ్యాంక్ అకౌంట్లలోనే వేస్తోంది. అందువల్ల ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టుల మరో లిస్టు విడుదల?? పార్టీ శ్రేణుల్లో పెరిగిపోతున్న ఉత్కంఠ.. అసహనం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కీలక అప్డేట్.. ఏ పథకానికైనా అర్హత ఆ కార్డే.. ఊహించని షాక్ ఇచ్చిన ప్రభుత్వం! ఆ వివరాలు మీ కోసం..

 

కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా..? వీటి ధర చూస్తే తక్కువ! మైలేజ్ చూస్తే ఎక్కువ.. ఆ బైక్స్ ఇవే!

 

మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!

 

షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారు? అసలు నిజం ఇదే!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!

 

వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్ల‌డం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!

 

ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!

 

గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!

 

పెన్షన్ దారులకు పండగే పండగ.. ఒకరోజు ముందుగానే పెన్షన్ డబ్బులు! కొన్ని కీలక మార్పులు - కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

 

ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్‌ జారీ! ఎప్పటినుంచి అంటే!

 

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!

 

నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ..తెలంగాణ, తమిళనాడులో పోలీసుల గాలింపు! ఈరోజు ఏపీ హైకోర్టులో..

 

భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews