బియ్యం అక్రమ రవాణాపై తనిఖీలు జరుగుతున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి(Purandeswari) అన్నారు. అనేక సందర్భాల్లో భాజపా(bjp) ఈ అంశంపై పోరాడుతూనే ఉందన్నారు. ఈవిషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (pawankalyan) సీరియస్గా తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కాకినాడ పోర్టును కేంద్రంగా చేసుకొని విదేశాలకు అక్రమంగా బియ్యం రవాణా చేసిన అంశాన్ని తాము కూడా గతంలో ప్రశ్నించామని.. ఇప్పుడు ఆ ప్రాంతంలో పవన్ పర్యటన ద్వారా తమ వాదనకు బలం చేకూరిందని చెప్పారు. రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వివిధ ప్రాంతాల్లో చేసిన తనిఖీల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా, గోదాముల్లో నిల్వలు బయటపడ్డాయన్నారు. ఇవన్నీ కాకినాడ పోర్టు నుంచి నౌకల ద్వారా తరలిస్తున్నట్లు గుర్తించారని చెప్పారు.
ఇంకా చదవండి: గండికోట, గోదావరి ప్రాజెక్టులకు భారీ నిధుల కేటాయింపు! ఏపీ పర్యాటక అభివృద్ధికి ముందడుగు!
గత ప్రభుత్వంతో, ఆ పార్టీతో సంబంధం ఉన్న నాయకుల పేర్లు.. విదేశాలకు బియ్యం అక్రమంగా తరలించడంతో బయటకొచ్చాయన్నారు. గత ప్రభుత్వం అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాలపై భాజపా గళం వినిపించిందన్నారు. వైఎస్సార్ జిల్లాలోని ఆర్టీపీపీ బూడిద తరలింపుపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మెన్ జేసీ ప్రభాకరరెడ్డి వర్గీయుల మధ్య తలెత్తిన వివాదం గురించి పురందేశ్వరిని మీడియా ప్రశ్నించింది. దీంతో ఇప్పటికే సీఎం చంద్రబాబు వారిద్దరినీ పిలిచారని.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సీఎంకు తన వివరణను ఇచ్చారని చెప్పారు. ఇది ఆ ఇద్దరి నాయకుల మధ్య వ్యాపార సంబంధ అంశమన్నారు. రాష్ట్రానికి తీసుకురావాల్సిన నిధుల గురించి కేంద్రంతో చర్చిస్తున్నామని.. పార్లమెంటు సమావేశాల్లోనే పలు అభివృద్ధి అంశాలపైనా మాట్లాడతామని చెప్పారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాజమహేంద్రవరం నియోజకవర్గానికి రూ.98 కోట్లను అఖండగోదావరి అభివృద్ధికి కేటాయించిందని అన్నారు.