రోజా నోరు మూపించిన షర్మిల.. ఘాటు కౌంటర్! స్క్రిప్ట్ మీదేనా, ఆయనదా? లేక ఉన్నది లేనిది చెప్పే సాక్షిదా?

Header Banner

రోజా నోరు మూపించిన షర్మిల.. ఘాటు కౌంటర్! స్క్రిప్ట్ మీదేనా, ఆయనదా? లేక ఉన్నది లేనిది చెప్పే సాక్షిదా?

  Sun Dec 01, 2024 10:00        Politics

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ సంస్ధ సెకీతో జరిగిన ఒప్పందంపై వైఎస్ జగన్ తాజాగా వివరణ ఇచ్చినా రాజకీయంగా రచ్చ మాత్రం ఆగడం లేదు. జగన్ వివరణపై ఆయన చెల్లెలు, పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించగా.. వైసీపీ నేత ఆర్కే రోజా ఆమెకు కౌంటర్ ఇచ్చారు. దీనికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్స్ హ్యాండిల్ షర్మిల మరో కౌంటర్ ఇచ్చారు. గౌరవ మాజీ మంత్రి రోజా గారు.. ఇంతకు ఇది మీ రాతలా ? సాక్షి పంపిన స్క్రిప్టా ? లేక సకల శాఖ మాజీ మంత్రి రాసిందా? తెర వెనుక దాక్కొని మిమ్మల్ని ముందుపెట్టి అబద్ధాలను అందంగా వర్ణించే వాళ్లను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతుందని వైఎస్ షర్మిల ఇందులో ఆమెను ప్రశ్నించారు.

 

ఇంకా చదవండి: దేశంలోనే టాప్ లో ఏపీ - చంద్రబాబు కీలక ప్రకటన! అనంతపురంలో 64 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ!

 

దేశంలో సోలార్ విద్యుత్ ధరలు గణనీయంగా తగ్గుతుంటే 25 ఏళ్ల కాంట్రాక్ట్ ఎందుకు చేశారని, 5 ఏళ్ల తర్వాత రూ 1.50 పైసలకే యూనిట్ ధర వచ్చునేమో కదా అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల ఒప్పందాలను సమీక్షించకుండా ఏకపక్షంగా అదానీ వద్ద రూ.2.49 పైసలకు ఎందుకు కొన్నారని, అదానీ మీద మీకు అంత ప్రేమ ఎందుకని నిలదీశారు. 2020 లో గుజరాత్‌లో సోలార్ యూనిట్ ధర కేవలం రూ 1.99 పైసలు మాత్రమేనని, మరి వెనకబడిన మన రాష్ట్రం అదానీ వద్ద 2021లో 50 పైసలు ఎక్కువ పెట్టీ ఎందుకు కొనాల్సి వచ్చిందని అడిగారు. ఇది రాష్ట్రం నెత్తిన అధిక భారం మోపినట్లు కాదా అన్నారు.

 

ఇంకా చదవండి: అవినీతి సామ్రాట్ అని జగన్ కు సన్మానం చేయాలా? మంత్రి టెలీకాన్ఫరెన్స్‌లో ఘాటైన ప్రశ్న!

 

అదానీతో చేసుకున్న ఒప్పందాల్లో ట్రాన్స్మిషన్ చార్జీలు లేవని, రూ 2.49 పైసలకే యూనిట్ ధర పడిందని చెప్పినా వీలింగ్ ఛార్జీలు, GST అన్ని కలిపి యూనిట్‌కి రూ. 4.16 పైసలు పడుతుందని విద్యుత్ రంగ అధికారులే చెప్తున్నారని, ఇది నిజం కాదా అని షర్మిల ప్రశ్నించారు. 2021లో సెకీ, NTPC సంస్థలు 20 గిగావాట్ల సోలార్ విద్యుత్‌కి పిలిచిన టెండర్లలో రూ. 2.14 పైసలకే పలు కంపెనీలు ముందుకు వచ్చాయన్న సంగతి మీకు తెలియదా అని అడిగారు. 2021లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో టీపీ సౌర్యా అనే సోలార్ కంపెనీ రూ.2.14 పైసలకు, ఏఐ జోమయ్య అనే కంపెనీ రూ.2.15 పైసలు కోట్ చేసిన సంగతి మీరు గమనించలేదా అని అడిగారు. 2021లో రాజస్థాన్‌లో NTPC రెన్యువల్ ఎనర్జీ 1750 మెగావాట్ల సోలార్ విద్యుత్ కోసం పిలిచిన టెండర్లలో యూనిట్ ధర రూ. 2.17 పైసలకు ఇచ్చేందుకు ముందుకొచ్చిన సంగతి మీరు చూడలేదా అని రోజాను షర్మిల ప్రశ్నించారు. గుజరాత్‌లో రూ 1.99 పైసలు, రాజస్థాన్‌లో రూ 2.17 పైసలు, మధ్యప్రదేశ్‌లో రూ 2.14 పైసలు, మరి అదే ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రూ. 2.49 పైసలు పెట్టి కొనడం తక్కువ ధరనా ? ఇదెక్కడి బంపర్ ఆఫర్ అని నిలదీశారు.

 

ఇంకా చదవండి: కాకినాడ పోర్టు అక్రమ బియ్యం రవాణా, పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు! కేంద్రం నిధుల విభజనపై ప్రకటన!

 

చంద్రబాబు హయాంలో సోలార్ పవర్‌కి ఎక్కువ పెట్టి కొన్నారు అంటున్నారు. 2019లో మీరు అధికారంలో వచ్చాకా దానిపై ఎందుకు దర్యాప్తు జరిపించలేదని ప్రశ్నించారు. టెండర్లు రద్దు చేశారు సరే.. మరి దాని వెనుక మర్మం ఏంటో విచారణ చేయాలి కదా ? 5 ఏళ్లు అధికారంలో ఉండి గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా అని కడిగి పారేశారు? అటు తిప్పి,ఇటు తిప్పి ఇంగ్లీష్‌లో చెప్పినా, తెలుగులో చెప్పినా నిజాన్ని మాత్రం దాచలేరన్నారు. అమెరికా దర్యాప్తు సంస్థల కళ్లు మూయలేరన్నారు. అదానీ దగ్గర మీరు రూ.1750 కోట్లు లంచాలు తీసుకున్నది వాస్తమమని, దేశంలో ఎవడు కొనని అదానీ సోలార్ పవర్‌ను ముడుపుల కోసం మీరు కొన్నది వాస్తవమని తేల్చేశారు.

ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టుల మరో లిస్టు విడుదల?? పార్టీ శ్రేణుల్లో పెరిగిపోతున్న ఉత్కంఠ.. అసహనం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి షాక్.. రోజాపై పోలీసులకు ఫిర్యాదు! ఫొటోలు, వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్!

 

ఏపీలో ప్రజలకు గుడ్ న్యూస్! కొత్త రేషన్ కార్డులు! దరఖాస్తులు ఎప్పటినుంచి అంటే?

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! శ్రీవారి ప్రత్యేక దర్శనం, గోల్డెన్ ఛాన్స్! టోకెన్లు ఇలా...

 

ఏపీ మహిళల అకౌంట్లలో రూ.1,500... ఇది మీరు గమనించారా? అలా అస్సలు చేయవద్దు - ప్రభుత్వం కీలక అప్డేట్!

 

కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా..? వీటి ధర చూస్తే తక్కువ! మైలేజ్ చూస్తే ఎక్కువ.. ఆ బైక్స్ ఇవే!

 

మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!

 

షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారు? అసలు నిజం ఇదే!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!

 

వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్ల‌డం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!

 

ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!

 

గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!

 

పెన్షన్ దారులకు పండగే పండగ.. ఒకరోజు ముందుగానే పెన్షన్ డబ్బులు! కొన్ని కీలక మార్పులు - కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

 

ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్‌ జారీ! ఎప్పటినుంచి అంటే!

 

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!

 

నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ..తెలంగాణ, తమిళనాడులో పోలీసుల గాలింపు! ఈరోజు ఏపీ హైకోర్టులో..

 

భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Roja #Sharmila #YCP #Comments #AndhraPradesh #APpolitics #Jagan #Chandrababu #ViralNews