NRI కి దక్కిన గొప్ప అవకాశం! "ఒక రోజు సీఎం చంద్రబాబు తో.." ఆనందంలో పరవశించి పోతున్న అదృష్టవంతుడు!

Header Banner

NRI కి దక్కిన గొప్ప అవకాశం! "ఒక రోజు సీఎం చంద్రబాబు తో.." ఆనందంలో పరవశించి పోతున్న అదృష్టవంతుడు!

  Mon Dec 02, 2024 09:38        Politics

one day with CBN -NRI
ఎలెక్షన్ల సమయంలో ఎన్నారైలు ఎన్నో రకాలుగా ప్రచార కార్యక్రమాలలో భాగస్వాములు అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నారైలు మరింత ఆసక్తిగా, సమర్ధవంతంగా పని చేయాలని ఎన్నారై టీడీపీ సెల్ ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న ఎన్నారైలకు ఒక దిశా నిర్ధేస్సాన్ని మన ప్రియతమ నాయకుడు ప్రస్తుత CM చంద్రబాబు గారు చేస్తూ పిలుపును ఇవ్వడం జరిగింది. ఈ సందర్భం గా NRI TDP Cell ప్రెసిడెంట్ Dr. రవి వేమూరు చంద్రబాబు అనుమతి తో ఒక ప్రామిస్ చేయడం జరిగింది. అది ఏంటంటే ఏ ఎన్నారై అయితే నిర్దేశించిన కార్యక్రమాలు చేయడం లో టాప్ లో ఉంటారో వారిని సీఎం చంద్రబాబు గారితో పూర్తిగా ఒక రోజు (One Day With CM) అంతా గడిపే విధంగా అనుమతి తీసుకోవడం జరిగింది. అదే విషయం ఎన్నికల ముందు ఎన్నారై లకు తెలియజేయడం జరిగింది. 

 

ఈ సందర్భంగా ఎవరైతే నిర్దేశించిన కార్యక్రమాలలో టాప్లో నిలుస్తారో వారికి చంద్రబాబు గారితో ఒకరోజు గడిపే విధంగా ఏర్పాటు చేస్తామని ఎన్నారై టీడీపీ సెల్ తరఫునుండి ప్రెసిడెంట్ రవి వేమరి గారు ఎన్ఆర్ఐ లకు ప్రోత్సాహకరంగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది.

 

ఈ క్రమంలో చాలామంది ఎన్నారైలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విధాలుగా వారికి ఉన్న పరిధిలో ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా, అద్భుతంగా వివిధ రకాలైనటువంటి పనులను నిర్వహించడం జరిగింది. ఈ పక్రియలో ఎన్నారై టిడిపి నుంచి వివిధ వర్గాల వారికి టెలిఫోన్ కాల్స్ చేయాలని పార్టీ నిర్దేశించింది. ఈ కాల్స్ ని ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా చక్కగా నిర్వర్తించారు. ఇలా ఇచ్చిన టాస్క్ లను పూర్తి చేసి టాప్ లో ఉన్నవారు కొందరు ఉన్నారు. 

 

ఇంకా చదవండిఓరి దేవుడా.. ఏంటి నిజమా..! రోజు ఇడ్లీ తింటున్నారా? అయితే ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

 

వారిలో స్వీడన్ లో నివసిస్తున్న ఉన్నం నవీన్ గారు ఒకరు. ఇచ్చిన మాట ప్రకారం రవి వేమూరు గారు సీఎం చంద్రబాబు గారిని ఒప్పించి ఉన్నం నవీన్ కు ఒక రోజు కేటాయించే విధంగా కృషి చేయడం జరిగింది. 

 

అడిగినదే తడవుగా వెంటనే సీఎం గారు వారికి ఈరోజు అనగా 2 డిసెంబర్ 2024 సోమవారం రోజున ఒక రోజంతా తనతో గడిపే విధంగా అంగీకారం తెలిపారు. అంటే ఒక రోజు మొత్తం ఉన్నం నవీన్ సీఎం చంద్రబాబు తోనే ఉంటారు, ఆయనతోనే ప్రయాణిస్తారు. ఈ రోజు ఉదయం 10.30 నుండి సాయంత్రం ఆయన పని ముగించుకునే వరకు ఎన్నారై ఉన్నం నవీన్ సీఎం గరితోనే గడుపుతారు. 

 

ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు తమ మాట నిలబెట్టుకున్నారు అలాగే ఎన్నారై టీడీపీ సెల్ టీం కూడా ఈ ప్రయత్నంలో ఎంతో కృషి చేశారు. ఇలాగే సీఎం చంద్రబాబు ప్రతి వారం ఎన్నారైల కోసం కొంత సమయం కేటాయిస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నందుకు ఎన్నారైలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక గొప్ప అనుభూతి అని, జీవితాంతం మరచిపోలేని జ్ఞాపకం అని వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అని ఎన్నారై మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్, ప్రెసిడెంట్ రవి వేమూరు మరియు కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

 

అదేవిధంగా ఎన్నారై సొసైటీ ఏపీ ఎన్నార్టీ కు దాదాపు 35 కోట్లు బడ్జెట్ కేటాయిస్తూ, వారికి ఎన్నో రకాలైన పథకాలను అమలు చేయవలసిందిగా ఇటీవల నిర్దేశించడం జరిగింది. వాటిలో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం లో రోజుకు 100 విఐపి దర్శనాలు కూడా కేటాయించడం జరిగింది. వివిధ రల కార్యరూపం దాల్చనుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బూడిద తరలింపు వివాదం.. ఎమ్మెల్యేపై చంద్రబాబు ఫైర్! ఎందుకు అంటే!

 

మందుబాబులకు కిక్కే కిక్కు.. భారీగా తగ్గిన మద్యం ధరలు! ఆ వివరాలు మీ కోసం..

 

2/12 TO 14/12 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి మరో షాక్.. కొడాలి నాని మెడకు ఉచ్చు - అనూహ్య ట్విస్ట్! కీలక అంశాలు వెలుగులోకి...

 

నాగచైతన్య పెళ్లికి నాగార్జున ఇస్తున్న బహుమతి ఏమిటో తెలుసాదాదాపు ఎనిమిది గంటల సమయం!

 

వైసీపీకి షాక్.. రోజాపై పోలీసులకు ఫిర్యాదు! ఫొటోలువీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్!

 

ఏపీలో ప్రజలకు గుడ్ న్యూస్! కొత్త రేషన్ కార్డులు! దరఖాస్తులు ఎప్పటినుంచి అంటే?

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! శ్రీవారి ప్రత్యేక దర్శనంగోల్డెన్ ఛాన్స్! టోకెన్లు ఇలా...

 

ఏపీ మహిళల అకౌంట్లలో రూ.1,500... ఇది మీరు గమనించారాఅలా అస్సలు చేయవద్దు - ప్రభుత్వం కీలక అప్డేట్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP