రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

Header Banner

రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

  Tue Dec 03, 2024 08:45        Politics

అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. రాజధాని అమరావతిలో తొలిదశలో రూ. 11,467 కోట్లతో వివిధ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సీఆర్డీయే ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన నిన్న ఉండవల్లిలోని ఆయన నివాసంలో సీఆర్డీయే అథారిటీ 41వ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం తెలిపింది. వీటిలో చాలా వరకు పనులను ప్రపంచబ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు సహకారంతో చేపడతారు. మొత్తం రూ. 11,467 కోట్లలో రూ. 2,498 కోట్లతో కొన్ని ప్రధాన రహదారుల పనులు చేపట్టగా, రూ. 1,585 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటేషన్ కాల్వల అభివృద్ధి, మూడు రిజర్వాయర్లు నిర్మిస్తారు. అలాగే, రూ. 3,525 కోట్లతో అఖిల భారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగుల నివాస భవన నిర్మాణాలను పూర్తిచేస్తారు. రూ. 3,859 కోట్లతో భూసేకరణలో భూములిచ్చిన రైతులకు కేటాయించిన స్థలాల లేఅవుట్‌ల అభివృద్ధి పనులను కొనసాగిస్తారు. అలాగే, 2019కి ముందున్న టెండర్లు రద్దు చేసి కొత్త ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం ఈ పనులకు మళ్లీ టెండర్లు పిలుస్తారు. అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు రూ. 948.10 కోట్ల సవరించిన అంచనాలతో కొత్తగా టెండర్లు పిలుస్తారు. ప్రాజెక్టు ఆలస్యం కావడం వల్ల సీఆర్డీయే నష్టపోయే రూ. 270.71 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తుంది.

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


బూడిద తరలింపు వివాదం.. ఎమ్మెల్యేపై చంద్రబాబు ఫైర్! ఎందుకు అంటే!

 

మందుబాబులకు కిక్కే కిక్కు.. భారీగా తగ్గిన మద్యం ధరలు! ఆ వివరాలు మీ కోసం..

 

2/12 TO 14/12 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి మరో షాక్.. కొడాలి నాని మెడకు ఉచ్చు - అనూహ్య ట్విస్ట్! కీలక అంశాలు వెలుగులోకి...

 

నాగచైతన్య పెళ్లికి నాగార్జున ఇస్తున్న బహుమతి ఏమిటో తెలుసాదాదాపు ఎనిమిది గంటల సమయం!

 

వైసీపీకి షాక్.. రోజాపై పోలీసులకు ఫిర్యాదు! ఫొటోలువీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్!

 

ఏపీలో ప్రజలకు గుడ్ న్యూస్! కొత్త రేషన్ కార్డులు! దరఖాస్తులు ఎప్పటినుంచి అంటే?

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! శ్రీవారి ప్రత్యేక దర్శనంగోల్డెన్ ఛాన్స్! టోకెన్లు ఇలా...

 

ఏపీ మహిళల అకౌంట్లలో రూ.1,500... ఇది మీరు గమనించారాఅలా అస్సలు చేయవద్దు - ప్రభుత్వం కీలక అప్డేట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group





   #andhrapravasi #rajadhani #amaravathi #development #crda #CM #CBN #todaynews #flashnews #latestupdate