కొట్టు... మాకొద్దు.. తాడేపల్లిగూడెం వైకాపా నేతల తీర్మానం! అవినీతికి బాధ్యత తీసుకోలేం!

Header Banner

కొట్టు... మాకొద్దు.. తాడేపల్లిగూడెం వైకాపా నేతల తీర్మానం! అవినీతికి బాధ్యత తీసుకోలేం!

  Wed Dec 04, 2024 10:14        Politics

మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సారథ్యంలో పార్టీ అభివృద్ధికి తాము పని చేయలేమని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైకాపా ప్రజాప్రతినిధులు, వార్డు ఇన్ఛార్జులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తేల్చి చెప్పారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని ఓ హోటల్లో మంగళవారం వారు అంతర్గతంగా సమావేశమయ్యారు. గత ఎన్నికల్లో విజయం సాధించడానికి కష్టపడినవారిని, పార్టీ కోసం డబ్బులు ఖర్చు చేసిన వారిని గుర్తించకుండా దూరం పెట్టారని పలువురు వాపోయారు. మరోవైపు ఆయన చేసిన అవినీతికి అందరూ బాధ్యత వహించాల్సి వచ్చిందని చర్చించుకున్నారు. ఇలా ఎవరి బాధలు వారు చెబుతూ ఇకపై కొట్టు సారథ్యం తమకు వద్దంటూ తీర్మానానికి వచ్చారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఆయన స్థానంలో వడ్డి రఘురాం నాయుడికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పగ్గాలు కట్టబెట్టాలని అధిష్ఠానాన్ని కోరనున్నట్లు సమాచారం. సమావేశంలో వైకాపా పట్టణ అధ్యక్షుడు నాగు, జడ్పీటీసీ సభ్యులు ముత్యాల ఆంజనేయులు, వరలక్ష్మి, తాడేపల్లిగూడెం ఎంపీపీ శేషులత తదితరులు ఉన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... ఐటీ గ్లోబల్ పాలసీకు ఆమోదం! ఆంధ్రా పెట్టుబడులు పెట్టేవారికి గొప్ప అవకాశం!

 

అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!

 

చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!

 

టీడీపీలోకి వైసీపీ కీలక నేత..చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రిమాజీ ఎమ్మెల్యే కూడా!

 

ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే విషయం.. విశాఖ - విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఈ ప్రాజెక్టు రెండు దశల్లో - అవి ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

 

నేడు (3/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

తస్మా జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారాఅయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

 

రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #exminister #kooru #ykapanetha #todaynews #Flashnews #latestupdate #thadepalligudem