జగన్... వైకాపా నాయకులే భూ సమస్యలు పెంచారు! రెవెన్యూ సదస్సులు ప్రారంభం!
Wed Dec 04, 2024 17:23 Politicsగ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satyaprasad) తెలిపారు. మంగళగిరిలోని సీసీఎల్ఎ కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 6 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. అన్ని రకాల భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు. భూ వివాదాలకు ముగింపు పలికే విధంగా సదస్సులు నిర్వహించాలని తెలిపారు. ఈ సదస్సుల్లో భూ దురాక్రమణలు, 22ఏ భూముల ఉల్లంఘనపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి, పేదలకు సమస్యలు లేని పాలన అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని మంత్రి వెల్లడించారు.
ఇంకా చదవండి: బెండకాయలను తరచూ తింటే ఇన్ని లాభాలా? తెలిస్తే ఆశ్చర్యపోతారు!
క్షేత్రస్థాయిలో వైకాపా(ysrcp) అధినేత జగన్ (ysjagan), ఆ పార్టీ నాయకులే భూ సమస్యలు పెంచారని మంత్రి అనగాని ఆరోపించారు. ల్యాండ్, ఇసుక, లిక్కర్ మాఫీయాల ద్వారా గత ప్రభుత్వం నిధులు దోచుకుందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు(chandrababu) ప్రతినెలా రివ్యూ పెట్టి సమస్యలు పరిష్కరిస్తున్నారన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. విజయవాడ వరదల కారణంగా సదస్సులు వాయిదా పడ్డాయన్నారు. ఈనెల 6 నుంచి వచ్చేనెల 8 వరకు 17,564 గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. నూతన రేషన్ కార్డులపైనా సదస్సుల్లో చర్చిస్తామన్నారు. గ్రామాల్లో లీజ్‌కు ఇచ్చిన భూముల స్టేటస్ ఎలావుందో చూస్తామని తెలిపారు. మదనపల్లి వ్యవహారంపై సీఐడీ విచారణకు సీఎం ఇప్పటికే ఆదేశించారని మంత్రి వెల్లడించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!
చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!
టీడీపీలోకి వైసీపీ కీలక నేత..? చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా!
ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #land #mafiya #jagan #fruad #revenue #todaynews #flashnews #latestupdate
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.