అప్డేట్.. ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రిటర్న్ రాలేదా? అయితే ఇలా చేయండి! రాష్ట్రంలో ఏ ఇతర పథకాల్లో..

Header Banner

అప్డేట్.. ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రిటర్న్ రాలేదా? అయితే ఇలా చేయండి! రాష్ట్రంలో ఏ ఇతర పథకాల్లో..

  Sun Dec 08, 2024 07:00        Politics

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో భాగంగా మీరు గ్యాస్ బుక్ చేసుకుంటే డబ్బులు రిటర్న్ రావడం లేదా..? కొన్ని సాంకేతిక కారణాలతో అర్హత ఉన్నా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు కావడం లేదు. ఉచిత గ్యాస్ పథకం వర్తించడంతో పాటు నగదు జమ కావాలంటే ఈ కింది వివరాలు తప్పనిసరిగా పూర్తి చేయాలి. అవి ఏంటంటే? ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్‌-6 హామీ మేరకు ఏపీ ప్రభుత్వం దీపం-2 పథకం తీసుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది మార్చి వరకు ఒక్కో గ్యాస్‌ కనెక్షన్‌కు ఒకటి చొప్పున సిలిండర్లను ఉచితంగా ఇస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఏటా మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇవ్వనున్నారు. దీంతో వంట గ్యాస్ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. గ్యాస్‌ సిలిండర్‌ ధరను బుక్ చేసిన తర్వాత తొలుత లబ్ధిదారులు డబ్బులు చెల్లించాలి. గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లో గ్యాస్ కనెక్షన్‌కు అనుసంధానమై లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకు ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది.

 

ఇంకా చదవండి: చంద్రబాబు తిన్న ప్లేట్ ను లోకేశ్ తీయడంపై - ఆసక్తికర ట్వీట్ చేసిన భువనేశ్వరి!

 

రాష్ట్రంలో ఏ ఇతర పథకాల్లో లేనంత మంది లబ్ధిదారులు దీపం-2 పథకంలో ఉన్నారు. ఏటా రూ.2,840 కోట్లు వ్యయం కేటాయించింది కూటమి సర్కార్. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో అర్హత ఉన్నా డబ్బులు జమ కావడం లేదు. దీపం-2 పథకంలో కొన్ని సాంకేతిక కారణాలతో లబ్ధిదారులకు నగదు రాయితీ వర్తించడం లేదు. ఆధార్, రేషన్‌ కార్డు, గ్యాస్‌ కనెక్షన్‌ ఆధారంగా రాయితీ వర్తింపజేస్తున్నారు. ఈ వివరాలు లేకపోవడంతోనే అర్హుల సంఖ్య భారీగా తగ్గింది. రాష్ట్రంలో 1.54 కోట్ల గృహ వినియోగ గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. రేషన్‌ కార్డులు మాత్రం 1.48 కోట్లు ఉన్నాయి. అయితే ఉచిత సిలిండర్‌ పథకంలో కొన్ని లక్షల మంది చేరాల్సి ఉంది. గ్యాస్‌ కనెక్షన్, రేషన్‌ కార్డులున్నా, ఆధార్‌ అప్‌డేట్ చేయకపోవడంతో అర్హత పొందలేకపోతున్నారు. దీపం-2 పథకం కింద వంద శాతం సబ్సిడీపై ఏటా మూడు వంట గ్యాస్‌ సిలిండర్లు పొందడానికి రాష్ట్రంలో ఇంతవరకు 81 లక్షల కుటుంబాలు ఈకేవైసీ చేయించుకున్నట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. రేషన్‌ కార్డు, ఆధార్, గ్యాస్‌ కనెక్షన్‌ తప్పనిసరి, రేషన్‌ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులలో ఎవరి పేరు మీద కనెక్షన్‌ ఉన్నా అర్హులే, రేషన్‌ కార్డులోని సభ్యుల పేర్లతో ఎన్ని కనెక్షన్లున్నా ఒక్క దానికే రాయితీ వర్తిస్తుంది. గ్యాస్‌ రాయితీ జమ కావాలంటే ఈ కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి.

 

ఇంకా చదవండి: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రకటన! నామినేటెడ్ పోస్టుల మరో జాబితా సిద్దం - దక్కేది వీరికే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బాపట్ల హైస్కూల్లో 'టగ్ ఆఫ్ వార్' ఆడిన చంద్రబాబు, నారా లోకేశ్! గెలిచింది ఎవరో తెలుసా?

 

ఏపీకి మరోమారు భారీ వర్షాల ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఏపీకి మరోమారు భారీ వర్షాల ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఏపీ ప్రజలకు ముఖ్యమైన వార్త.. ప్రభుత్వం నిన్నటి నుంచి 3 రోజులపాటూ! అవన్నీ ఉచితంగా పొందండి!

 

నేడు (7/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

జగన్ కి షాక్.. విజయసాయిరెడ్డిపై క్రిమినల్ కేసు! ఎవరు పెట్టారు అంటే?

 

నెల్లూరులో అలా చేసే వారికి కఠిన చర్యలు తప్పవు! మంత్రి కీలక వ్యాఖ్యలు!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా! ఇది తప్పక తెలుసుకోండి - లేదంటే.. ప్రమాదమే!

 

కొడాలికి మరో బిగ్ షాక్...14 రోజుల రిమాండ్ - నెల్లూరు సబ్​జైలుకు తరలింపు! అసలేం జరిగిదంటే!

 

ఆళ్ల నాని టీడీపీలోకి ఎంట్రీ పై చంద్రబాబు క్లారిటీ! పలువురు వైసీపీ నేతలు కూటమి పార్టీలోకి!

 

నేడు (6/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు! మంత్రి లోకేశ్ సమక్షంలో గూగుల్ తో కీలక ఒప్పందం!

 

బీఆర్ఎస్‌కు ఊహించని షాక్! కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews