ఏపీ ప్రజలకు ఒక పెద్ద ఊరట కలిగించే విషయం.. సంవత్సరం పాటు ఉచిత! ప్రభుత్వం కీలక నిర్ణయం!

Header Banner

ఏపీ ప్రజలకు ఒక పెద్ద ఊరట కలిగించే విషయం.. సంవత్సరం పాటు ఉచిత! ప్రభుత్వం కీలక నిర్ణయం!

  Mon Dec 09, 2024 07:00        Politics

ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచుతారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ భారీ శుభవార్త చెప్పింది. దీంతో విద్యుత్ వినియోగదారులు ఎగిరిగంతేస్తున్నారు. ఏపీ ప్రజలకు విద్యుత్ చార్జీల పెంపు భయం లేకుండా 2025-26 సంవత్సరానికి సంబంధించి డిస్కంలు వార్షిక ఆదాయ నివేదిక (ఏఆర్‌ఆర్‌)ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి అందజేశారు. ఈ నివేదిక ప్రకారం విద్యుత్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు చేయలేదు. ఇది ప్రజలకు ఒక పెద్ద ఊరట కలిగించే విషయం. 2025-26లో విద్యుత్ కొనుగోళ్లు, నిర్వహణకు ₹58,868.52 కోట్ల అవసరం ఉంటుందని అంచనా వేశాయి డిస్కంలు. విద్యుత్ విక్రయాల ద్వారా ₹44,185.28 కోట్లు ఆదాయం మాత్రమే లభిస్తుంది. మొత్తం ₹14,683.24 కోట్ల లోటు ఉంటుంది.

 

ఇంకా చదవండి: కొడుకే తనపై దాడి చేశాడంటూ మోహన్ బాబు! టాలీవుడ్ లో కలకలం - అసలు ఏమి జరిగింది అంటే!

 

లోటు ఉన్నా వినియోగదారులపై అదనపు భారం వేయడం జరగదని డిస్కంలు స్పష్టం చేశాయి. 2025-26లో 75,926.22 మిలియన్ యూనిట్లు (ఎంయూ) విద్యుత్ విక్రయం జరుగుతుందని అంచనా. ఉచిత వ్యవసాయ విద్యుత్ కోసం 12,927 మిలియన్ యూనిట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిటుకు ₹4.80గా అంచనా. ప్రస్తుతం ఇది యూనిటుకు ₹5.12గా ఉంది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతిలో డిస్కంల, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోయే 6 నెలల విద్యుత్ ఉత్పత్తి, వినియోగం, సరఫరా పై చర్చ జరిగింది. విద్యుత్ వినియోగం, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని సరైన ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు. సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజలకు భారం లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగించాలి. గత ప్రభుత్వ తప్పిదాల ప్రభావం ప్రజలపై పడకుండా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుంది. ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఉచిత విద్యుత్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. విద్యుత్ వినియోగంలో ఓల్టేజ్ సమస్యలు తగ్గించే విధంగా నాణ్యమైన సేవలను అందించాలి. వినియోగదారులపై విద్యుత్ ఛార్జీలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమలులోకి రానున్నాయి. ఏపీఈఆర్‌సీ అవసరమైన మార్పులను పరిశీలించి తుది నిర్ణయం ప్రకటిస్తుంది. ఈ నిర్ణయాలతో ప్రజలు ఆర్థికంగా ఊరట పొందే అవకాశం ఉంది. విద్యుత్ వినియోగదారులు భయపడాల్సిన అవసరం లేదు.

 

ఇంకా చదవండి: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రకటన! నామినేటెడ్ పోస్టుల మరో జాబితా సిద్దం - దక్కేది వీరికే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అప్డేట్.. ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రిటర్న్ రాలేదా? అయితే ఇలా చేయండి! రాష్ట్రంలో ఏ ఇతర పథకాల్లో..

 

దారుణం.. తిరుమల కొండపై కారు దగ్ధం! ఆ సమయంలో కారులో...

 

గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠ్యాంశాలకు రూపకల్పన! వేలల్లో ఉద్యోగాలు.. వారికి పండగే పండగ!

 

బాపట్ల హైస్కూల్లో 'టగ్ ఆఫ్ వార్' ఆడిన చంద్రబాబు, నారా లోకేశ్! గెలిచింది ఎవరో తెలుసా?

 

ఏపీకి మరోమారు భారీ వర్షాల ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఏపీకి మరోమారు భారీ వర్షాల ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఏపీ ప్రజలకు ముఖ్యమైన వార్త.. ప్రభుత్వం నిన్నటి నుంచి 3 రోజులపాటూ! అవన్నీ ఉచితంగా పొందండి!

 

నేడు (7/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

జగన్ కి షాక్.. విజయసాయిరెడ్డిపై క్రిమినల్ కేసు! ఎవరు పెట్టారు అంటే?

 

నెల్లూరులో అలా చేసే వారికి కఠిన చర్యలు తప్పవు! మంత్రి కీలక వ్యాఖ్యలు!

 

ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా! ఇది తప్పక తెలుసుకోండి - లేదంటే.. ప్రమాదమే!

 

కొడాలికి మరో బిగ్ షాక్...14 రోజుల రిమాండ్ - నెల్లూరు సబ్​జైలుకు తరలింపు! అసలేం జరిగిదంటే!

 

ఆళ్ల నాని టీడీపీలోకి ఎంట్రీ పై చంద్రబాబు క్లారిటీ! పలువురు వైసీపీ నేతలు కూటమి పార్టీలోకి!

 

నేడు (6/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు! మంత్రి లోకేశ్ సమక్షంలో గూగుల్ తో కీలక ఒప్పందం!

 

బీఆర్ఎస్‌కు ఊహించని షాక్! కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews