ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెన్షన్లపై తాజా నిర్ణయం, సర్వే! వారికి కోత మార్గదర్శకాలు.!

Header Banner

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెన్షన్లపై తాజా నిర్ణయం, సర్వే! వారికి కోత మార్గదర్శకాలు.!

  Tue Dec 10, 2024 07:00        Politics

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో లబ్ది దారులు రాష్ట్ర వ్యాప్తంగా నిరీక్షిస్తున్నారు. వీరికి కొత్తవి మంజూరుకు ముందే ప్రస్తుత పెన్షన్ పథకంలో బోగస్ లబ్ది దారులను గుర్తించాలని నిర్ణయించారు. ఇందు కోసం పైలెట్ ప్రాజెక్టుగా సర్వే చేస్తున్నారు. ఇందు కోసం ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. రెండు రోజుల పాటు పెన్షన్ల తనఖీ కొన సాగనుంది. ఇందు కోసం జిల్లాకు ఒక సచివాలయం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల లబ్దిదారుల విషయంలో ప్రభుత్వం తాజాగా సర్వే చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 65 లక్షల మంది పెన్షన్ల లబ్దిదారులు ఉన్నారు.

 

ఇంకా చదవండి: ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం.. ఏపీలో ఈ 16 నగరాల్లో రోడ్లకు టోల్ ట్యాక్స్! ఇందులో భాగంగా అధికారులు..

 

అదే విధంగా మూడు లక్షలకు పైగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయ. ఇదే సమయంలో అర్హత లేకపోయినా పెన్షన్లు పొందుతున్న వారి పైన ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లను పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలో పలువురు బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. దీంతో, కొత్త పెన్షన్లను మంజూరుకు ముందే బోగస్ పెన్షన్లు తెలిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముందుగా బోగస్ పెన్షన్లను గుర్తించేందుకు ప్రత్యేకంగా పైలెట్ ప్రాజెక్టుగా రెండు రోజుల పాటు తనిఖీలు చేపట్టనున్నారు. ఎంపిక చేసిన సచివాలయాల పరిధిలో నిన్న, ఈరోజు (9,10)తేదీ ల్లో 4 బృందాలు ఏకకాలంలో సర్వే నిర్వహించేలా కసరత్తు చేసింది. ఇందు కోసం ప్రతీ జిల్లాకు ఒక సచివాలయాన్ని ఎంపిక చేశారు. పైలెట్‌ ప్రాజెక్టులో వచ్చే ఫీడ్‌ బ్యాక్‌ను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ సర్వే చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

 

ఇంకా చదవండి: వైసిపికి మరొ షాక్! వైకాపా ఎంపీ పీఏ అరెస్ట్.. ఎందుకు అంటే.. కడప పోలీస్ స్టేషన్ లో...

 

వచ్చిన ఫిర్యాదులను జిల్లా అధికారులు సంబంధిత సచివాలయాల ద్వారా వెరిఫై చేయించనున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా 13 ప్రశ్నలను సిద్దం చేసారు. వీటి ఆధారంగా వారిలో వాస్తవంగా అర్హులు ఎవర.. అర్హత లేకపోయినా పెన్షన్ ఎలా అందుకుంటున్నారనే సమాచారం రాబట్టనున్నారు. పింఛన్ల తనిఖీలకు సంబంధించి షెడ్యూల్‌, విది విధానాలను సెర్ప్‌ ఉత్తర్వులు జారీ చేసింది. తనిఖీల్లో సచివాలయ సిబ్బందిని కాకుండా పక్క మండలానికి చెందిన సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సర్వే వివరాలను లబ్దిదారులను కలిసిన సమయంలో యాప్ ద్వారా సేకరించనున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రశ్నల కు అనుగుణంగా సమాచారం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత పింఛన్‌దారుని ఫొటో క్యాప్చర్‌ చేయాల్సి ఉంటుందని ఉద్యోగులకు ప్రభుత్వం సూచించింది. ఈ పైలెట్ ప్రాజెక్టు రిపోర్టుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల ను గుర్తించాలని భావిస్తున్నారు. ఆ తరువాత కొత్త పెన్షన్ల మంజూరు పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

ఇంకా చదవండి: చంద్రబాబు ఒక్క ఆంధ్రాకే కాదు... ప్రపంచానికి నాయకుడు అవ్వాలి! భావాలను మాటలలో వర్ణించలేము! "వన్ డే విత్ సీఎం" అనుభవాలు పంచుకున్న ఎన్ఆర్ఐ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎగిరి గంతేసే న్యూస్.. ఈరోజు నుంచి 'పుష్ప-2' టికెట్ ధ‌ర‌ల్లో భారీ త‌గ్గింపు! విడుద‌లైన మూడు రోజుల్లోనే!

 

లక్కీ ఛాన్స్.. ఐఫోన్ 15 ప్లస్‌పై భారీ తగ్గింపు ఆఫర్! కొనాలనుకుంటే చక్కటి అవకాశం!

 

పోలీస్ కస్టడీకి వైసీపీ నేత రౌడీ షీటర్! నిజాలు చెప్పేస్తా..? టెన్షన్ లో జగన్..

 

రాజ‌కీయాల‌పై సినీన‌టి క‌స్తూరి కీల‌క వ్యాఖ్య‌లు! ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ!

 

ఏపీ ప్రజలకు ఒక పెద్ద ఊరట కలిగించే విషయం.. సంవత్సరం పాటు ఉచిత! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

నేడు (9/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

శబరిమల దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! ఇంక పండగే పండగ! ప్రత్యేక రైలు సర్వీసులు!

 

ఒరేయ్ మీ దుంపలు తెగ.. 102 ఏళ్ల మహిళను పెళ్లాడిన 100 ఏళ్ల పెళ్లికొడుకు! ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..

 

రైల్వే స్టేషన్‌లో కోతుల ఫైట్‌ వల్ల ఆగిపోయిన రైళ్లు! అసలు ఏం జరిగిందంటే!

 

అప్డేట్.. ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రిటర్న్ రాలేదా? అయితే ఇలా చేయండి! రాష్ట్రంలో ఏ ఇతర పథకాల్లో..

 

దారుణం.. తిరుమల కొండపై కారు దగ్ధం! ఆ సమయంలో కారులో...

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews