ఏపీలో కూటమి సర్కార్ క్రిస్మస్ కానుక.. మంత్రి కీలక ప్రకటన! రాష్ట్రంలో రూ.340 కోట్లతో..

Header Banner

ఏపీలో కూటమి సర్కార్ క్రిస్మస్ కానుక.. మంత్రి కీలక ప్రకటన! రాష్ట్రంలో రూ.340 కోట్లతో..

  Wed Dec 11, 2024 07:00        Politics

ఏపీలో ఆరునెలల పాలన పూర్తి చేసుకుంటున్న కూటమి సర్కార్ క్రిస్మస్ కానుక ఇవ్వనున్నట్లు ప్రకటించింది. గతంలో టీడీపీ ప్రబుత్వం అధికారంలో ఉండగా వివిధ మతాలకు వారి మతాలకు అనుగుణంగా పండుగ వస్తువులను కానుకగా అందించేవారు ఇప్పుడు మరోసారి రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలో ఎన్డీయే సర్కార్ అధికారంలోకి రావడంతో క్రిస్మస్ కానుక అందించనున్నట్లు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రకటించారు. రాష్ట్రంలో ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన వారికి అందిస్తామని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఎస్సీ సంక్షేమ పథకాలన్నింటినీ తిరిగి పునరుద్దరిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు.

 

ఇంకా చదవండి: మరో ఫుడ్ పాయిజన్ ఘటన... రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం! విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ!

 

అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో ప్రారంభించిన కమ్యూనిటీ హాల్స్ ను జనరల్ నిధులతో పూర్తి చేసి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వం కమిటీ హాల్స్ ను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించారని, రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్స్ ను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని క్రిస్టియన్స్ అందరికీ క్రిస్మస్ కానుక అందిస్తామన్నారు. అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని కూడా పునరుద్ధరిస్తామన్నారు. రాష్ట్రంలో రూ.340 కోట్లతో నూతన ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను నిర్మిస్తామని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా డిసెంబర్, జనవరి నెలలోనే రుణాలు అందిస్తామని తెలిపారు.

 

ఇంకా చదవండి: ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

 

గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ని మూడు ముక్కలు చేసి నిధులు అందివ్వకుండా నిర్లక్ష్యం చేసిందని, తాము మాత్రం లిడ్ కాప్ కు నిధులు అందించి రుణాలు అందిస్తామన్నారు.. ఆటోనగర్ లో విలువైన భూములను అన్యాక్రాంతం చేశారని, అక్కడ పిపిపి మోడల్ లో వాటిని అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హాస్టల్స్ రిపేరుకు రూ.140 కోట్లు కేటాయించామాన్నారు. ఈ ఐదు నెలల పాలనలో హాస్టల్ విద్యార్థులకు కార్పొరేట్ వైద్యం అందించి, వారి ఆరోగ్యానికి కాపాడే చర్యలు తీసుకున్నామన్నారు. అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి స్థలం కేటాయిస్తే గత ప్రభుత్వం స్థలాన్ని మార్చి విజయవాడ స్వరాజ్ మైదానంలో ఆ విగ్రహం పెట్టారన్నారు.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాజెక్టుకు సంబంధించి అసంపూర్తిగా ఉన్న హాల్స్, తదితర పనులను పూర్తి చేస్తామన్నారు.. విజయవాడ నగరంలో ఉన్న హాస్టల్స్ రిపేర్ కి రూ. 42 లక్షల నిధులు కేటాయించామన్నారు.

ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదల? ఎప్పుడు అంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

 

చంద్రబాబు కీలక నిర్ణయం.. నాగబాబుకు కీలక పదవి - టీడీపీ రాజ్యసభ సభ్యుల ఖరారు!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెన్షన్లపై తాజా నిర్ణయం, సర్వే! వారికి కోత మార్గదర్శకాలు.!

 

నేడు (10/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

46 ఏళ్ళకి ఘనంగా రెండో పెళ్లి చేసుకున్న నటుడు! పెళ్లికూతురు ఎవరో తెలుసా?

 

వైసిపికి మరొ షాక్! వైకాపా ఎంపీ పీఏ అరెస్ట్.. ఎందుకు అంటే.. కడప పోలీస్ స్టేషన్ లో...

 

ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం.. ఏపీలో ఈ 16 నగరాల్లో రోడ్లకు టోల్ ట్యాక్స్! ఇందులో భాగంగా అధికారులు..

 

ఎగిరి గంతేసే న్యూస్.. ఈరోజు నుంచి 'పుష్ప-2' టికెట్ ధ‌ర‌ల్లో భారీ త‌గ్గింపు! విడుద‌లైన మూడు రోజుల్లోనే!

 

లక్కీ ఛాన్స్.. ఐఫోన్ 15 ప్లస్‌పై భారీ తగ్గింపు ఆఫర్! కొనాలనుకుంటే చక్కటి అవకాశం!

 

పోలీస్ కస్టడీకి వైసీపీ నేత రౌడీ షీటర్! నిజాలు చెప్పేస్తా..? టెన్షన్ లో జగన్..

 

రాజ‌కీయాల‌పై సినీన‌టి క‌స్తూరి కీల‌క వ్యాఖ్య‌లు! ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ!

 

ఏపీ ప్రజలకు ఒక పెద్ద ఊరట కలిగించే విషయం.. సంవత్సరం పాటు ఉచిత! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

నేడు (9/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

శబరిమల దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! ఇంక పండగే పండగ! ప్రత్యేక రైలు సర్వీసులు!

 

ఒరేయ్ మీ దుంపలు తెగ.. 102 ఏళ్ల మహిళను పెళ్లాడిన 100 ఏళ్ల పెళ్లికొడుకు! ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..

 

రైల్వే స్టేషన్‌లో కోతుల ఫైట్‌ వల్ల ఆగిపోయిన రైళ్లు! అసలు ఏం జరిగిందంటే!

 

అప్డేట్.. ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రిటర్న్ రాలేదా? అయితే ఇలా చేయండి! రాష్ట్రంలో ఏ ఇతర పథకాల్లో..

 

దారుణం.. తిరుమల కొండపై కారు దగ్ధం! ఆ సమయంలో కారులో...

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews