దమ్ముంటే ఆంధ్రబ్యాంక్‌ను పునరుద్ధరించండంటూ వారికి సవాల్! ఏబీ సంచలన వ్యాఖ్యలు - ఇక కమ్మ వారి స్థితిగతులు స్థిరంగా..

Header Banner

దమ్ముంటే ఆంధ్రబ్యాంక్‌ను పునరుద్ధరించండంటూ వారికి సవాల్! ఏబీ సంచలన వ్యాఖ్యలు - ఇక కమ్మ వారి స్థితిగతులు స్థిరంగా..

  Mon Jan 06, 2025 10:42        Politics

కృష్ణా జిల్లా కమ్మవారంటే ఆషామాషీ కాదని రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో అనేక మంది ప్రముఖులకు పుట్టినిల్లుగా ఉందని ఆయన గుర్తు చేశారు. ఎన్టీఆర్, రామోజీరావు, ఘంటసాల, విశ్వనాథ సత్యనారాయణ, కాకాని వెంకటరత్నం సహా అనేక మంది ప్రముఖులకు ఈ కృష్ణా జిల్లానే పుట్టినిల్లు అని సోదాహరణగా వివరించారు. విజయవాడలోని గంగూరులో ఆదివారం కమ్మ వారి సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా వారిని విమర్శించే వారు.. దమ్ముంటే ఆంధ్రబ్యాంక్‌ను పునరుద్ధరించండంటూ వారికి సవాల్ విసిరారు. అలాగే దమ్ముంటే మరో రామోజీరావును చూపించండంటూ విమర్శకులకు ఏబీ వెంకటేశ్వరరావు సూచించారు. అయితే గత ఐదేళ్లలో కమ్మ వారిపై బహిరంగ యుద్దం ప్రకటించారన్నారు. ఈ సంక్రాంతిని విమోచన, విముక్తి దినంగా భావించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

 

ఇంకా చదవండి: ప్రయాణికులకు శుభవార్త: మరో రైలు మార్గానికి గ్రీన్ సిగ్నల్.. ఈ ప్రాంతాలన్నింటికీ కొత్త రైల్వేస్టేషన్లు..

 

గతంలో జరిగిన ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉందన్నారు. మన పూర్వీకులు మనకు మంచి మార్గదర్శనం చూపించారని చెప్పారు. వారు చూపిన మంచి లక్షణాలు.. తర్వాతి తరాలు అంది పుచ్చుకోవడాన్ని బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఇక కమ్మ వారి స్థితిగతులు స్థిరంగా లేవన్నారు. కమ్మ వారు మేధో వలసకు గురవుతున్నారన్నారు. దీన్ని భర్తీ చేసేందుకు ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఆలోచించాల్సి ఉందన్నారు. కష్టాలు రాగానే కుంగి పోకుండా ఉండే వైనాన్ని పూర్వీకులు మనకు నేర్పించారని.. దీనిని ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలన్నారు. ప్రపంచంలో మనకున్న గుర్తింపును నిలబెట్టుకుని భావి తరాలకు అందివ్వాలన్నారు. కమ్మ వారి సేవా సమితి ద్వారా చేస్తోన్న సేవలు అభినందనీయమన్నారు. కమ్మ సామాజిక వర్గంలో చాలా మంది పేదరికంలో ఉన్నారని.. ఆయా కుటుంబాలను అన్ని విధాలా సహకరించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వారిని ప్రోత్సహిస్తే.. మన పిల్లల్లో మరో సత్య నాదేళ్ల, ఎన్టీఆర్‌లను చూడవచ్చునని ఏబీ వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా.. మహిళలకు, యువతకు, పిల్లలకు పలు పోటీలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, సృజనా చౌదరితోపాటు జల వనరుల శాఖ సలహాదారు కన్నయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

AP: రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన మహిళలకు అదిరే గుడ్ న్యూస్! కీలక ప్రకటన - ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు!

ఏపీలో కొత్త వైరస్ కేసులు.. వ్యాధి లక్షణాలు 3 నుంచి 10 రోజుల్లోగా..! ఆరోగ్యశాఖ స్పందన ఇదే..

అమెరికా ప్రజలకు ప్రభుత్వం భారీ హెచ్చరిక! ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర..! జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే..

పిన్నెల్లికి మరో షాక్! హైదరాబాద్ లో ప్రధాన అనుచరుడు అరెస్ట్!

ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్!

ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు..

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన! ఎప్పుడు? ఎందుకు..?

లోకేశ్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు భారీ శుభవార్త! ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. అకౌంట్లోకి డబ్బులు, చెల్లింపు ఇలా!

పవన్ కల్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్! ర్యాలీ గుర్తొస్తోందన్న రామ్ చరణ్..

లోకేశ్: విద్యాశాఖలో నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే! ఎప్పుడూ టఫ్ టాస్క్ తీసుకుంటా..

ఆ మూడు తేదీల్లోనే శ్రీవారిని దర్శించుకోవాలని అనుకోవద్దు! భక్తులకు టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి!

ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల!

గుడ్ న్యూస్.. ఏపీలో కొత్తగా 7 ఎయిర్‌పోర్టులు! ఏ జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ప్రస్తుతం స్టేటస్ ఏంటంటే!

ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 46 ఏళ్ల రికార్డు బద్దలు..

తల్లికి వందనం పథకం అమలుకు డేట్ ఫిక్స్! మంత్రి కీలక ప్రకటన!

నేడు (4/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #AB.VenkateswaraRao #APHighCourt #CAT #APGovt #YSRCP #AndhraPradesh