2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు! నేడు విశాఖలో మోదీ పర్యటన.. భారీ రోడ్ షో!

Header Banner

2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు! నేడు విశాఖలో మోదీ పర్యటన.. భారీ రోడ్ షో!

  Wed Jan 08, 2025 12:39        Politics

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ప్రధాని రాక సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి వర్చువల్‌‌గా సుమారు రూ.2.08 కోట్ల విలువైన 20 వరకూ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు, తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. ఈ రోజు (బుధవారం) సాయంత్రం 4.15 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమానంలో విశాఖపట్నం చేరుకుని సా.4.45 నుంచి 5.30 గంటల వరకూ రోడ్డు షోలో పాల్లొంటారు. అనంతరం సా.5.30 నుంచి 6.45 గంటల వరకూ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం సభా వేదిక వద్ద నుండి వర్చువల్‌గా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి సభలో ప్రసంగిస్తారు.

 

ఇంకా చదవండి: భారత్‌లో పెరుగుతున్న హెచ్‌ఎంపీవీ కేసులు.. బాధితులందరూ 13 ఏళ్ల లోపు వారే!

 

తదుపరి సాయంత్రం 6.50 గంటలకు సభా వేదిక నుంచి బయలుదేరి విశాఖ విమానాశ్రయానికి చేరుకుని రాత్రి 7.15 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి భువనేశ్వర్ వెళతారు. ప్రధాని మోదీ వర్చువల్‌గా విశాఖపట్నం రైల్వే జోన్ ప్రధాన కేంద్రం సహా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు-బీబీనగర్, గుత్తి-పెండేకల్లు రైల్వే లైన్ల డబులింగ్ వంటి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అదే విధంగా 16వ నంబరు జాతీయ రహదారిలో చిలకలూరిపేట 6 లైన్ల బైపాస్‌ను జాతికి అంకితం చేయడంతో పాటు పలు జాతీయ రహదార్లు, రైల్వేలైన్ల‌ను వర్చువల్‌గా ప్రధాని ప్రారంభిస్తారు. 

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం... జగన్ సోదరుడు మృతి!

టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్ చల్.. ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినా..!

నేడు (8/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

మహిళలకు మోదీ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. నెలకు రూ.7 వేలు! 18 నుంచి 70 ఏళ్ల లోపు.. ఈ స్కీం ఎలా అప్లై చేయాలంటే!

వైకాపాకు మరో బిగ్ షాక్! కీలక నేతని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

వైసీపీకి ఊహించని షాక్.. వైసీపీ నేత, మాజీ మంత్రిపై కేసు నమోదు! ఆలస్యంగా వెలుగులోకి.. లైంగిక వేధింపులు..

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు!

నేడు (7/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలు, నోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో!

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం!

విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం!

ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్!

అమెరికా హెచ్ 1 బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Modi #AndhraPradesh #APPolitics #NaraLOkesh #Chandrababu #ModiMeeting #Anakapalli