చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం -ప్రధాని మోదీ! ఏపీలో భారీ ప్రాజెక్టులకు పునాది!

Header Banner

చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం -ప్రధాని మోదీ! ఏపీలో భారీ ప్రాజెక్టులకు పునాది!

  Wed Jan 08, 2025 20:59        Politics

ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పెట్టుకున్న లక్ష్యాలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) భరోసా ఇచ్చారు. ఏపీలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆశయాల సాధనకు మద్దతుగా నిలుస్తామని మోదీ హామీ ఇచ్చారు.



ఇంకా చదవండిఆందోళ‌న క‌లిగిస్తున్న కొత్త వైర‌స్‌! సుర‌క్షితంగా ఉండాలంటే! ఇమ్యూనిటీని ఇలా పెంచుకోండి!



"ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు. మీ ఆశీర్వాదంతో 60 ఏళ్ల తర్వాత తొలిసారి మేం మూడోసారి అధికారంలోకి వచ్చాం. రాష్ట్రానికి అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నాం. 2047 నాటికి 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రాష్ట్రంతో భుజం భుజం కలిపి నడుస్తాం. ఇవాళ తలపెట్టిన ప్రాజెక్టులు రాష్ట్ర వికాసానికి తోడ్పడతాయి. ఐటీ, టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రం కానుంది. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధిని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయి. 2030లోగా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మా లక్ష్యం. దేశంలో 2 గ్రీన్ హైడ్రోజన్ హబ్ లు వస్తుంటే.. దానిలో ఒకటి విశాఖకు కేటాయించాం. గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది”. “నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాపన చేశాం. కేవలం 3 రాష్ట్రాల్లోనే ఇలాంటి పార్కులు వస్తున్నాయి.



ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!



చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో క్రిస్ సిటీ భాగం అవుతుంది. ఇప్పటికే శ్రీసిటీ ద్వారా ఏపీలో తయారీరంగం ఊపందుకుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్కు పునాదిరాయి వేశాం. రాష్ట్ర అభివృద్ధిలో రైల్వే జోన్ కీలకం కానుంది. రైల్వే జోన్ ద్వారా రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుంది. రైల్వే జోన్ వల్ల వ్యవసాయ, పర్యాటక రంగాలు ఊపందుకుంటాయి. రాష్ట్రంలో ఇప్పటికే 7 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. అమృత్ భారత్ కింద ఏపీలోని 70కి పైగా రైల్వేస్టేషన్లు ఆధునికీకరణ చేపట్టాం” అని ప్రధాని వివరించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, అనిత, టీజీ భరత్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:

వైకాపాకు మరో బిగ్ షాక్! కీలక నేతని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

వైసీపీకి ఊహించని షాక్.. వైసీపీ నేతమాజీ మంత్రిపై కేసు నమోదు! ఆలస్యంగా వెలుగులోకి.. లైంగిక వేధింపులు..

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు!

నేడు (7/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ లో భారీ నియామకాలునోటిఫికేషన్ అప్పుడే.. వివరాలు ఇవిగో!

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! 24 గంటల లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ.. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం!

విజయవాడ - అమరావతి మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్! మొత్తం 33 స్టేషన్లు.. ఆ వివరాలు మీ కోసం!

ఈ నెలలో సమావేశం కానున్న ఏపీ క్యాబినెట్! 14 కీలక అంశాలపై చర్చ.. వాటికి గ్రీన్ సిగ్నల్!

అమెరికా హెచ్ బీ వీసాల్లో భారతీయుల జోరు! ప్రతీ ఐదుగురిలో ఒకరు భారత్ నుంచే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #APCM #primeminister #modi #vizag #todaynews #flashnews