తిరుమలలో విషాదం.. తొక్కిసలాటలో ఆరుగురు మృతి! ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? చంద్రబాబు తీవ్ర ఆగ్రహం!

Header Banner

తిరుమలలో విషాదం.. తొక్కిసలాటలో ఆరుగురు మృతి! ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? చంద్రబాబు తీవ్ర ఆగ్రహం!

  Thu Jan 09, 2025 08:09        Politics

తిరుమలలో ఈ నెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దర్శనాల కోసం తిరుపతి, తిరుమలలో నిన్నటి నుంచి టోకెన్ల జారీకి టీటీడీ ఏర్పాట్లు చేసింది. అయితే, భక్తులు ముందుగానే టోకెన్ జారీ కేంద్రాల వద్దకు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో, తిరుపతిలోని శ్రీనివాసం, బైరాగిపట్టెడ, సత్యనారాయణపురం వద్ద ఉన్న టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తుల మధ్య భారీగా తోపులాట చోటుచేసుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు సొమ్మసిల్లి పడిపోవడంతో వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. వారిలో చికిత్స పొందుతూ ఆరుగురు  మృతి చెందారు. వారిలో ఐదుగురు  మహిళలు ఉన్నట్టు గుర్తించారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు ఘటన స్థలాలకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రాల వద్దకు అదనపు పోలీసు బలగాలను తరలించారు. ఈ విషయంపై స్పందించిన చంద్రబాబు.. వైకుంఠద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున వస్తారని తెలిసి కూడా అందుకు తగినట్లుగా ఏర్పాట్లు ఎందుకు చేయలేదంటూ ఏపీ సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆయన సమీక్షించారు. ఏపీ డీజీపీ, టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఇంకా చదవండి: విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలు, సూచనలకు బోర్డు ఆహ్వానం!

 

భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ సందర్భంగా అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. విధుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. ముందు జాగ్రత్త చర్యల్లో విఫలమయ్యారంటూ అధికారులపై మండిపడ్డారు. టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పునఃసమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యం గురించి జిల్లా అధికారుల ద్వారా ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. విశాఖపట్నంలో ఓ మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో ఈ ఘటన బాధాకరం అన్నారు. సీఎం చంద్రబాబు ఈరోజు తిరుపతి వచ్చి క్షతగాత్రులను పరామర్శించనున్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తారు. 

చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు: చైర్మన్

తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ విచారకర ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. తిరుమలలో ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు. డీఎస్పీ గేట్లు తెరవడం వల్ల తొక్కిసలాట జరిగిందన్నారు. కొందరు అధికారుల తప్పిదం వల్ల ఇలా జరిగిందని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని సీఎం హెచ్చరించారన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రుయా ఆసుపత్రికి వెళ్లి.. క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాద ఘటన నేపథ్యంలో పలువురు మంత్రులు హుటాహుటిన తిరుపతికి చేరుకున్నారు. క్షతగాత్రులకు సహాయ చర్యలు, వైద్య సేవల పర్యవేక్షణ కోసం వారు వెంటనే తిరుపతి వచ్చారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్ తిరుపతికి వచ్చారు. 

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

 

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

 

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వం, చంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

 

ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఇక వారికీ పండగే పండగ! ఇకపై ఆ పరీక్షలు రద్దు!

 

వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం... జగన్ సోదరుడు మృతి!

 

టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్ చల్.. ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినా..!

 

నేడు (8/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు మోదీ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. నెలకు రూ.7 వేలు! 18 నుంచి 70 ఏళ్ల లోపు.. ఈ స్కీం ఎలా అప్లై చేయాలంటే!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! కీలక నేతని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

 

వైసీపీకి ఊహించని షాక్.. వైసీపీ నేత, మాజీ మంత్రిపై కేసు నమోదు! ఆలస్యంగా వెలుగులోకి.. లైంగిక వేధింపులు..

 

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews