ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే! ఈ రూట్‌లోనే! అమరావతి నుంచి బెంగళూరుకు!

Header Banner

ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే! ఈ రూట్‌లోనే! అమరావతి నుంచి బెంగళూరుకు!

  Fri Jan 10, 2025 11:30        Politics

ఆంధ్రప్రదేశ్‌లో హైవేల పనుల్ని మరింత వేగవంతం చేస్తున్నారు. కొత్త ప్రాజెక్టులతో పాటుగా మిగిలిన వాటిని కూడా వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. అమరావతి నుంచి బెంగళూరుకు కనెక్ట్ చేసే బెంగళూరు-కడప-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే పనుల్ని మరింత వేగవంతం చేశారు. ఈ హైవేను 2026 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు పనుల్లో స్పీడ్ పెంచారు. 

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ హైవేలు, రాష్ట్ర రహదారులపై ఫోకస్ పెట్టింది. కొత్త ప్రాజెక్టులతో పాటుగా గతంలో అనుమతులు వచ్చిన వాటి పనుల్ని వేగవంతం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి కీలకమైన బెంగళూరు-కడప-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులు స్పీడ్ అందుకున్నాయి. ఈ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే పనుల్ని 2026నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.. ఈ మేరకు పనులు కొనసాగుతున్నాయి. ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేతో అమరావతి నుంచి బెంగళూరుకు కనెక్టివిటీ ఉంటుంది. విజయవాడ నుంచి వెళ్లాలంటే గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, కడప మీదుగా వెళ్లొచ్చు. అలాగే గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి మీదుగా బెంగళూరకు వెళ్లొచ్చు.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కేంద్రం నేషనల్ హైవేల నిర్మాణంలో భాగంగా బెంగళూరు-కడప-విజయవాడకు కొత్తగా హైవే కనెక్టివిటీ ఉండాలని భావించింది. అందుకే రెండేళ్ల క్రితం ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు రూ.1930 కోట్ల అంచనాతో గ్రీన్ సిగ్నల్ రావడంతో పనులు ప్రారంభమయ్యాయి. ఈ హైవేకు సంబంధించి.. విజయవాడ నుంచి బాపట్ల జిల్లా జే.పంగులూరు మండలం ముప్పవరం వరకు 113 కి.మీ జాతీయ రహదారులతో ఈ గ్రీన్‌ఋఫీల్డ్ హైవేను కనెక్ట్ చేయనున్నారు. అలాగే బెంగళూరు నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లా కొడికొండ వరకు ఉన్న 73 కి.మీ కూడా జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తారు. మొత్తం 529 కిలో మీటర్ల దూరం మార్గంలో ఇప్పటికే రెండు వైపులా ఉన్న రెండు నేషనల్ హైవేల 186 కి.మీ. మినహా మరో 343 కిలోమీటర్లు పనులు చేపట్టాల్సి ఉంది.

 

బెంగళూరు-కడప-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేను 14 భాగాలుగా చేశారు. బాపట్ల జిల్లా జే.పంగులూరు మండలం ముప్పవరం నుంచి తాళ్లూరు మండలం తూర్పు గంగవరం వరకు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. బాపట్ల జిల్లాలో 10 కిలోమీటర్లు, ప్రకాశం జిల్లాలో 18.5 కిలోమీటర్లు ఈ పనులు జరుగుతున్నాయి. ఈ హైవే పొడవునా ఎక్కడా కట్టడాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేకు సంబంధించి భూములు కోల్పోయిన వారికి పరిహారం కూడా చెల్లించారు. ఈ హైవే వెంట ఉన్న ప్రతి ఊరికి బ్రిడ్జి ఏర్పాటు చేస్తు్నారు. అలాగే గుండ్లకమ్మ నదిపై బాపట్ల జిల్లా అద్దంకి మండలం వేలమూరిపాడు-మణికేశ్వరం మధ్యలో 360 మీటర్ల పొడవున భారీ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తయితే అమరావతి నుంచి బెంగళూరు త్వరగా వెళ్లొచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచేందుకు సిద్దమైంది.. ఈ మేరకు హైవే ప్రాజెక్టు పనులు వేగవంతం చేసింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్... హెల్త్ శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల! ఎగ్జామ్ లేకుండా ఎంపిక!

 

తిరుపతి ఘటన ప్రమాదమా... కుట్రా.. మంత్రి కీలక వ్యాఖ్యలు! కారకులు ఏ స్థాయిలో..

 

రఘురామ కృష్ణంరాజు పై టార్చర్ కేసులో సంచలనం! కీలక నిందితుడు అరెస్ట్!

 

పేర్ని నాని కుటుంబం రేషన్ బియ్యం మాయం కేసులో సంచలనం! కోర్టులో పోలీసుల కీలక పిటిషన్!

 

కొనసాగుతున్న పెన్షన్ల వేరిఫికేషన్... ఆ తర్వాతే తొలగింపు! వేలాది మందిపై కీలక దర్యాప్తు!

 

విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలుసూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP