జగన్ వ్యవహారం పై అమిత్ షా ఆరా.. మొత్తం చెప్పేసిన చంద్రబాబు, లోకేష్! ఎందుకో తెలుసా ? ఇక జైలుకేనా?

Header Banner

జగన్ వ్యవహారం పై అమిత్ షా ఆరా.. మొత్తం చెప్పేసిన చంద్రబాబు, లోకేష్! ఎందుకో తెలుసా ? ఇక జైలుకేనా?

  Sun Jan 19, 2025 10:51        Politics

జగన్ ఆస్తులు, ప్యాలెస్‌ల గురించి అమిత్‌షా ఆసక్తికరంగా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. జగన్ కు ఎక్కడెక్కడ ఎన్నెన్ని ప్యాలెస్‌లు ఉన్నాయి, వాటి విస్తీర్ణం ఎంత అని ఆరా తీసినట్లు తెలిసింది. విశాఖ రుషికొండపై కట్టిన ప్యాలెస్‌కు ఎన్జీటీ నిబంధనల ప్రకారం రూ.200 కోట్ల జరిమానా కట్టేల్సిందేనని అమిత్‌షా అభిప్రాయపడినట్లు తెలిసింది. సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన విందు భేటీలో అమిత్‌షా జగన్‌ ప్యాలెస్‌ల గురించి అడిగి మరీ తెలుసుకున్నట్లు సమాచారం. ఇడుపులపాయ, బెంగళూరు ఎలహంక, హైదరాబాద్ లోటస్‌పాండ్‌, తాడేపల్లిలో ప్యాలెస్‌లు ఉన్నాయని లోకేశ్‌ అమిత్‌షాకు వివరించారు. ఒక్కొక్కటి ఎన్ని ఎకరాలు ఉండొచ్చని అడగ్గా హైదరాబాద్, తాడేపల్లి ప్యాలెస్‌లో పది ఎకరాల్లోపు ఉంటాయని లోకేశ్ బదులిచ్చారు. బెంగళూరు ప్యాలెస్ విస్తీర్ణం గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. సుమారు 30 ఎకరాలకు పైనే ఉందని లోకేశ్ అందుకు బదులిచ్చారు. దానికి అన్ని ఎకరాల్లోనా? అంటూ అమిత్ షా అశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం. విశాఖలోనూ రూ.500 కోట్లు వెచ్చించి ప్యాలెస్ కట్టించారని లోకేశ్ చెప్పగా అది ప్రభుత్వ డబ్బుతో కట్టిందే కదా? అని అమిత్ షా అన్నారు.

 

 ఇంకా చదవండి: జగన్ అసమర్థ పాలనతో బైపాస్ పనులపై రూ.400 కోట్ల అదనపు భారం! కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు

 

నిక్షేపంగా ఉన్న పాత పర్యాటకశాఖ కాటేజీలను కూల్చేసి, పర్యావరణాన్ని విధ్వంసం చేసి ఆ ప్యాలెస్లు కట్టారని లోకేశ్ వివరించారు. దానికి ఎన్జీటీ రాష్ట్రప్రభుత్వానికి 200 కోట్ల జరిమానా వేసిందని లోకేశ్ గుర్తు చేశారు. ఆ భారం ఇప్పుడు తమ ప్రభుత్వంపై పడిందని వివరించారు. ఆ జరిమానా కట్టేశారా? అని షా ప్రశ్నించగా ఇంకా లేదని లోకేశ్ బదులిచ్చారు. ఎన్జీటీ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయని అమిత్ షా తెలిపారు. ఎన్జీటీకి ఆ డబ్బు ఎప్పటికైనా కట్టాల్సిందేనని అమిత్‌షా అన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ ప్రజల్లో తిరుగుతున్నారా? అని షా ప్రశ్నించారు. అందుకు బదులుగా ఎక్కువగా బెంగళూరులోనే ఉంటూ, అప్పుడప్పుడూ వచ్చి ప్రకటనలు మాత్రం ఇస్తున్నారని లోకేశ్ వివరించారు. నేడు గన్నవరంలో జరిగే ఎన్డీఆర్ఎఫ్ వేడుకలకు అమిత్‌షాతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. సాయంత్రం ఇద్దరు నేతలు విడివిడిగా దిల్లీ వెళ్లనున్నారు. సీఎం దిల్లీ నుంచి నేరుగా దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్తారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ శుభవార్త: ఈ పథకాల్లో మూడు రకాలు.. ఆ రైతులకు అకౌంట్లో డబ్బు జమ.. మీకు వచ్చిందా?

 

మగాడి తోడు లేకున్నా బాగానే ఉన్నా.. 53 ఏళ్ల వయసు! ఆ స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

 

లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలి.. చంద్రబాబుకు టీడీపీ నేత రిక్వెస్ట్!

 

రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వ నుంచి బిగ్ అప్‌డేట్! ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! బీజేపీ లోకి జంప్ అయిన కీలక నేత!

 

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై టీడీపీ అధిష్ఠానం ఫైర్..! విషయం ఇదే..!

 

ఏపీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు! దేశంలోనే తొలి ప్రైవేట్ వెహికల్ పార్క్! 1200 ఎకరాల్లో!

 

ఆ విషయంలో కేంద్రనిదే చారిత్రాత్మకమైన నిర్ణయం! విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త దశలోకి!

 

'0' అక్షరంతో ప్రారంభమయ్యే ఏకైక దేశం! అది ఏదో తెలిస్తే పకా షాక్!

 

రికార్డులు సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా టీడీపీ కార్యకర్తలకే సాధ్యం! ఎవరితో అయినా పెట్టుకోవచ్చు - టీడీపీతో అయితే కష్టమే!

 

జగన్‌కు పుత్రికోత్సాహం - మమ్మల్ని గర్వపడేలా చేశావంటూ ట్వీట్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews