కూటమి సర్కారు రంగం సిద్ధం.. నేటి నుంచి సీఎం విదేశీ పర్యటన! 30 మంది ప్రముఖ సంస్థల ప్రతినిధులతో..

Header Banner

కూటమి సర్కారు రంగం సిద్ధం.. నేటి నుంచి సీఎం విదేశీ పర్యటన! 30 మంది ప్రముఖ సంస్థల ప్రతినిధులతో..

  Sun Jan 19, 2025 11:18        Politics

ఐదేళ్లు దెబ్బతిన్న ‘బ్రాండ్‌ ఏపీ’ని అంతర్జాతీయ స్థాయిలో పునరుద్ధరించేందుకు కూటమి సర్కారు రంగం సిద్ధం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ఒకేచోట చేరే దావోస్‌ ఆర్థిక సదస్సును దీనికి వేదికగా మార్చుకోనుంది. దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు... ఆదివారం రాత్రి 1.30 గంటలకు ఢిల్లీ నుంచి జ్యూరిచ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం బయలు దేరివెళ్లనున్నది. రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా మూడు రోజులు వరుస సమావేశాలు నిర్వహిస్తారు. ఒకే చోట పలువురు దేశాధినేతలతోపాటు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థల అధిపతులను కలిసే అవకాశం దావోస్‌లో లభిస్తుంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇదొక అద్భుత అవకాశం. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఒకేఒక్కసారి ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు.

 

ఇంకా చదవండి: జగన్ వ్యవహారం పై అమిత్ షా ఆరా.. మొత్తం చెప్పేసిన చంద్రబాబు, లోకేష్! ఎందుకో తెలుసా ? ఇక జైలుకేనా?

 

అది కూడా... అయిష్టంగా, అన్యమనస్కంగానే! దీంతో... అంతర్జాతీయ యవనికపై ‘బ్రాండ్‌ ఏపీ’ గురించి ప్రచారం చేసే అవకాశమే లభించలేదు. ఇప్పుడు... చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కాగానే దావోస్‌ ఆర్థిక సదస్సులో ఏపీ పెవిలియన్‌ కొలువు తీరుతోంది. ఈ మూడు రోజుల్లో చంద్రబాబు కనీసం 30 మంది ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యేలా ప్రణాళిక రచించారు. ముందే ఖరారైన భేటీలతోపాటు... అప్పటికప్పుడు అవకాశాన్నిబట్టి ఇతరులతోనూ సమావేశమవుతారు. దావోస్‌ పర్యటనలో తొలిరోజున చంద్రబాబు స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారితో సమావేశమవుతారు. ఆ తర్వాత హిల్టన్‌ హోటల్‌లో పది మంది పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతారు. స్విట్జర్లాండ్‌లోని ప్రవాసాంధ్రులతో ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’తో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు. రాత్రి పలువురు పారిశ్రామిక, వాణిజ్యవేత్తలతో డిన్నర్‌లో పాల్గొంటారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ శుభవార్త: ఈ పథకాల్లో మూడు రకాలు.. ఆ రైతులకు అకౌంట్లో డబ్బు జమ.. మీకు వచ్చిందా?

 

జగన్ అసమర్థ పాలనతో బైపాస్ పనులపై రూ.400 కోట్ల అదనపు భారం! కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు

 

మగాడి తోడు లేకున్నా బాగానే ఉన్నా.. 53 ఏళ్ల వయసు! ఆ స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

 

లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలి.. చంద్రబాబుకు టీడీపీ నేత రిక్వెస్ట్!

 

రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వ నుంచి బిగ్ అప్‌డేట్! ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! బీజేపీ లోకి జంప్ అయిన కీలక నేత!

 

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై టీడీపీ అధిష్ఠానం ఫైర్..! విషయం ఇదే..!

 

ఏపీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు! దేశంలోనే తొలి ప్రైవేట్ వెహికల్ పార్క్! 1200 ఎకరాల్లో!

 

ఆ విషయంలో కేంద్రనిదే చారిత్రాత్మకమైన నిర్ణయం! విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త దశలోకి!

 

'0' అక్షరంతో ప్రారంభమయ్యే ఏకైక దేశం! అది ఏదో తెలిస్తే పకా షాక్!

 

రికార్డులు సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా టీడీపీ కార్యకర్తలకే సాధ్యం! ఎవరితో అయినా పెట్టుకోవచ్చు - టీడీపీతో అయితే కష్టమే!

 

జగన్‌కు పుత్రికోత్సాహం - మమ్మల్ని గర్వపడేలా చేశావంటూ ట్వీట్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews