సామాన్యులకు షాక్.. కొండ దిగనంటున్న కోడిగుడ్డు ధరలు! ఓవైపు కూరగాయల ధరలు..

Header Banner

సామాన్యులకు షాక్.. కొండ దిగనంటున్న కోడిగుడ్డు ధరలు! ఓవైపు కూరగాయల ధరలు..

  Sun Dec 01, 2024 16:22        Business

రోజు రోజుకు కోడి గుడ్డు ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఓవైపు కూరగాయల ధరలు, మరోవైపు కోడిగుడ్ల ధరలు సామాన్య ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్లో కోడి గుడ్డు ధర 5 రూపాయల 90 పైసలుగా నెక్ నిర్ణయించింది. ఇక రిటైల్ మార్కెట్లో ఆరు రూపాయల 50 పైసల నుంచి ఏడు రూపాయల వరకు కోడి గుడ్డు ధర పలుకుతుంది. దీంతో ప్రస్తుతం ప్రజలు కోడిగుడ్లు కొనాలంటే భయపడుతున్నారు. ఇక రానున్న రోజుల్లో కోడిగుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి. చలికాలంలో కోడిగుడ్ల వినియోగం పెరగడం కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గడం వంటి కారణాలు మాత్రమే కాకుండా క్రిస్మస్, నూతన సంవత్సర సందర్భంగా కేకుల తయారీకి గుడ్లను పెద్ద ఎత్తున వినియోగిస్తున్న క్రమంలోను కోడిగుడ్ల ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉందని వ్యాపార వర్గాల భావిస్తున్నాయి. అంతేకాదు కోళ్ల దాణా రేటు, రవాణా ఖర్చులు సైతం వీటి ధరలను ప్రభావితం చేస్తున్నాయని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

 

 ఇంకా చదవండి: తుఫాను ప్రభావం.. ఏపీకి బిగ్ అలర్ట్! ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్!

 

ఈ సంవత్సరం జనవరి నెలలో కోడి గుడ్డు ధర ఏడు రూపాయలు పలకగా, ఆ తర్వాత కొద్ది కొద్దిగా క్షీణించి మే నెల వరకు ఐదు రూపాయల నుంచి 5.50 పైసల వరకు గుడ్డు ధర చేరింది. మళ్లీ ఇప్పుడు క్రమంగా పెరుగుతూ గుడ్డు ధర ఏడు రూపాయలకు చేరింది. ప్రస్తుతం ఒక డజన్ గుడ్లు కొనాలంటే సామాన్యులు 84 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ప్రతిరోజు గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి అంటూ ప్రభుత్వాలు ప్రకటనలు చేసినా ప్రతిరోజు కాదు.. అడపాదడప గుడ్డు తినాలంటే కూడా భయపడే పరిస్థితి వచ్చింది. విపరీతంగా పెరుగుతున్న కోడిగుడ్ల ధరలకు కళ్లెం వేయడానికి ప్రభుత్వాలు ఆలోచిస్తే బాగుండు అన్న అభిప్రాయం సామాన్య, మధ్యతరగతి ప్రజలలో వ్యక్తం అవుతుంది.

ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టుల మరో లిస్టు విడుదల?? పార్టీ శ్రేణుల్లో పెరిగిపోతున్న ఉత్కంఠ.. అసహనం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బూడిద తరలింపు వివాదం.. ఎమ్మెల్యేపై చంద్రబాబు ఫైర్! ఎందుకు అంటే!

 

మందుబాబులకు కిక్కే కిక్కు.. భారీగా తగ్గిన మద్యం ధరలు! ఆ వివరాలు మీ కోసం..

 

2/12 TO 14/12 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి మరో షాక్.. కొడాలి నాని మెడకు ఉచ్చు - అనూహ్య ట్విస్ట్! కీలక అంశాలు వెలుగులోకి...

 

నాగచైతన్య పెళ్లికి నాగార్జున ఇస్తున్న బహుమతి ఏమిటో తెలుసా? దాదాపు ఎనిమిది గంటల సమయం!

 

వైసీపీకి షాక్.. రోజాపై పోలీసులకు ఫిర్యాదు! ఫొటోలు, వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్!

 

ఏపీలో ప్రజలకు గుడ్ న్యూస్! కొత్త రేషన్ కార్డులు! దరఖాస్తులు ఎప్పటినుంచి అంటే?

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! శ్రీవారి ప్రత్యేక దర్శనం, గోల్డెన్ ఛాన్స్! టోకెన్లు ఇలా...

 

ఏపీ మహిళల అకౌంట్లలో రూ.1,500... ఇది మీరు గమనించారా? అలా అస్సలు చేయవద్దు - ప్రభుత్వం కీలక అప్డేట్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Eggs #Business #Rates #AndhraPradesh #VegetablesRate