గోల్డ్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్! డిసెంబర్ నెలలో గోల్డ్ రేట్లు నేల చూపులు..

Header Banner

గోల్డ్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్! డిసెంబర్ నెలలో గోల్డ్ రేట్లు నేల చూపులు..

  Tue Dec 24, 2024 17:00        Business

ఈ ఏడాది ఆరంభం నుంచే జోరుగా పైపైకి వెళ్లిన వెండి, బంగారం ధరలు ఈ మధ్యకాలంలో కాస్త డీలా పడటం చూస్తున్నాం. ఈ డిసెంబర్ నెలలో గోల్డ్ రేట్లు నేల చూపులు చూస్తున్నాయి. వరుస సెషన్స్‌లో బంగారం రేటు దిగొస్తుండటంతో పసిడి ప్రియులు పండగ చేసుకుంటున్నారు. గత 2 వారాల్లో చూస్తే బాగా తగ్గిన గోల్డ్ రేట్లు.. నేడు స్వల్ప మార్పులకు లోనయ్యాయి. నిన్నటితో పోల్చితే నేడు గోల్డ్ రేటు రూపానికి రూ. 100 తగ్గింది. గత రెండు వారాల్లో చూస్తే ఏకంగా రూ. 2000 వేలు తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో ఉన్న వెండి, బంగారం ధరలు జనాన్ని బాగా ఆకర్షిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, డిమాండ్ దృష్ట్యా నిత్యం బంగారం ధరల్లో నిత్యం మార్పులు చూస్తుంటాం. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా ఇన్వెస్టర్లను పరేషాన్ చేస్తున్న గోల్డ్, ప్రస్తుతం కాస్త ఊరట కలిగిస్తోంది. ఈ నెలలో అయితే గోల్డ్ రేట్లు క్రమంగా దిగిరావడమే కనిపిస్తోంది. నేడు (డిసెంబర్ 24) హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ గోల్డ్ తులానికి రూ. 77 వేల 350 రూపాయలకు లభిస్తోంది. 22 క్యారెట్ గోల్డ్ రేటు చూస్తే 70 వేల 900 రూపాయలకు దొరుకుతోంది.

 

ఇంకా చదవండి: రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా? ఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు! కీలక ఆదేశాలు - అది ఏమిటంటే!

 

దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి. వెండి ధరల్లో కూడా ఈ ఏడాది భారీ ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి. ఈ నెలలో ఆల్ టైమ్ హై నుంచి సిల్వర్ రేటు బాగా దిగొచ్చింది. ఈ రోజు సిల్వర్ రేటులో కూడా ఎలాంటి మార్పు కనిపించలేదు. నేడు కిలో వెండి 98 వేల 900 రూపాయలకు లభిస్తోంది. ఇదిలాఉంటే.. 2024 ఏడాదిలో చూస్తే బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి అద్భుతమైన రిటర్న్స్ వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటివరకు పసిడి ధర ఏకంగా 30 శాతానికి పైగా పెరిగింది. బులియన్‌ ఇన్వెస్టర్లకు దశాబ్ద కాలంలో ఇదే అత్యుత్తమ వార్షిక ప్రతిఫలమని ప్రపంచ స్వర్ణ మండలి (WGC) తాజా నివేదిక వెల్లడించింది. వచ్చే ఏడాది కూడా బంగారం ధరల్లో పాజిటివ్ మూమెంట్స్ కనిపిస్తాయని, గోల్డ్ రేటు లక్ష కూడా దాటే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో సాధారణ ప్రజలు కూడా బంగారంపై పెట్టుబడి సురక్షితం అని భావించి క్రమంగా ఇనెస్ట్ చేస్తూ వస్తున్నారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!

 

రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. నెలకు రూ.3 లక్షల 20 వేల జీతంతో జాబ్, అర్హతలు ఇవే! వారికి జర్మనీ దేశంలో..

 

నేడు (24/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు! పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన!

 

బీసీ సంక్షేమానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు! ప్రత్యేక రక్షణ చట్టంపై...!

 

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కారు! ఇకపై ఆ తరగతుల విద్యార్థులు మస్ట్​గా పాస్​ కావాల్సిందే - లేదంటే!

 

బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!

 

డబ్బులు కడితే దొంగ దొర అవుతాడా? పదేపదే నీతులు వల్లించే వైసీపీ నేత! మాజీ మంత్రి పై మంత్రి ఫైర్!

 

2025 జనవరితో ఆ ఫోన్లలో వాట్సాప్‌ సేవలు బంద్! బ్యాకప్ లేకుంటే మీ డాటా పోయినట్టే!

 

USAలో మ‌రో తెలుగు విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి! ఎవరు? ఎందుకు? దీని వెనుక ఎవరి హస్తం!

 

నేడు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #GoldRate #Gold #Dubai #DubaiGoldRate #DubaiGoldBusiness #GoldRateLow #LessGoldRateInDubai #UAE #GoldBusiness #LowPriceGoldInDubai