సంచలన బౌలింగ్‌తో షేన్ వార్న్ రికార్డును సమం చేసిన అశ్విన్! చెన్నై టెస్టులో 6 వికెట్లతో!

Header Banner

సంచలన బౌలింగ్‌తో షేన్ వార్న్ రికార్డును సమం చేసిన అశ్విన్! చెన్నై టెస్టులో 6 వికెట్లతో!

  Sun Sep 22, 2024 16:49        Sports

చెన్నై వేదికగా భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదం తొక్కిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లతో చెలరేగాడు. ఈ క్రమంలో అశ్విన్ తన కెరీర్‌లో మరో రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. బంగ్లాపై అద్భుత ప్రదర్శనతో కెరీర్‌లో 37వ సారి 5 వికెట్లు తీసిన ఘనతను అశ్విన్ అందుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు, మాజీ దిగ్గజం షేన్ వార్న్ రికార్డును సమం చేశాడు. వార్న్ కూడా తన టెస్ట్ కెరీర్‌లో 37 సార్లు 5 వికెట్లు తీశాడు. అయితే వార్న్ కంటే 81 ఇన్నింగ్స్ ల ముందుగానే అశ్విన్ ఈ ఘనతను సాధించడం విశేషం. కాగా శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ శ్రీలంక మాజీ దిగ్గజం తన కెరీర్‌లో ఏకంగా 67 సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 230 ఇన్నింగ్స్‌ లు ఆడి ఈ రికార్డును నెలకొల్పాడు. 

ఇంకా చదవండి: ముంబైలో ల‌వ‌ర్‌తో క‌లిసి చ‌క్క‌ర్లు కొట్టిన‌ హార్దిక్ మాజీ భార్య న‌టాషా! నెట్టింట వీడియో వైర‌ల్‌!


టెస్టుల్లో అత్యధికంగా 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన బౌలర్లు వీళ్లే
1.
ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) - 67 సార్లు ( 230 ఇన్నింగ్స్‌)
2.
అశ్విన్ (భారత్) - 37 సార్లు (191 ఇన్నింగ్స్‌)
3.
షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) - 37 సార్లు (273 ఇన్నింగ్స్‌)
4.
సర్ రిచర్డ్ హ్యాడ్లీ (న్యూజిలాండ్) - 36 సార్లు (150 ఇన్నింగ్స్‌)
5.
అనిల్ కుంబ్లే (భారత్) - 35 సార్లు (236 ఇన్నింగ్స్‌).

మరోవైపు టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో వెస్టిండీస్ మాజీ పేసర్ కోర్ట్నీ వాల్ష్‌ను అశ్విన్ అధిగమించాడు. వాల్ష్ 519 వికెట్లు పడగొట్టగా... అశ్విన్ ప్రస్తుతం 522 వికెట్లు తీసి ఈ జాబితాలో 8వ స్థానంలో నిలిచాడు. ఇదిలావుంచితే.. సొంత మైదానంలో అశ్విన్ అద్భుత బౌలింగ్‌ ముందు బంగ్లాదేశ్ బ్యాటర్లు తేలిపోయారు. భారీ లక్ష్య ఛేదనలో 234 పరుగులకే ఆలౌట్ అయ్యారు.  దీంతో భారత్ ఏకంగా 280 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 2 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కాగా ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లలో రాణించిన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డ్‌ అందుకున్నాడు.

ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎదురుదాడి చేస్తే భయపడతాననుకుంటున్నారా.. తాట తీస్తా! చంద్రబాబు వార్నింగ్! ఈ సైకోలకు ప్రభుత్వం అంటే!

 

వైసీపీ మాజీ మంత్రి కొన్ని కోట్లు వసూలు! ఎవరి దగ్గర - ఎంతంటే! ఫిర్యాదుతో బయటపడ్డ అసలు నిజాలు!

 

సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు.! ప్రకాశం పర్యటన ఖరారు! ఎందుకో తెలుసా?

 

ఉండేదెవరు..? పోయేదెవరు..? జిల్లాల వారీగా నేతలతో జగన్ వరుస భేటీలు! మరికొందరు నేతలు కూడా పక్కచూపులు!

 

ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

 

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం.. ఉచితంగా నెలకు 3 వేలు! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలన వ్యాఖ్యలు! వైసీపీకి వార్నింగ్ - కూటమికీ ముందస్తుగా!

 

వీసా గొడవ లేదు! పాస్‌ పోర్ట్‌ ఉంటే చాలు.. మూడు గంటల జర్నీ! ఈ దేశానికి పోటెత్తుతున్న భారతీయ టూరిస్టులు!

 

ఏపీ ఎక్కడ బాగుపడిపోతుందా అన్న దిగులు మొదలైంది సైకోకి! సంతోషించాల్సిన సమయంలో జగన్ ఏడుపు!

 

కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక! దాని జోలికి వెళ్లొద్దు అని సూచన! ఎందుకంటే..!

 

నేటి నుంచి ఏపీలో ఫ్రీ ఇసుక - బుకింగ్ ఇలా..! అధికారులు నుంచి ఇసుక రవాణా!

 

వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు! బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు?

 

మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం! జగన్ హయాంలో పథకాలకు! మరో కీలక నిర్ణయం!

 

ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఆరోజు నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు!

 

కుటుంబంలో 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారికి శుభవార్త! రేపే ప్రారంభం! ఇది అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు అందుబాటులో!

 

బీఆర్ఎస్ కు హైకోర్టులో ఊహించని షాక్! పార్టీ ఆఫీసు కూల్చివేయాలని ఆదేశాలు జారీ!

 

కొత్త మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం! బీసీల రిజర్వేషన్ పై కీలక చర్చ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #RavichandranAshwin IndiavsBangladesh #Cricket #TeamIndia #ShaneWarne