ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ కొత్త చైర్మన్‌ తొలి సంతకం! కొత్త ఆలోచనల దిశగా క్రీడా అభివృద్ధి!

Header Banner

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ కొత్త చైర్మన్‌ తొలి సంతకం! కొత్త ఆలోచనల దిశగా క్రీడా అభివృద్ధి!

  Fri Oct 04, 2024 19:02        Politics, Sports

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ గా రవినాయుడు
ప్రమాణస్వీకారం మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర రవాణా,యువజన,క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రవి నాయుడు కష్టానికి దక్కిన గౌరవం .. మంత్రి రాంప్రసాద్ రెడ్డి
విజయవాడ, అక్టోబర్,04. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను ఈ స్థాయికి ప్రోత్సహించి ఈ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ గా అనిమిని రవి నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ క్రీడా ప్రాంగణ కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేశారు. బాధ్యతతో ముందుకు సాగుతానని ఈ గౌరవం నాతో భాగస్వాములైన వారందరికీ దక్కిన గౌరవమాని చైర్మన్ తెలిపారు. తన వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఒక పక్కన అవినీతిపై ఉక్కు పదం మోపుతూ మరో పక్కన క్రీడల అభివృధికి పాటుపడతానని, అదేవిధంగా ఎవరైతే క్రీడారంగంలో రాణించలేక ఇబ్బంది పడుతున్నారో వాళ్లందర్నీ గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ముందుకు సాగేలా మంచి శిక్షకులను ఏర్పాటు చేసి ప్రతిభావంతులను వెలికి తీస్తామని శాప్ చైర్మన్ తెలిపారు. ప్రతి సోమవారం శాప్ కార్యాలయంలో విధిగా గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందనీ అన్నారు.



ఇంకా చదవండికఠిన చర్యలు తీసుకోకపోతే ఒక తరాన్ని నష్టపోతాం! హోంమంత్రి అనిత అధ్యక్షతన మంత్రుల ఉపసంఘం సమావేశం!



రవి నాయుడు కష్టానికి దక్కిన గౌరవం.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి కార్యకర్తలు అందరు సమిష్టి కృషివల్లనే తాము ఈ స్థాయిలో ఉన్నామని అందరు సమానమేనని మంత్రి తెలిపారు. రవి నాయుడు కష్టానికి దక్కిన గౌరవం ఇదని తెలుగుదేశం పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్లకు మంచి అవకాశాలు ఉంటాయని, దానిని రవినాయుడు రుజువు చేసాడని రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి అన్నారు. సియం చంద్రబాబునాయుడు, యువ నాయకులు మంత్రి లోకేష్ బాబు నాయకత్వంలో ఈ ఐదు సంవత్సరాలు కూడా మన నాయకులు ఇద్దరికీ మంచి పేరు తెచ్చే విధంగా పార్టీని అలాగే ప్రభుత్వాన్ని కూడా ముందుకు తీసుకునిపోయే విధంగా అందరం కలిసికట్టుగా పని చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. యువనాయకులు లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో అండదండగా ఉంటూ సుమారు 200 రోజులు ఆ కార్యక్రమాన్ని ఎండా వాన కూడా లెక్క చేయకుండా రవి పనిచేశారని, కాబట్టి ఈ రోజు ఆయనకింత గౌరవం దక్కిందని అదే విధంగా తనకు రాయచోటి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి చిన్న వయసులోనే మంత్రి పదవి ఇవ్వడం అనేది కేవలం సియం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఇచ్చిన గౌరవమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో శాప్ ఎండీ గిరిష, మంత్రి కొల్లురవీంద్ర,తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మేల్యే పల్ల శ్రీనివాస్. ఆర్టీసి ఛైర్మన్ కొనకళ్ల నారాయణ , పలువురు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తీవ్ర జ్వరంతో తిరుమలలోనే ఉండిపోయిన డిప్యూటీ సీఎం! వారాహి సభ ఉంటుందా? లేదా?

 

పిచ్చి ఆకులు అనుకోని పడేస్తున్నారా? వాటితో ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు!

 

తిరుమల లడ్డూ వివాదంపై పెరిగిపోతున్న ఉత్కంఠ! సుప్రీం కోర్టులో విచారణ వాయిదా!

 

బీజేపీకి షాక్ ఇచ్చిన మాజీ ఎంపీ! ఐదేళ్లలో నాలుగో సారి పార్టీ చేంజ్!

 

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు షాక్‌! మరో 14 రోజులు రిమాండ్‌ పొడిగింపు!

 

గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం! తాను చేసిన పనికి గుర్తింపు!

 

హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరుఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు!

 

ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! నియామక ప్రక్రియ వేగవంతం! హోం శాఖ అనిత కీలక ప్రకటన!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group





   #andhrapravasi #sports #chairman #sportsminister #CM #CBN #TDP #todaynews #flashnews #latestupdate