జేఈఈ అడ్వాన్స్‌డ్-2025 పరీక్ష తేదీ వచ్చేసింది! డిటెయిల్స్ ఇవిగో!

Header Banner

జేఈఈ అడ్వాన్స్‌డ్-2025 పరీక్ష తేదీ వచ్చేసింది! డిటెయిల్స్ ఇవిగో!

  Mon Dec 02, 2024 20:01        Education

ఐఐటీలు, నిట్‌లు, ట్రిపుల్ ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కళాశాలల్లో బీఈ/ బీటెక్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. 2025 మే 18 రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. మే 18 ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండో పేపర్ పరీక్ష నిర్వహిస్తారు. ఐఐటీల్లో అడ్మిషన్ల కోసం అభ్యర్థులు రెండు పరీక్షలు తప్పనిసరిగా రాయాల్సిందే. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) మోడ్‌లో పరీక్ష జరుగుతుంది. ఒక అభ్యర్థి రెండేండ్లలో గరిష్టంగా రెండు సార్లు ఈ పరీక్షకు హాజరు కావచ్చు.

 

జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 2000 అక్టోబర్ ఒకటో తేదీ తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఐదేండ్ల వరకూ సడలింపు ఉంటుంది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు 1995 అక్టోబర్ ఒకటో తేదీ తర్వాత జన్మించి ఉండాలి. జేఈఈ మెయిన్ 2025 పరీక్షలో ఉత్తీర్ణులైన (అన్ని క్యాటగిరీల విద్యార్థుల్లో 2.50 లక్షల మంది మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హులు. ఫిజిక్స్, కెమెస్టీ, మ్యాథమేటిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా 2024,2025 విద్యా సంవత్సరాల్లో 12వ తరగతి తత్సంబంధ సమాన పరీక్ష తొలిసారి పాస్ అయి ఉండాలి. 

 

ఇంకా చదవండిరోజా నోరు మూపించిన షర్మిల.. ఘాటు కౌంటర్! స్క్రిప్ట్ మీదేనా, ఆయనదా? లేక ఉన్నది లేనిది చెప్పే సాక్షిదా? 

 

ఇంకా చదవండినామినేటెడ్ పోస్టుల మరో లిస్టు విడుదల?? పార్టీ శ్రేణుల్లో పెరిగిపోతున్న ఉత్కంఠ.. అసహనం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు దరఖాస్తు కోసం టిప్స్..
జేఈఈఅడ్వ్.ఏసీ.ఐఎన్ (jeeadv.ac.in) అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.

జేఈఈ మెయిన్ 2025 అప్లికేషన్ నంబర్, పాస్ వర్డ్ ఉపయోగించి జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ (JEE Advanced Registration Portal) యాక్సెస్ చేసుకోవాలి.

అప్లికేషన్ ఫామ్ నింపి, అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.


అటుపై అప్లికేషన్ ఫీజు చెల్లించి అప్లై చేయాలి.

తదుపరి అప్లికేషన్ ఫామ్ డౌన్ లోడ్ చేసి, ప్రింట్ తీసుకోవాలి. 

 

జేఈఈ అడ్వాన్డ్స్ రిజిస్ట్రేషన్ ఫీజు
జేఈఈ అడ్వాన్సడ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు క్యాటగిరీల వారీగా వేర్వేరుగా ఉంటుంది. అన్ని క్యాటగిరీల్లో బాలికలతోపాటు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.1,450, ఇతర అభ్యర్థులు రూ.2,900 చెల్లించాలి. సార్క్ దేశాల్లో నివసిస్తున్న పీఐఓ / ఓసీఐలతోపాటు విదేశీ విద్యార్థులు 90 డాలర్లు, సార్క్‌యేతర దేశాల్లో నివసిస్తున్న విద్యార్థులు 180 డాలర్లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీ కార్యకర్త ఆత్మహత్యపై లోకేశ్ భావోద్వేగ వ్యాఖ్యలు! కష్టాలను చెప్పుకోకపోవడం నా మనసును కలిచివేసింది!

 

బూడిద తరలింపు వివాదం.. ఎమ్మెల్యేపై చంద్రబాబు ఫైర్! ఎందుకు అంటే!

 

మందుబాబులకు కిక్కే కిక్కు.. భారీగా తగ్గిన మద్యం ధరలు! ఆ వివరాలు మీ కోసం..

 

2/12 TO 14/12 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి మరో షాక్.. కొడాలి నాని మెడకు ఉచ్చు - అనూహ్య ట్విస్ట్! కీలక అంశాలు వెలుగులోకి...

 

నాగచైతన్య పెళ్లికి నాగార్జున ఇస్తున్న బహుమతి ఏమిటో తెలుసాదాదాపు ఎనిమిది గంటల సమయం!

 

వైసీపీకి షాక్.. రోజాపై పోలీసులకు ఫిర్యాదు! ఫొటోలువీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్!

 

ఏపీలో ప్రజలకు గుడ్ న్యూస్! కొత్త రేషన్ కార్డులు! దరఖాస్తులు ఎప్పటినుంచి అంటే? 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Education #JEE #Mains #NTA