ఆసక్తికర జీతంతో మంచి ఉద్యోగ అవకాశం! తిరుమలలో పని చేసే లక్కీ ఛాన్స్!

Header Banner

ఆసక్తికర జీతంతో మంచి ఉద్యోగ అవకాశం! తిరుమలలో పని చేసే లక్కీ ఛాన్స్!

  Fri Oct 04, 2024 08:00        Employment

టీటీడీ మరో జాబ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగార్థులకు తిరుమలలో పని చేసే గొప్ప అవకాశంతో పాటు నెలకు రూ.2 లక్షల జీతం కూడా ఇవ్వబోతోంది. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం చూద్దామా. తిరుమల తిరుపతి దేవస్థానంలో రెండేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన మిడిల్ లెవెల్ కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. తిరుపతిలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కార్పొరేషన్ (SLSMPC) ఈ ఉద్యోగ ప్రకటన చేసింది. మిడిల్ లెవల్ కన్సల్టెంట్ పోస్టులు మొత్తం 03 ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు MBA పాస్ తో పాటు జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ లేదా ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ లో 10- 15 ఏళ్ల పని అనుభవం కలిగి ఉండాలని పేర్కొన్నారు.

 

ఇంకా చదవండి: ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! నియామక ప్రక్రియ వేగవంతం! హోం శాఖ అనిత కీలక ప్రకటన!

 

అదేవిధంగా ఐటీ/ అనలిటికల్‌/ కమ్యూనికేషన్‌ తదితరాల్లో నైపుణ్యం అవసరం అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన, హిందూ మత అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులుగా పేర్కొన్నారు. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 45 ఏళ్లు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాలి. దరఖాస్తులు సమర్పించడానికి చివరితేది అక్టోబర్‌ 7. అభ్యర్థులు తమ దరఖాస్తులను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీలక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కార్పొరేషన్, పాత అలిపిరి గెస్ట్ హౌస్, తిరుపతి చిరునామాకు పంపించాలి. recruitments.slsmpc@gmail.comకి ఈ-మెయిల్ కూడా చేయొచ్చు. అర్హులైన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్ట్ చేస్తారు.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తీవ్ర జ్వరంతో తిరుమలలోనే ఉండిపోయిన డిప్యూటీ సీఎం! వారాహి సభ ఉంటుందా? లేదా?

 

పిచ్చి ఆకులు అనుకోని పడేస్తున్నారా? వాటితో ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు!

 

తిరుమల లడ్డూ వివాదంపై పెరిగిపోతున్న ఉత్కంఠ! సుప్రీం కోర్టులో విచారణ వాయిదా!

 

బీజేపీకి షాక్ ఇచ్చిన మాజీ ఎంపీ! ఐదేళ్లలో నాలుగో సారి పార్టీ చేంజ్!

 

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు షాక్‌! మరో 14 రోజులు రిమాండ్‌ పొడిగింపు!

 

గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం! తాను చేసిన పనికి గుర్తింపు!

 

హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరు? ఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు!

 

ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! నియామక ప్రక్రియ వేగవంతం! హోం శాఖ అనిత కీలక ప్రకటన!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #NewJob #Temple #Tirupati #TTD