ఈ సారి నిరుద్యోగులకు పండగే.. మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం! ఉచిత శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు!

Header Banner

ఈ సారి నిరుద్యోగులకు పండగే.. మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం! ఉచిత శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు!

  Fri Nov 29, 2024 08:00        Employment

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జర్మన్ భాష ఉచిత శిక్షణ మరియు జర్మనీ దేశంలో నర్సులుగా ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని బీఎస్సీ నర్సింగ్ మరియు జిఎన్ఎమ్ నర్సింగ్ పూర్తి చేసి హాస్పిటల్ నందు నర్సింగ్ కేర్ నందు కనీసం రెండు నుంచి మూడు ఏళ్ల అనుభవం కలిగి ఉన్న నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ దేశం నందు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఉద్యోగాల కొరకై జర్మనీ భాష నేర్పించి మరియు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కొరకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ , ఓమ్ క్యాప్ వారు ఎస్ఎంకేర్ సొల్యూషన్స్ జిఎంబిహ్ మరియు హాల్లో లాంగ్వేజ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో స్కిల్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మాంట్ ప్రోగ్రాం ఇన్ జర్మన్ లాంగ్వేజ్ అను కార్యక్రమం స్వీమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తిరుపతి నందు ఆరు నెలలు ఉచితంగా శిక్షణా మరియు ఉపాధి అవకాశాలసు సంబంధించి ఈరోజు ప్రారంభించారు. 

 

ఇంకా చదవండి: నిరుద్యోగులకు భారీ శుభవార్త! వర్క్ ఫ్రం హోమ్‌ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు!Don't Miss

 

ఈ కార్యక్రమంలో జర్మన్ దేశ ప్రతినిధులు మిస్ సచికోయిసోబ్  మేనేజింగ్ డైరెక్టర్ ఏస్ఏమ్ కేర్ వారు మాట్లాడుతూ.. జర్మన్ ప్రభుత్వం నర్సుల కోసం ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు అందిపుచ్చుకొని రాష్ట్రంలోని వైద్య విద్యార్థులకు జర్మన్ భాష పై పట్టు సాధించడం కోసం జర్మన్ భాష పై శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీకోసం అనేక అవకాశాలను పొందుపరచడానికి నైపుణ్యాభివృద్ధి సంస్థ వారు అన్ని విధాల సహకారం అందిస్తున్నారు.  ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జర్మన్ భాష చక్కగా నేర్చుకొని అన్ని లెవెల్స్ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళకి జర్మనీ దేశం నందు ఉద్యోగం అవకాశం కల్పించడం కోసం మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.

 

ఇంకా చదవండి: శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!

 

శ్రీ మనోహర్ , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఏపీ ఎస్ఎస్డిసి, జనరల్ మేనేజర్ ఓమ్ క్యాప్ వారు మాట్లాడుతూ.. రాష్ట్రం నలువైపుల నుండి నర్సింగ్ చేసిన విద్యార్థులకు జర్మన్ భాష పై ఆరు నెలలు శిక్షణ ఇచ్చి  వారికి జర్మన్ దేశంలో ఉద్యోగాలు కల్పించడానికి రాష్ట్రం నందు పలుచోట్ల శిక్షణ కార్యక్రమంలో ఏర్పాటు చేసి వారికి జర్మన్ భాష పై పట్టు సాధించడానికి ఉచితంగా శిక్షణ ఇచ్చి A1, A2, B1, B2 లెవెల్ లో అర్హత సాధించడానికి అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు. ఇదివరకే జర్మన్ భాష పై శిక్షణ పొందడానికి రిజిస్టర్ చేసుకున్న ఎనిమిది (8) మంది విద్యార్థులకు ముందస్తు ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు.

 

ఇంకా చదవండి: ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్! పెన్షన్ లపై కీలక ఆదేశాలు! పూర్తి వివరాలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!

 

షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారు? అసలు నిజం ఇదే!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!

 

వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్ల‌డం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!

 

ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!

 

గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!

 

పెన్షన్ దారులకు పండగే పండగ.. ఒకరోజు ముందుగానే పెన్షన్ డబ్బులు! కొన్ని కీలక మార్పులు - కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

 

ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్‌ జారీ! ఎప్పటినుంచి అంటే!

 

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!

 

నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ..తెలంగాణ, తమిళనాడులో పోలీసుల గాలింపు! ఈరోజు ఏపీ హైకోర్టులో..

 

భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Jobs #Unemployment #AndhraPradesh #APPolitics #APNews #Kakinada