నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్! విశాఖ వస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. నెక్ట్స్ ఎవరు?

Header Banner

నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్! విశాఖ వస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. నెక్ట్స్ ఎవరు?

  Mon Dec 02, 2024 13:10        Employment

కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు కనిపించాలంటే.. కంపెనీలు ఏపీకి రావాలి. ఎందుకంటే.. కూటమి ప్రభుత్వం వస్తే, అభివృద్ధి జరుగుతుందనీ, సంపద సృష్టి అవుతుందని ప్రజలు ఆశించారు. భారీ మెజార్టీతో గెలిపించారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలైపోయింది. ఇంకా ఏదీ రావట్లేదే అనే ప్రశ్నలు వస్తున్న సమయంలో.. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) విశాఖకు రాబోతోందనే విషయం.. ఏపీ యువతకు మంచి వార్తే. ఈ కంపెనీ రుషికొండ ఐటీ పార్క్ హిల్‌-2పై ఉన్న నాన్‌ సెజ్‌ ఏరియాలో డల్లాస్‌ టెక్నాలజీస్‌ అనే భవనంలో ఆఫీస్ ప్రారంభించాలని అనుకుంటోంది. ఇందుకోసం ఆ భవనాన్ని లీజుకు తీసుకోనుంది. ఈ లీజు ఒప్పందానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, జీవో జారీ చేసింది. ఈ భవనం పక్కనే ఇన్ఫోసిస్ ఉంది. TCS వస్తే, ముందుగా 2000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటోంది. ఆ తర్వాత ఏపీలో మరిన్ని బ్రాంచ్‌లను తెరిచే ప్లాన్ ఉంది. నిజానికి విశాఖకు ఐటీ రంగాన్ని తేవడానికి 2014లోనే అప్పటి సీఎంగా చంద్రబాబు ప్రయత్నించారు గానీ.. అప్పట్లో ఇంకా రాజధానే సరిగా లేకపోవడంతో.. కంపెనీలు ఆసక్తి చూపలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసినా బలంగా చేస్తోంది. అందువల్ల పెద్ద ఐటీ కంపెనీలను ఆకర్షించడంలో సక్సెస్ అవుతోంది. టీసీఎస్ వస్తే.. మిగతా టాప్ 10 కంపెనీలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. విశాఖలో రుషికొండ పక్క నుంచి.. భీమిలీ వరకూ.. ఐటీ పరిశ్రమను విస్తరించాలని ఏపీ ప్రభుత్వానికి ప్లాన్ ఉంది. విశాఖలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉంది. అలాగే అందమైన బీజ్ ఉంది. డెవలప్‌మెంట్ ఉంది. ఐటీ ఇండస్ట్రీ వచ్చేందుకూ, విస్తరించేందుకూ అన్ని అవకాశాలూ ఉన్నాయి.

 

ఇంకా చదవండి: ఈ సారి నిరుద్యోగులకు పండగే.. మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం! ఉచిత శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు!

 

అందుకే కంపెనీలు ప్రభుత్వ చొరవతో ఇప్పుడు కాస్త ఆసక్తి చూపిస్తున్నాయి. మిగతా రంగాలు ఎలా ఉన్నా.. ఐటీ రంగం వల్ల ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ ఎక్కువగా ఉంటుంది. అది కూడా స్థిరంగా వస్తుంది. తెలంగాణలో హైదరాబాద్‌లో ఐటీ ఇండస్ట్రీ ఉండటం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి భారీగా రెవెన్యూ వస్తోంది. ఏపీలో కూడా ఐటీ కంపెనీలు ఉంటే.. భారీగా రెవెన్యూ పొంది, సంపదను సృష్టించేందుకు వీలవుతుంది. అందుకే సీఏం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో చాలా పట్టుదలతో పనిచేస్తున్నారు. ఇటీవల లోకేష్ విదేశాలకు కూడా వెళ్లి, ఐటీ కంపెనీలను ఏపీకి ఆహ్వానించారు. TCS ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు. ప్రభుత్వం మాత్రం వీలైనంత త్వరగా అన్ని రకాల అనుమతులూ ఇచ్చేలా ప్లాన్ చేసుకుంది. అన్ని శాఖలూ దీనిపై ఫోకస్ పెడుతున్నాయి. సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ 2.0 ద్వారా అనుమతులు ఇవ్వబోతున్నాయి. అందువల్ల 2025 మొదటి లేదా రెండో క్వార్టర్‌లో ఈ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టుల మరో లిస్టు విడుదల?? పార్టీ శ్రేణుల్లో పెరిగిపోతున్న ఉత్కంఠ.. అసహనం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీ కార్యకర్త ఆత్మహత్యపై లోకేశ్ భావోద్వేగ వ్యాఖ్యలు! కష్టాలను చెప్పుకోకపోవడం నా మనసును కలిచివేసింది!

 

బూడిద తరలింపు వివాదం.. ఎమ్మెల్యేపై చంద్రబాబు ఫైర్! ఎందుకు అంటే!

 

మందుబాబులకు కిక్కే కిక్కు.. భారీగా తగ్గిన మద్యం ధరలు! ఆ వివరాలు మీ కోసం..

 

2/12 TO 14/12 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి మరో షాక్.. కొడాలి నాని మెడకు ఉచ్చు - అనూహ్య ట్విస్ట్! కీలక అంశాలు వెలుగులోకి...

 

నాగచైతన్య పెళ్లికి నాగార్జున ఇస్తున్న బహుమతి ఏమిటో తెలుసా? దాదాపు ఎనిమిది గంటల సమయం!

 

వైసీపీకి షాక్.. రోజాపై పోలీసులకు ఫిర్యాదు! ఫొటోలు, వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్!

 

ఏపీలో ప్రజలకు గుడ్ న్యూస్! కొత్త రేషన్ కార్డులు! దరఖాస్తులు ఎప్పటినుంచి అంటే?

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! శ్రీవారి ప్రత్యేక దర్శనం, గోల్డెన్ ఛాన్స్! టోకెన్లు ఇలా...

 

ఏపీ మహిళల అకౌంట్లలో రూ.1,500... ఇది మీరు గమనించారా? అలా అస్సలు చేయవద్దు - ప్రభుత్వం కీలక అప్డేట్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Jobs #Employment #AndhraPradesh #JobMella