యాత్ర తరంగిణి 7: ఆలయం లోపల భాగంలో ఉండే ప్రదేశాలు! వాటి విశిష్టత!

Header Banner

యాత్ర తరంగిణి 7: ఆలయం లోపల భాగంలో ఉండే ప్రదేశాలు! వాటి విశిష్టత!

  Wed Jan 24, 2024 11:10        Devotional, యాత్రా తరంగిణి

దేవాలయ ప్రధాన భాగాలు


దేవాలయంలో ప్రధాన భాగం చతురస్రాకారంలో ఉన్న “గర్భ గృహం” లేదా “గర్భగుడి” ఇది దేవాలయానికి హృదయంలాంటిది. మనుష్య శరీరంలో ఆత్మ దాగి ఉన్నట్టుగా దేవాలయంలో భగవంతుడు కూడా మానవుడికి అత్యంత సులభంగా దృగ్గోచరం కాకుండా ఉండేటట్టు “గర్భ గృహం” లో ఆవాస స్థానం పొంది ఉంటాడు. దీనినే “మూల విరాట్టు” లేదా “మూలబేరం” అంటారు. గర్భగుడిలో ప్రవేశద్వారం తప్పితే మరి ఎలాంటి కిటికీలు ఉండవు. శివాలయాల్లో లింగమే మూలబేరంగా ఉంటుది. గర్భగుడిలో సాధారాణంగా చీకటి అలుముకొని ఉంటుంది.

 

ఈ చీకటి భక్తుణ్ణి విగ్రహం మీదికి దృష్టిని కేంద్రికరింపచేస్తుంది. ఈ లోకాన్ని మరచి తన్మయత్వాన్ని పొందుతాడు భక్తుడు. తనకు తెలీయనటువంటి అనుభూతిని పొందుతాడు. భక్తుడికి భగవదాకర్షణ, సంపర్కం, ఆశీస్సులు ఇక్కడే లభిస్తాయి. గర్భగుడి పైభాగంలో గోపురం ఉంటుంది. దీన్నే విమానం అంటారు. ఇదే దేవాలయ వైభవానికి నిదర్శనం. ఇది సాధారణంగా పోతపోసిన విగ్రహాలతో అలంకరించబడి ఉంటుంది. విమానంమీద శిఖరం ఉంటుంది. దాని మీద కలశం వుంటుంది.

 

మీ  వ్యాపార  ప్రకటనల  కొరకు  ఆంధ్ర ప్రవాసి  డాట్  కామ్  AndhraPravasi.com  ఉచితంగా  అందిస్తున్న  క్లాసిఫైడ్స్  Classifieds  లో  ప్రకటించుకొని  మీ  వ్యాపారాన్ని  అభివృధ్ది చేసుకోండి.

 

గర్భగుడిచుట్టు భక్తులు గుడి తిరగడానికి “ప్రదక్షిణా పథం” ఉంటుంది. వేసర పద్ధతిలో నిర్మించబడ్డ ఆలయాల్లో ఇది ఉండదు. గర్భగుడి ముందు భాగంలో “ముఖ మంటపం” వుంటుంది. దీన్నే “అర్ధ మంటపం” అని “శుకనాసి” అనీ అంటారు. ఇది చతుస్రాకారంలో కానీ, దీర్ఘ చతుస్రాకారంలో కానీ ఉండి ప్రక్కలలో గోపురం కానీ, శిఖరం కానీ కలిగి ఉంటుంది. గర్భగుడి ముఖమంటపాలను మహామంటపానికి (హాలు) కలిపే చిన్నమార్గాన్ని “అంతరాళం” అంటారు. కొన్ని ఆలయాల్లో ముఖమంటంపమే అంతరాళంగా ఉంతుంది. మహామంటపాన్ని “నృత్తమంటపం” లేదా “నవరంగ” అని కూడ అంటారు. అర్థ మంటపం ప్రవేశ ద్వారాల్లో ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. గర్భగుడి లేదా అంతరాళం లేదా మంటపం ముందుభాగంలో ద్వజస్తంభం ఉంటుంది. దానిమీద వున్న లాంఛనం మూలదేవత వాహనం.

 

ద్వజస్తంభం సమీపంలో దేవుడి పాదచిహ్నం లేదా పద్మం వున్న బలిపీఠం ఉంటుంది. బలిపీఠం మీద పరివార దేవతలకు బలి అన్నం పెడతారు. బలిపీఠానికి ఎదురుగా దీపస్తంభం వుంటుంది. సాధారణంగా, దేవాలయం ప్రాకారపు గోడలతో చుట్టబడి ఉంటుంది. దీనికి ప్రధానద్వారం, తక్కిన మూడు ద్వారాలు ఉంటాయి. ఈ ద్వారాలమీద ఆకాశాన్నంటే గోపురాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రాకారం మహద్వారం మీద ఉన్న గోపురాలు అనేక అంతస్తులను కలిగి కళాత్మకంగా ఉంటాయి. కొన్ని దేవాలాయలో 2, 3, ప్రాకారాలు కూడా ఉంటాయి. ప్రాకారం లోపల ప్రధానాలయంతో పాటు మరికొన్ని చిన్న చిన్న మందిరాలు కూడ ఉంటాయి. కళ్యాణమంటపం, యోగశాల, పాకశాల, స్వామిపుష్కరిణి, ఉత్సవమూర్తుల నుంచే గది మొదలగునవి సర్వసాధారణంగా ఉంటాయి. సాధారణంగా శివాలయం పట్టణానికి ఈశాన్య దిశలోను, విష్ణ్యాలయం పశ్చిమదిశలోను, సూర్యదేవాలయం తూర్పు దిక్కులోను, దుర్గ ఆలయాలు ఉత్తరదిశలోను, బ్రహ్మాలయం పట్టణ మధ్యభాగంలోను ఉండాలట.

 

శివాలయం విషయానికి వస్తే లింగం ఎత్తునుబట్టి శివాలయాలు ఉత్తమోత్తమ, ఉత్తమ, మధ్యమ మున్నగు విధాలుగా వర్గీకరించబడతాయి. గర్భగుడిలో లింగంతోపాటు ఇచ్చ, మరియు క్రియా అనే శక్తులు ఉంటాయి. ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. వినాయకుడు, దక్షిణామూర్తి, విష్ణువు లేదా ఆర్థనారీశ్వరుడు, లింగోద్భవ, బ్రహ్మ, దుర్గ మరియు చండీశ్వరాలయాలు సాధారణంగా ప్రధాన ఆలయం చుట్టూ ఉంటాయి. రెండవ ప్రాకరంలో సూర్య, వినాయక, సుబ్రహ్మణ్య, గజలక్ష్మి ఆలయాలు ఉంటాయి. భారతదేశం అంతటా ఇదంతా ఒకే లాగ ఉండదు. శైవాలయాల్లో గర్భగుడికి ముందు నంది విగ్రహం ఉంటుంది వైష్ణవాలయల్లో గర్భ గుడికి ముందు బలిపీఠం, ధ్వజస్థంభాలు కలిగిన గరుడ విగ్రహం ఉంటుంది. తక్కిన చిన్నచిన్న దేవుళ్ళ విగ్రహాలు, ఆలయాలు కూడా ఆలయ ప్రాంగణంలో ఉంటాయి. ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. భక్తులు స్నానం చేయడానికి “తీర్థం” లేదా “పుష్కరిణి” ఆలయ సమీపంలో ఉంటుంది. ప్రసిధ్ధ పుణ్యక్షేత్రాలు, దేవాలయాల చెంత “పుణ్య తీర్థాలు” ఉంటాయి. దైవానికి కాక జలానికి ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలను సాధారంగా “పుణ్యతీర్థాలు” అంటారు.

 

రచయిత : కాపెర్ల పవన్ కుమార్, 9908300831

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 

 

యాత్రా తరంగిణి - దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి? దర్శనం చేసుకునే సమయం లో చేయవలసినది ఏమిటి? ప్రముఖ దేవాలయాల ప్రాముఖ్యత, విశిష్టత, విశేషాలు... వారం వారం మీకోసం...

 

యాత్ర తరంగిణి 6: దేవాలయాల ఎప్పుడు? ఎక్కడ ప్రతీష్టించాలి? శాస్త్రం ఏం చెబుతుంది?

 

యాత్రా తరంగిణి 5: ప్రతి దేవాలయం ఎందుకు అలా ఉంటుంది? సైన్స్ దాగుందా?

 

యాత్రా తరంగిణి 4: దేవాలయాల నిర్మాణం వెనుక ఉన్న అసలు కారణం

 

యాత్ర తరంగణి 3: దేవాలయం లోపల పాటించవలసిన కనీస నియమ నిబంధనలు

 

యాత్ర తరంగణి 2: దేవాలయాలు ఎన్ని రకాలు, వాటి నిర్మాణాలు ఎలా ఉంటాయి, ఉపయోగాలు ఏమిటి...

 

యాత్రా తరంగిణి 1 -గుడి లో సాష్టాంగ నమస్కారం, ప్రదక్షిణం తప్పనిసరా...

 


   #andhrapravasi #YatraTarangini #Devotional #TemplesOfIndia #IndianTemples #TruthBehindTemples #TypesOfTemples #TempleConstruction #TempleVisits #HolyTemples #Spirtuality