భారత్‌లో వివాహాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సిఫార్స్ చేసిన లా కమిషన్! సిఫార్సులు ఇవే!

Header Banner

భారత్‌లో వివాహాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సిఫార్స్ చేసిన లా కమిషన్! సిఫార్సులు ఇవే!

  Fri Feb 16, 2024 21:18        World

ఎన్నారై వ్యక్తులు భారతీయ పౌరులను పెళ్లి చేసుకొని మోసం చేస్తున్న ఘటనలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ సమగ్రమైన కఠిన చట్టం దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ‘లా కమిషన్’ నూతన చట్టం రూపకల్పనకు కీలకమైన సిఫార్సులు చేసింది. ఎన్నారైలకు సంబంధించిన వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలని సూచించింది.

 

ఇంకా చదవండి: గజపతినగరంలో లోకేశ్ శంఖారావం సభ! అప్పల నర్సయ్య కాదు… భూ కబ్జాదారుడు!

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఈ మేరకు ‘ఎన్నారైలు, భారత సంతతి వ్యక్తులతో ముడిపడిన వివాహాల సమస్యలపై సమగ్ర చట్టం’ పేరిట కీలకమైన సిఫార్సులతో కూడిన రిపోర్టును న్యాయ మంత్రిత్వశాఖకు లా కమిషన్ అందజేసింది. ప్రతిపాదిత చట్టం సంపూర్ణంగా, సమగ్రంగా ఉండాలని రిటైర్డ్ జస్టిస్ రీతు రాజ్ అవస్తీ నేతృత్వంలోని కమిటీ కేంద్రానికి సూచించింది.

 

ఇంకా చదవండి:  జగన్ మోసం చేశారనే భావన ప్రతి బీసీ వ్యక్తిలో! పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్!

 

 

ఎన్నారైలు, భారత సంతతి వ్యక్తులతో ముడిపడిన వివాహాలకు సంబంధించిన అన్ని సమస్యలకు చెక్ పెట్టేలా ఉండాలని సూచించింది. ఈ మేరకు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌‌కు రాసిన లేఖలో రిటైర్డ్ జస్టిస్ రీతు రాజ్ అవస్తీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నారైలు భారతీయులను పెళ్లి చేసుకొని మోసగిస్తున్న ఘటనలు పెరిగిపోవడం ఆందోళనకరమని అన్నారు.

ఇంకా చదవండి:  డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామిపై లోకేశ్ ఫైర్! ఇళ్ల స్థలం పేరుతో భారీ కుంభకోణం!

 

జీవిత భాగస్వాములను ముఖ్యంగా స్త్రీలను హానికరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. తీసుకురాబోయే కఠిన చట్టాన్ని ఎన్నారైలకు మాత్రమే కాకుండా భారత సంతతి వ్యక్తులకు కూడా వర్తింపజేయాలని రీతు రాజ్ అవస్తీ సూచించారు. అన్ని వివాహాలను భారత్‌లో రిజిష్టర్ చేయాలన్నారు. విడాకులు, జీవిత భాగస్వామి పోషణ, పిల్లల సంరక్షణ, సర్వింగ్ సమన్లు, వారెంట్లు, జుడీషియల్ డాక్యుమెంట్లు వంటి అంశాలు ఈ చట్టంలో ఉండాలని పేర్కొన్నారు. పాస్‌పోర్ట్‌ను సవరించి జీవిత భాగస్వామి పేరు, వివాహ రిజిస్ట్రేషన్ నంబర్‌ను కూడా పాస్‌పోర్టులో చేర్చేలా పాస్‌పోర్ట్ చట్టం-1967లో అవసరమైన సవరణలు తీసుకురావాలని సిఫార్సు చేశారు.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికాలో "ఊరు పేరు భైరవకోన" నేడే గ్రాండ్ రిలీజ్! 247 థియేటర్స్ లిస్ట్! మీ ఏరియా ఉందేమో చెక్ చేసుకోండి..

 

2నెలలు ఓపిక పట్టండి!! రామతీర్థం బాధితులకు లోకేష్ భరోసా!!

 

కొంతమంది వల్ల చెడ్డపేరు వస్తోంది!! నా మాటలకు కట్టుబడి ఉన్నా!! పవన్ కల్యాణ్...

 

ఏపీ: నిరుద్యోగ యువతకు షాక్!!

 

బ్రిటన్‌పై భారతీయ విద్యార్థుల్లో విముఖత.. యూసీఏఎస్ తాజా గణాంకాల్లో వెల్లడి! తగ్గిన వీసా దరఖాస్తులు!

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #NRI #OCI #NRIsMarrigae #LawCommission #LawMinistry