ఎన్నికల నిబందనలకు విరుద్ధంగా 200 మంది వాలంటీర్లతో ఎమ్మెల్యే మీటింగ్!! తాయిలాలు పంపిణీ

Header Banner

ఎన్నికల నిబందనలకు విరుద్ధంగా 200 మంది వాలంటీర్లతో ఎమ్మెల్యే మీటింగ్!! తాయిలాలు పంపిణీ

  Wed Apr 03, 2024 06:22        Politics

ఎన్నికల నిబందనలకు విరుద్ధంగా 200 మంది వాలంటీర్లతో మీటింగ్ పెట్టిన నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల గణేష్

విషయం తెల్సుకుని అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ.. మెల్లగా అక్కడి నుంచి జారుకున్న ఎమ్మెల్యే పెట్ల గణేష్

గోడలు దూకి పరారైన కొంతమంది వాలంటీర్లు

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

నర్సీపట్నం మున్సిపాలిటీ, వెంకునాయుడుపేటలో వైసీపీ నాయకుని ఇంట్లో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్, మంగళవారం సాయంత్రం వాలంటీర్లతో గుట్టు చప్పుడు కాకుండా సమావేశం నిర్వహించారు. వీరికి తాయిలాలు పంపిణీతో పాటు ఎన్నికల సమయంలో ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై సూచనలు చేసేందుకు ఈ సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులు, సమావేశం జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. ఒక్కసారిగ అవాక్కయిన వైసీపీ నాయకులు వారిని లోపలకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో రెండు వర్గాల మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఈ విషయాన్ని గుర్తించిన కొంతమంది వాలంటీర్లు గోడలు దూకి పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర గణేష్ అక్కడి నుంచి కారులో నెమ్మదిగా జారుకున్నారు. ఈ విషయంపై టీడీపీ నాయకులు అధికారులకు పిర్యాదు చేశారు. ఈ విషయం పై అధికారులు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని భవిషత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు ఆదేశాలు జారీచేయాలని టిడిపి నాయకులు కోరారు. కొంత సమయం గడిచాక లోపల ఎవ్వరూ లేరని అధికారులు, పోలీసులు చెప్పటంతో టీడీపీ నాయకులు ఇంటి ముందు బైఠాయించి, ఆందోళనకు దిగారు. 

 

ఇవి కూడా చదవండి: 

నందిగామలో వైసీపీ దారుణం!!ఎమ్మెల్యేని ప్రశ్నించినందుకు విచక్షణా రహితంగా దాడి!! రౌడీ బ్రదర్స్ తీరుకు ఖంగుతిన్న ప్రజలు

 

ఏపీ హైకోర్టుకు పెన్షన్ల పంపిణీ వ్యవహారం!! ఈసీ ఆదేశాలను కొట్టివేయాలని..

 

గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!

 

పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం!! వారికి ప్రత్యేక ఏర్పాట్లు!!

 

కడపలో పోటీ అంత సులువు కాదు!! బాబాయి చివరి కోరిక తీరుస్తా!! షర్మిల ఘాటు వ్యాఖ్యలు

 

Evolve Venture Capital  

 

ఏపీ ప్రభుత్వానికి RBI నుంచి రూ.4 వేల కోట్ల అప్పు!! అత్యధికంగా అప్పు తెచ్చిన రాష్ట్రంగా రికార్డు

 

కాంగ్రెస్ 114 ఎమ్మెల్యే 5 ఎంపీ స్థానాల అభ్యర్థుల విడుదల! కడపలో అన్నపై చెల్లెలు యుధ్దం

 

ఆన్ లైన్ ద్వారా మీ పాస్ పోర్ట్ లో కొత్త అడ్రస్ ను ఎలా మార్చుకోవాలి! ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి!

  

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #NaraChandraBabuNaidu #Narsipatnam #MLAGanesh #YCP #ElectionCommission #Volunteer #APPeople #APPolice #TDP #2024Election #ElectionCommission #CEC #EC #AndhraPravasi #Pravasi #AndhraPradesh #TeluguMigrants