కోడికత్తి శ్రీను! జగన్‌ను సీఎం చేసే ప్రయత్నం వల్ల ఐదేళ్లు జైలులో.. తన విడుదలకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు.. ఇప్పుడు నేను ఆ పార్టీకి మద్దతు తీస్తాను

Header Banner

కోడికత్తి శ్రీను! జగన్‌ను సీఎం చేసే ప్రయత్నం వల్ల ఐదేళ్లు జైలులో.. తన విడుదలకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు.. ఇప్పుడు నేను ఆ పార్టీకి మద్దతు తీస్తాను

  Sun Apr 28, 2024 13:04        Politics

వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిలుపై బయటకు వచ్చిన కోడికత్తి శ్రీను కుటుంబంతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావించానని, పరిస్థితులు అందుకు అనుకూలించకపోవడంతో టీడీపీలో చేరినట్టు శ్రీను తెలిపారు. జగన్‌ ముఖ్యమంత్రి కావడం కోసం చేసిన ప్రయత్నం వల్ల తాను ఐదేళ్లు జైలులో మగ్గిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అన్ని పార్టీల నుంచి మద్దతు లభించిందని..

 

ఇంకా చదవండి: రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు! నాసిక్ నుంచి స్టాంప్ పేపర్లు..ఆంజనేయులు

 

అయితే తాను అభిమానించిన వైసీపీ నుంచి మాత్రం ఎవరూ సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఈ రోజు బతికి ఉండడానికి ఎస్సీ సంఘాలు, ప్రతిపక్షాలే కారణమన్న ఆయన.. తన విడుదలకు కారణమైన అన్ని పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. కోనసీమ జిల్లాలోని ఠాణేలంకకు చెందిన జనుపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను.. తన అన్న సుబ్బరాజు కుటుంబంతోపాటు గ్రామానికి చెందిన ఎస్సీ కుటుంబాలతో కలిసి కూటమి అభ్యర్థి బుచ్చిబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.  బుచ్చిబాబు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

NRI ల ద్వారా 10,25,000 కోట్ల విదేశీ మారకం భారత్ కు! 88 లక్షల గల్ఫ్ కార్మికుల సంక్షేమం ఎక్కడ? గల్ఫ్ జేఏసీ సూటి ప్రశ్నలు!

 

సింగపూర్, హాంగ్‌కాంగ్ విధించిన నిషేధంపై! ఎమ్‌డీహెచ్ మసాలా స్పందన! 100 శాతం సేఫ్!

 

తస్మాత్ జాగ్రత్త! ఫేషియల్ వల్ల వ్యాపిస్తున్న హెచ్ఐవీ! కానీ దాని ఆదరణ మాత్రం తగ్గడంలేదు!

 

యాత్రా తరంగిణి 18: అగస్త్య మహర్షి సందర్శించిన మోపిదేవి క్షేత్రం! అక్కడ జరిగే ప్రత్యేక పూజలు, పురస్కారాలు!

 

తస్మా జాగ్రత్త! మీ పిల్లలకి నెస్లే ఫుడ్స్‌ పెడుతున్నారా? అయితే ఇప్పుడే అప్రమత్తం అవ్వండి.. భారత్‌లో నెస్లే నిబంధనల ఉల్లంఘన!

 

అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్.. ఎప్పుడు మొదలవుతుందంటే.. ఈసారి అమెజాన్ లో సమ్మర్ సేల్ అదిరిపోయింది గురు..

 

సింగపూర్ ఎయిర్ లైన్స్ నకిలీ పైలెట్ హల్ చల్! పలు నరాల్లో నిందితుడు! అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #TDP #KodiKathiCase #KodiKathiSrinu #Telugudesam #YSRCP #YSJagan