ఏపీకి ప్రధాని మోదీ శుభవార్త - రూ 80 వేల కోట్ల పెట్టుబడులు! ఆ ప్రాజెక్ట్ ఇక వేగవంతం - 48వేల మందికి ఉపాధి!

Header Banner

ఏపీకి ప్రధాని మోదీ శుభవార్త - రూ 80 వేల కోట్ల పెట్టుబడులు! ఆ ప్రాజెక్ట్ ఇక వేగవంతం - 48వేల మందికి ఉపాధి!

  Fri Nov 15, 2024 10:42        Politics

ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. ఈ నెల 29న మోదీ ఏపీకి రానున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప్రధాని పర్యటన గురించి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారికంలోకి వచ్చిన తరువాత ప్రధాని పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం కావటంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ కేంద్రంగా రూ 80 వేల కోట్ల పెట్టబడులతో స్థాపిస్తున్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ నెల 29న ప్రధాని మోదీ ఎన్టీపీసీ రూ.80వేల కోట్ల పెట్టుబడులతో స్థాపించనున్న గ్రీన్‌ అమ్మోనియా, గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లతోపాటు గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కులకు శంకుస్థాపన లో పాల్గొంటారు. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన చేసారు. ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఇప్పటికే 1200 ఎకరాలు కేటాయించింది. గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లో 20 గిటావాట్‌ల విద్యుత్తును ఎన్టీపీసీ ఉత్పత్తి చేయనుంది.

 

ఇంకా చదవండి: డిప్యూటీ సీఎం కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ను కలిసిన మేనల్లుడు! ఎందుకు అంటే!

 

ఈ రెండు భారీ ప్రాజెక్టుల వల్ల నాలుగేళ్లలో 48వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే కేంద్రం నుంచి అమరావతి, పోలవరం కు సంబంధించి కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంది. విశాఖలో రైల్వే జోన్.. అమరావతి నూతన రైల్వే లైన్ పనుల ప్రారంభం ప్రధాని చేతుల మీదుగా చేయించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ పర్యటన సమయంలోనే విశాఖ రైల్వే జోన్ పనులను సైతం ప్రధాని ప్రారంభించే అవకాశం ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్నారు. ఒక మీడియా సంస్థ నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొంటారు. పలువురు కేంద్ర మంత్రులతోనూ సమావేశం కానున్నారు. రైల్వే శాఖ మంత్రితో సమావేశం సమయంలో విశాఖ రైల్వే జోన్ పనుల ప్రారంభ ముహూర్తం పైన నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతి పనులు వచ్చే నెల నుంచి ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో కేంద్ర మంత్రివర్గం అమరావతి కి 54 కిలో మీటర్ల మేర కొత్త రైల్వే లైన్ కు ఆమోదం తెలిపింది. ఈ పనుల ప్రారంభం ప్రధానితో చేయించాలని చంద్రబాబు కోరుతున్నారు. ఈ ఢిల్లీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగే అవకాశం ఉంది. ఇక.. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ భూ సేకరణ నిధులు భరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ప్రధాని పర్యటన ఖరారు కావటంతో.. కూటమి నేతలు ఈ టూర్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రధాని రాక వేళ భారీ ఏర్పాట్లకు నిర్ణయించారు.


ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?

 

నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!

 

ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?

 

నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!

 

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!

 

వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!

 

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!

 

మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Modi #AndhraPradesh #APPolitics #NaraLOkesh #Chandrababu #ModiMeeting #Anakapalli