ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పడిపోతున్న బంగారం ధరలు! ఇప్పటి వరకు ఎంత తగ్గిందంటే!

Header Banner

ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పడిపోతున్న బంగారం ధరలు! ఇప్పటి వరకు ఎంత తగ్గిందంటే!

  Fri Nov 15, 2024 10:32        Business

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు అమాంతం పెరిగిన బంగారం ధరలు.. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక క్రమంగా తగ్గుముఖం పడుతూ రూ.80 వేల దిగువకు చేరుకున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌కు ముందు ధరలు దిగివస్తుండడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత మల్టీ కమోడిటీ ఎక్స్‌చేంజ్ (ఎంసీఎక్స్)లో పుత్తడి ధరలు 6 శాతం క్షీణించాయి. ఫలితంగా ఈ నెల 4వ తేదీ తర్వాతి నుంచి ఇప్పటి వరకు 10 గ్రాములకు ఏకంగా రూ. 4,750 తగ్గింది. దీంతో బంగారం కొనుగోళ్లు మళ్లీ ఊపందుకున్నాయి. బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయమని నేషనల్ ఇండియా బులియన్ అండ్ జెవెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) కార్యదర్శి సురేంద్రమెహతా తెలిపారు. అమెరికా ఆర్థిక వృద్ధికి ట్రంప్ కనుక చర్యలు తీసుకుంటే బంగారం ధరల తగ్గుదల స్థిరంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో నిన్న 10 గ్రాముల బంగారంపై రూ.700 తగ్గి రూ. 77 వేల స్థాయికి చేరుకుంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల పసిడి ధరపై రూ.1200 తగ్గి రూ. 75,650గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 1100 తగ్గి రూ. 70 వేల దిగువకు పడిపోయింది. నిన్న మార్కెట్ ముగిసే సమయానికి రూ. 69,350గా రికార్డయింది. అదే సమయంలో వెండి ధర కూడా కిలోకు రూ. 2,310 తగ్గి రూ. 90,190కి దిగొచ్చింది. అదే సమయంలో హైదరాబాద్‌లో కిలో వెండిపై రూ. 2 వేలు తగ్గి రూ. 99 వేలుగా నమోదైంది.


ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!

 

ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకు? ఎప్పుడు అంటే?

 

నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్!

 

గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు - కేబినెట్ భేటీ! మహిళలకు ఫ్రీ బస్, రైతుల ఖాతాల్లో రూ 20 వేలు!

 

వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ మాజీ కీలక నేత! 50 మంది వరకు వైసీపీ నేతలు టీడీపీలో!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరు అంటే!

 

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్! ఆడబిడ్డ నిధి పథకం.. నెల నెలా మహిళల అకౌంట్లో రూ.1,500!

 

మందుబాబులకు కిక్కే కిక్కు.. మరో కొత్త రకం మందు వచ్చేసింది! అతి తక్కువ ధరకే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #GoldRate #Gold #Dubai #DubaiGoldRate #DubaiGoldBusiness #GoldRateLow #LessGoldRateInDubai #UAE #GoldBusiness #LowPriceGoldInDubai