రూ.1,000 నోట్లు మళ్లీ వస్తున్నాయా.. రూ.500 నోట్ల రద్దు ఉందా? ప్రభుత్వం ఏం చెప్పిందంటే!

Header Banner

రూ.1,000 నోట్లు మళ్లీ వస్తున్నాయా.. రూ.500 నోట్ల రద్దు ఉందా? ప్రభుత్వం ఏం చెప్పిందంటే!

  Tue Dec 24, 2024 16:00        Politics

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు తర్వాత తీసుకున్న మరో కీలక నిర్ణయం.. రూ.2000 నోటు రద్దు. ఇప్పటికే ఇవి దాదాపు రిజర్వ్‌ బ్యాంక్‌ వద్దకు చేరాయి. చాలా తక్కువ మొత్తంలోనే బయట ఉన్నాయి. రూ.2 వేల నోటు రద్దు తర్వాత ఇప్పుడు సర్క్యులేషన్‌లో ఉన్న పెద్ద నోటు రూ.500 మాత్రమే. అయితే త్వరలో దీనికంటే పెద్ద నోటును రిజర్వ్‌ బ్యాంక్‌ లాంచ్‌ చేస్తుందని కొన్నాళ్ల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే రూ.500 కంటే ఎక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే ఆలోచన ఏదీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వం అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను ముంద్రించే ఆలోచనలో ఉందా? అని రాజ్యసభలో ఎంపీ ఘనశ్యామ్‌ తివారీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పందిస్తూ, ‘లేదు సర్’ అని స్పష్టమైన సమాధానం ఇచ్చారు.

 

ఇంకా చదవండి: ఇలాంటి తండ్రి కూడా ఉంటాడా! ఛీ.. ఛీ.. అప్పు కోసం కూతుర్ని ఏం చేశాడో తెలిస్తే షాక్!

 

ఈ ఆన్సర్‌తో పెద్ద నోట్లకు సంబంధించి ప్రజల్లో ఉన్న ఊహాగానాలకు తెరదించినట్లు అయింది. ఘనశ్యామ్‌ తివారీ ఎక్కువ డినామినేషన్ నోట్ల గురించి అడగడంతో పాటు రూ.2000 బ్యాంక్ నోట్ల గురించి పూర్తి వివరాలను కోరారు. ఈ నోట్లను ఉపసంహరించుకున్న తర్వాత వాటి ప్రవేశం, చలామణి, వాటి స్థితిగతులపై ప్రశ్నలు అడిగారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934లోని సెక్షన్ 24(1) ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2016 నవంబర్‌లో రూ.2000 నోట్లను ప్రవేశపెట్టిందని పంకజ్‌ చౌదరి వివరించారు. 2017 మార్చి 31న ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి, రూ.32,850 లక్షల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయి. 2018 మార్చి 31 నాటికి ఈ సంఖ్య రూ.33,632 లక్షలకు కొద్దిగా పెరిగింది. 2023 మే 19న కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల నోటును ఉపసంహరించుకుంటున్న ప్రకటించింది.

 

ఇంకా చదవండి: ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు! పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన!

 

ఆ సమయంలో రూ.17,793 లక్షల రూపాయల రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. వీటిలో 2024 నవంబర్ 15 నాటికి రూ.17,447 లక్షల నోట్లు రిజర్వ్‌ బ్యాంక్‌కి తిరిగొచ్చాయి. ఇంకా రూ.346 లక్షల నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు. ప్రజలు ఇప్పటికీ తమ రూ.2000 నోట్లను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ముందు బ్యాంకుల్లో ఎక్స్ఛేంజ్‌, డిపాజిట్‌ చేసే అవకాశం ఉండేది. కానీ ఆ గడువు ముగియడంతో ఇప్పుడు ప్రజలు రిజర్వ్‌ బ్యాంక్‌కి చెందిన 19 ఇష్యూ ఆఫీసుల్లో ఎక్కడైనా ఎక్స్‌ఛేంజ్ చేయవచ్చు. లేదా వారి బ్యాంక్ అకౌంట్‌లో రూ.2వేల నోట్లు డిపాజిట్‌ చేసుకునేందుకు ఇండియా పోస్ట్ ద్వారా ఆయా ఆర్‌బీఐ ఆఫీస్‌లకు పంపవచ్చు.

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కారు! ఇకపై ఆ తరగతుల విద్యార్థులు మస్ట్​గా పాస్​ కావాల్సిందే - లేదంటే!

 

బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!

 

డబ్బులు కడితే దొంగ దొర అవుతాడా? పదేపదే నీతులు వల్లించే వైసీపీ నేత! మాజీ మంత్రి పై మంత్రి ఫైర్!

 

2025 జనవరితో ఆ ఫోన్లలో వాట్సాప్‌ సేవలు బంద్! బ్యాకప్ లేకుంటే మీ డాటా పోయినట్టే!

 

USAలో మ‌రో తెలుగు విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి! ఎవరు? ఎందుకు? దీని వెనుక ఎవరి హస్తం!

 

నేడు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Modi #AndhraPradesh #APPolitics #NaraLOkesh #Chandrababu #ModiMeeting #Anakapalli